Monday 27 May 2013

మధుయాష్కి ఆరోపణల మతలబు

మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో, ఎవరిని పొగుడుతారో అర్దం కాని రాజకీయాలు ఏర్పడ్డాయి.గతంలో పొగిడిన, లేదా విమర్శించిన విషయాలను మర్చిపోతుంటారన్న సంగతి మధు యాష్కి వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.మధు యాష్కి తనను కెసిఆర్ గతంలో తెలంగాణ జాతి రత్నం అన్నారని, ఇప్పుడు తెలంగాణ బుడ్డర్ ఖాన్ అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.సీట్లు ,నోట్లు,ఓట్ల రాజకీయం చేస్తున్న కెసిఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తాను ల్యాంకోలో పెట్టుబడులు పెట్టలేదని,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని, న్యూజెర్సీలో స్ట్రిప్ మాల్ కొనలేదని, బతకమ్మ పేరుతో కోట్లు వసూలు చేయలేదని అన్నారు. శాసనసభ ఉప సభాపతి అయినప్పుడు కెసిఆర్ ఆస్తులెంత?ఇప్పుడు ఆస్తులు ఎంత విచారణకు సిద్దమా?అని మధుయాష్కి సవాలు చేశారు.కేవలం కాంగ్రెస్ ఎమ్.పిలను టిఆర్ఎస్ లోకి వెళ్లకుండా తాను అడ్డుపడుతున్నానని భాధతోనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.వంద సీట్లు వస్తేతెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మొత్తం మీద కెసిఆర్ కుటుంబానికి చెందినవారి పై ఆ పార్టీ నుంచి సస్పెండైన రఘునందనరావు తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తే, కాంగ్రెస్ ఎమ్.పి మధు కొత్త ఆరోపణలను గుప్పించి కెసిఆర్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించడం విశేషం

0 comments:

Post a Comment