Tuesday 7 May 2013

హీరో రామ్ చరణ్ బాధితులను పోలీసులు బెదిరించారా?

కారు వెళ్ళేoదుకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు చితకబాదిన రాoచరణ్ సెక్యూరిటీ పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కేసు నమోదు చేయకపోగ బాధితులనే పోలీసులు బెదరగొట్టి పంపారని, పై నుంచి వచ్చిన ఒత్తిల్లు ఆ మేరకు పనిచేశాయని తెలుస్తోంది. అయితే, ఈ దాడికి సాక్ష్యంగా ఫోటో లు లబించాయీ . జివికే బస్ స్టాప్ వద్ద ఆదివారం మధ్యానం నడిరోడ్డుపైనే రాంచరణ్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన ఫనిష్, కళ్యాణ్ ల పై దాడిచేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిని సైతం బెదిరించి మరి 20 నిమిషాల పాటు కొట్టారు. ఈ ఘటనలో బాధితుల్లో ఒకరికి పెదవి చిత్లిపోగా.... మరొకరికి ఎండలో నిల్చొని కాళ్ళు బొబ్బలేక్కాయి. జరుగుతున్న తతoగాన్నoతా రాంచరణ్ చూస్తూనే ఉన్నారు. ఆయన సూచన మేరకే ఈ దాడి జరిగిందన్న ఆరోపణలున్నాయి. పత్రిక ప్రతినిధులు వస్తున్నారన్న సమాచారంతో ఒక సెక్యూరిటీ ఆయన్ను పక్కకు తీసుకెళ్ళారు. ఆదివారం మధ్యాహ్నమే ఈ ఘటన జరిగినా బాధితుల నుంచి ఫిర్యాదు లేదంటూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. సాక్ష్యం లేదంటూ సాకులు చెప్పారు. బాదితులను కొట్టిందేవరో కనీసం విచారించను కూడా లేదు. దాడికి సాక్ష్యంగా ఫోటోలు లభించాయి. మరి పోలీసులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి. 

0 comments:

Post a Comment