Sunday 28 April 2013

గులాబీ గూటికి కడియం శ్రీహరి!

సైకిలు దిగి కారెక్కుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏళ్ల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు గులాజీ కండువా కపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తమ ప్రాంతంపై రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న పచ్చ పార్టీ అధినేత తీరుతో విసిగిపోయిన నేతలు గలాబీ దళంలో చేరేందుకు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సంక్లిష్ట సమస్యపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన టీడీపీ అధ్యక్షుడి దాటవేత ధోరణి తమ భవిష్యత్ రాజకీయ జీవితానికి ముప్పుగా మారే అవకాశముందన్న ఆందోళనతో తెలంగాణ నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోని నేతల వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాదయాత్రతో పార్టీకి ఊపు వచ్చిందని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇటీవలే గులాబీ చేరిన సంగతి తెలిసిందే. మరో మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ కూడా టీఆర్ఎస్ బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే గులాబీ గూటికి చేరగా... వేణుగోపాలచారి, జోగురామన్న, నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చారు.

కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ఖరారైంది. టీఆర్ఎస్ లో 'సీటు' ఖాయమడంతో టీడీపీని వదిలివెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనయుడు, ఎమ్మెల్యే కె.తారక రామారావు శుక్రవారం(ఏప్రిల్ 26) శ్రీహరి నివాసానికి వెళ్లి సుమారు రెండున్నర గంటల పాటు 'ఒప్పందం'పై మంతనాలు సాగించారు. కేసీఆర్ కూడా ఫోన్‌లో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తామని కడియంకు కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కారు ఎక్కాలని కడియం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. మే నెల మొదటివారంలో ఆయన కేసీఆర్ పార్టీలోకి వెళ్లనున్నారు.

ముందుగా వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని గులాబీ దళం అధినేత ఆఫర్ చేయడంతో వలస నేతలు తొందర పడుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరితే ఆయనను కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం, పెద్దపల్లి ఎంపీ వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్టున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే వీరు కారెక్కే అవకాశ ముందంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర టీడీపీ నేతలను, అధిష్టానం బుజ్జగింపులు కాంగ్రెస్ నేతలను గడప దాటకుండా ఆపలేకపోతున్నాయి. ఇంకెంత మంది నేతలు గులాబీ గూటికి చేరతారో వేచిచూడాలి!

వైఎస్సార్ తో బాబుకు పోలిక లేదు: ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం: వైఎస్సార్ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు వచ్చిన వారంతా తెచ్చిన జనమేనని, స్వచ్ఛందంగా వచ్చిన జనం కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ మినహా ఇతర ఏ పార్టీ సీబీఐని విశ్వసించటం లేదన్నారు.

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు ఉరి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కు చివరి అవకాశంగా తెలంగాణ సత్యగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత శ్రీనివాస గౌడ్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉరి తీయబడుతోందని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడతారో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తే తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమయిన కారణంగానే తాము దీక్ష చేపట్టామని 'సాక్షి'తో శ్రీనివాస గౌడ్ చెప్పారు.

YS జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష


షర్మిల వద్ద ఖమ్మం జిల్లా గిరిజనుల ఉద్వేగం
కరెంటు చార్జీలు, పెరిగిన ధరలతో కుదేలైపోతున్నామని ఆవేదన
జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్ష
ఎన్నికలు పెట్టి చూస్తే తెలుస్తుందంటూ సర్కారుకు సవాల్

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాగరికపు మాయామర్మం తెలియని అమాయక గిరిజనులు వాళ్లు.. సమాజానికి దూరంగా అడవిలోకి విసిరేసినట్టుగా అక్కడక్కడ వారి తండాలు. మన్ను పండితే దేవుడికి దండం పెట్టి పండగ చేయడం... కరువొస్తే పస్తులుండటమే వాళ్లకు తెలుసు. సాయం చేసినోళ్లను గుండెల్లో పెట్టుకోవడం.. వాళ్ల సహజ గుణం. ఖమ్మం జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో సాగుతున్న షర్మిల.. బూడిదంపాడు వద్ద ఆ గిరిజనాన్ని చూసి ఓ మర్రి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని వారితో మాట్లాడారు.
కడుపులో కల్మషం లేకుండా, కుండబద్ధలు కొట్టినట్టు ఆ గిరిజనులు ఆమెతో మాట్లాడారు. పెరిగిన కరెంటు చార్జీలు, నిత్యావసరాల ధరలతో తాము కుదేలైపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ తరఫున పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు. ‘‘జగన్‌రెడ్డిని జైల్లో పెట్టామని సంబరపడుతున్నారు... జగన్ జైల్లో లేడు.. మా గుండెల్లో ఉన్నాడు. వైఎస్సార్ మా పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్నాడు. ఒక్కసారి ఎన్నికలు పెట్టి సూడురి జగన్ ఎక్కడున్నాడో చూపిస్తాం’’ అని ఆ గిరిజన మహిళలు.. పాలకులకు సవాల్ విసిరారు. రచ్చబండలో సంభాషణ సాగిందిలా..

షర్మిల: అమ్మా..అయ్యా! మీలో మాట్లాడాలనుకునే వాళ్లుంటే చెయ్యి లేపండి, మీకు మైకిస్తాం. మహిళలు మాట్లాడిన తరువాత రైతులు, విద్యార్థులు కూడా మాట్లాడవచ్చు. 

భూక్యా కౌసల్య: అందరికీ నమస్కారం! వైఎస్సార్ ఉన్నప్పుడు మేం ఎంత మంచిగున్నమో.. అంత మంచిగున్నాం. ఏనాడు ఇబ్బంది కలుగలే మాకు. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ లెక్కజేయట్లేదు. బేంకుకు పోతే ఏ.. ఏందమ్మా ఎందుకొచ్చినవ్ అంటరు. కరెంటు బిల్లు ఇష్టమొచ్చినట్టు కట్టుకుండ్రు. ఒక్క బలుబుకు రూ.1000 కట్టుకుంటున్నరు. మేం బతకాలంటే చాలా కష్టమయితంది.

షర్మిల: వ్యవసాయం ఎలా ఉందమ్మా?
భూక్యా రాణి: వ్యవసాయం సేత్తాన్నామని మాటే కానీ ఎన్నడూ గింజ సేతికి రాలేదు. విత్తనం వేసినప్పుడు వానాలు రావు. సేను నోటికాడికి వచ్చినప్పుడు వరదొచ్చి మొత్తం కొట్టుకొని పోతది. ఆసుపత్రికి పోతే రూపాయికి రెండు రుపాయలు రాత్తున్నరు. జగన్ రావాలె.. అప్పుడే మేం తినాలె.

షర్మిల: ఏం పంటలు వేసుకున్నారు తల్లి?
అల్లం సీతమ్మ: పత్తి తోట పెట్టుకున్నావమ్మా, ఐదెకరాలేసినాగాని ఐదు కింటాలు రాలే. మందు కట్టల కు పోతే రూ.1000, రూ.2000 కట్టుకుట్టున్నరమ్మా.

షర్మిల: దిగుబడి తగ్గిందా తల్లి?
సీతమ్మ: అవునమ్మా... నీళ్లు లేక పత్తి ఎల్లలేదమ్మా.

షర్మిల: పొలానికి కరెంటు ఎంత సేపు వస్తుంది?
బదావత్ కమ్లీ: అప్పుడప్పుడు అర్ధ గంట ఇడుస్తరు. మొత్తం 2 గంటలు కూడా ఇడువరమ్మా. అప్పుకోసం బేంకుకు పోతే బయటికి నెట్టేత్తున్నరు.

షర్మిల: అసలు రుణాలు రావడం లేదా? పావలా వడ్డీ రుణాలు రావడం లేదా?
తేజావత్ ప్రమీల: అసలు రుణాలే ఇత్తలేరమ్మా. టీవీల కిరణ్‌కుమార్‌రెడ్డి వడ్డీ లేకుండనే అప్పులు ఇత్తున్నామని చెప్తున్నడు. బేంకుకు పోతే.. ఎల్లి.. ఆడికిపోయి అడుగుపో అని మేనేజర్ అంటడు.

షర్మిల: కొద్దిగా ఓపిక పట్టండి ... త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. మీ అందరికీ వడ్డీ లేని రుణాలు వస్తాయి.

YS షర్మిల ఎడమ కాలుకు గాయం ,పాదయాత్రకు విరామం

బుడిదంపాడు:షర్మిల ఎడమ కాలు మడమకు గాయం అయింది. పాదయాత్రలో భాగంగా ఆమె బుడిదంపాడు రచ్చబండలో పాల్గొని బయలు దేరారు. కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి ఆమె కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది. గతంలో షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన డాక్టర్ సీఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎస్ రెడ్డి షర్మిలకు ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే షర్మిల కొంతదూరం నడిచి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ సీఎస్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మడమ భాగంలోని కండరానికి గాయమైందని, కనీసం ఒకరోజు విరామం తీసుకోవాలని వారు సూచించారు. దీంతో సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత యాత్ర తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.

వైయస్‌ జగన్ ఫోబియాతో బాబుకు మతిచలించింది

శ్రీకాకుళం, 28 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ ఫోబియా‌ కారణంగా చంద్రబాబుకు, కాంగ్రెస్‌ నాయకులకు మతిచలించిందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికలోనూ టిడిపి అభ్యర్థులు గెలవలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌ను, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడానికే కాలం వృథా చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని కృష్ణదాస్ ‌అన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో విస్తృతంగా చేరికలు

తాడిపత్రి (అనంతపురం జిల్లా), 28 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి పార్టీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యం అని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనితో అనేక మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిత్రచేడు, మొలకతాళ్ల, గోపురాజపల్లి, రాంపురం గ్రామాల్లోని 500 కుటుంబాల వారు ఆదివారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చిత్రచేడులో జరిగిన కార్యక్రమంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌‌ రెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
వరంగల్‌లో 200 మంది చేరిక :
వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు రాజా వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు చెందిన‌ 200 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

విశాఖపట్నంలో 100 మంది టిడిపి కార్యకర్తలు చేరిక :
విశాఖపట్నం జిల్లా ఆనందపురానికి చెందిన 100 మంది టిడిపి కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. కోరాడ రాజబాబు సమక్షంలో ‌వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

Stampede, lathicharge in Minister Chiru meeting


Gowribidanur, April 28: There was a stampede when the union minister Chiranjeevi came to campaign in some of the areas of Telugu population of Karnataka, on behalf of Congress.

In Gowribidanur, a place with a thick population of Telugu settlers, fans of the former Mega Star pushed each other, to have a look at him. There was stampede. Police had to lathi-charge the crowds to bring order. Chiranjeevi is going to tour areas with Telugu population asking the people to vote for Congress. It may be recalled that union minister and late N T Rama Rao’s daughter Purandareswari also toured some of the areas with Telugu population and

YS Sharmila Speech In Mucherla, Khammam District


చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ













చేవెళ్ళ రచ్చబండ లో పాల్గోన్న శ్రీమతి వైయస్ విజయమ్మ 

మరో ప్రజాప్రస్థానం 15-04-2013
















జనం కొసం జగన్