Thursday 23 May 2013

కొత్త కార్పోరేషన్ల పై ఊహాగానాలు

కొత్త కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ గా శ్రీకాకుళం నకు చెందిన సీనియర్ నేత త్రిపురాన వెంకటరత్నం , ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నిజామాబాద్ కి చెందిన గంగాధర్ పేరు వినిపిస్తున్నాయి . ఇవే నిజమైతే పార్టీలో మాజీ పీసీసీ ఛీప్ డీ.ఎస్ కు పలుకుబడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగాధర్ డీ.ఎస్ కు అనుచరుడుగా ఉండంటం, అలాగే త్రిపురాన కూడా డీ.ఎస్ సిఫార్సు చేసినవారు కావడం విశేషం. దీంతో డీ.ఎస్ కు మళ్ళీ గిరాకీ పెరిగిందని చెప్పక తప్పదు. 

టీడీపీ లోకి మాజీ మంత్రి డీకే సమరసిం హా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి డీకే సమరసిం హా రెడ్డి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసారు. గత కొంతకాలం గా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్నారు. మహబూబ్ నగర్ లో గతం లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిద్యం వహించారు . డీకే చేరిక తో టీడీపీ కి మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ పొటీ చేస్తారన్నది ఇంకా తెలియనప్పటికీ సీనియర్ గ డీకే సేవలు పార్టీ కి ఉపయోగపడతాయని మహబూబ్ నగర్ నేతలు చెప్తున్నారు. అయితే డీకే కు గతం లో ఎవరితోనూ పడని చరిత్ర వుంది. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపి, టీఅరెస్ లోకి మారిన డీకే ఇప్పుడు టీడీపీ నిలదొక్కుకోగలరా అనేది ప్రశ్నార్ధకమేనని రాజకీయ విశ్లేషకుల వ్యాక్యానిస్తున్నారు .

YS జగన్‌ను టార్గెట్‌ చేస్తే కాంగ్రెస్‌కే నష్టం: శంకర్రావు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని మీడియా సర్వేలే చెబుతున్నాయని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మధ్య విభేదాలతో పార్టీ కేడర్ డీలా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను నమ్ముకుని పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని సూచించారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులను తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ను అదేపనిగా టార్గెట్‌ చేయడం కాంగ్రెస్‌కే నష్టమని శంకర్రావు అన్నారు. 

చంద్రబాబుకు గద్దె పవర్ ఫుల్ డైలాగ్


ఒకపక్కన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంస్కరణల గురించి నల్లధనం గురించి మాట్లాడుతుంటే, ఆయన పార్టీకి చెందిన మాజీ ఎమ్.పి గద్దె రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.చంద్రబాబు నాయుడు డబ్బున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని గద్దె వ్యక్తం చేయడం విశేషం.పైగా గద్దె పవర్ ఫుల్ డైలాగులు వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. రాజకీయాల్లో డబ్బు ప్రధానమని, అయితే డబ్బే రాజకీయం కాదని ఆయన ఘాటుగా మాట్లాడారు. టీడీపీ తరఫున ఎంపీ సీటు ఇస్తే తాను డబ్బు ఖర్చు పెడతానని రామ్మోహన్ ప్రకటించారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు డబ్బు ఖర్చుపెడితే.. ఎప్పటినుంచో పార్టీలో ఉండి డబ్బు ఖర్చుపెడుతున్నవారి పరిస్థితి ఏంటని గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు.ఎంపీ సీటు తన డిమాండ్ అని... అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటానని గద్దె తెలిపారు.కేశినేని ట్రావెల్స్ సంస్థ అధినేత కేశినేని నాని కి విజయవాడ టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారన్న సమాచారం గద్దెకు జీర్ణం కావడం లేదు.దాంతో ఆయన తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టారు.

జూన్ 3న బీజేపీలో చేరుతా: నాగం జనార్ధన్ రెడ్డి

వరంగల్‌: వచ్చేనెల 3 తేదిన బీజేపీలో చేరుతానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేస్తానని ఓ ప్రశ్నకు నాగం సమాధానమిచ్చారు. మహబూబ్‌నగర్‌ లోకసభ స్థానం బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తానని నాగం తెలిపారు. 

YSజగన్ విడుదల కోసం ప్రత్యేక పూజలు!

ఆలూమూరు: జగన్‌ జైలు నుంచి విడుదల కావాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలుమూరు మండలం జొన్నాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ విడుదల కోసం జగ్గిరెడ్డి చేపట్టిన యాత్రకు మద్దతుగా వైఎస్ఆర్‌ సీపీ నాయకులు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, సీబీఐలు కుమ్మక్కై జగన్ ను జైల్లో పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు.