Tuesday 14 May 2013

మాట మీద నిలబడినందుకే ప్రజలంతా YS జగన్ వైపు


ఒకే ఒక్కమాట... నల్లకాలువలో అడవితల్లి సాక్షిగా ఇచ్చిన మాట.... ‘నా తండ్రి అకాల మరణం తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను. ఓదారుస్తాను’ అని ఇచ్చినమాట. ఆ మాటకు కట్టుబడినందుకే కాంగ్రెస్ జగన్‌ని కాదనుకుంది. పొమ్మనలేక పొగబెట్టింది. జగన్ మాత్రం ఇచ్చినమాటకు కట్టుబడి తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్‌పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. లీడర్ అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపారు. మాట తప్పని, మడమ తిప్పని ఆ నైజం నచ్చి జనం జగన్‌ని తమ గుండెలకు హత్తుకున్నారు. ఫలితం... కడప పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికల్లో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆధిక్యత. అది చూసి ఓర్వలేని కాంగ్రెస్‌పార్టీ కన్ను మళ్లీ జగన్‌పై పడింది.

అయినా జగన్ లొంగలేదు. దాంతో కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా కలసి ఆయన్ని అరెస్టు చేయించాయి. అయినప్పటికీ జగన్ ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉండడం చూసిన కాంగ్రెస్ ఉక్రోషంతో ఆయనకు బెయిల్ రాకుండా చేస్తోంది. ఈ విషయాలన్నీ ప్రజల దృష్టిని దాటిపోలేదు. అందుకే వారు జగనన్న వైపే ఉన్నారు. ఎప్పటికీ జగనన్నతోనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పట్టం కడతారు.
- ఎద్దు వెంకటేశ్వర్లు, గార్ల, ఖమ్మం

జగన్‌ని నైతికంగా ఎదుర్కోలేకే ఈ దుష్టశక్తులన్నీ ఏకమయ్యాయి..!
జగన్‌గారిని అరెస్టు చేసి ఏడాది కావస్తోంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఆయన్ని నిర్బంధంలో ఉంచుతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం! జగన్ ఓదార్పుయాత్ర చేయడం గిట్టని కొన్ని శక్తులు కాంగ్రెసు అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపి ఆయనకు అన్నివిధాలా అవరోధాలు కల్పించారు. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం, ప్రజల కష్టాలలో పాలుపంచుకోవడం వంటి గుణాలను తండ్రి నుండి నేర్చుకున్న జగన్... తను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజా సంక్షేమం కోసం నూటపాతిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను వీడి ఏ క్షణమైతే బయటికి వచ్చారో ఆ క్షణం నుంచే ఆయనపై కాంగ్రెస్ వేధింపులు మొదలయ్యాయి.

కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టిన మూడుపదుల తెలుగుదేశంపార్టీ ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేయి కలిపి ఆయనపై దుష్ర్పచారం చేస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఎల్లో మీడియా వంత పాడడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక్క వ్యక్తిని ఎదుర్కొలేక ఇన్ని శక్తులు కుయుక్తులు పన్నడం చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారాయా అని బాధ కలుగుతోంది. రాజశేఖర్‌రెడ్డిగారి వల్ల రాజకీయ జీవితం పొంది పదవులు అనుభవిస్తున్న వారు ఆయన మరణానంతరం అధికార కాంక్షతో కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి ఉండవచ్చు కానీ... రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాలవల్ల లబ్ధి పొందిన ప్రతి కుటుంబం జగనన్నకు అండగా ఉంది. త్వరలోనే ఒక రోజు వస్తుంది. ఆరోజున జగనన్న నిర్దోషిగా బయటకు వచ్చి రాజన్న రాజ్యం స్థాపించే దిశగా అడుగులు వేస్తాడు. 
- లింగబత్తుల రమేష్, సోమారం, వరంగల్

ఎప్పుడైతే జగన్ అరెస్టయ్యారో...అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయింది
అప్పట్లో జగన్ ఎం.ఎల్.ఏ. కాదు, ఎం.పి. కాదు. ఏ జీవోలకూ సంబంధం లేదు. కానీ ఆ 26 జీవోలతో సంబంధం అంటగట్టి, పెట్టుబడులను ఆకర్షించారని అభియోగం మోపారు. అక్రమంగా అరెస్టు చేయించారు. ఈ అక్రమ అరెస్టును ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా... రాష్టంలో గానీ, కేంద్రంలో కానీ పాలకులు పట్టించుకోవడం లేదు. కనుక అంతకంతా వచ్చే ఎన్నికల్లో వీరు అనుభవిస్తారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమూ నిలబడలేదనీ, ప్రజల తీర్పే అంతిమమని చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది.

కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు కలిసి జగన్‌పై ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేయటానికి కనిపిస్తున్న కారణం ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న అపారమైన ప్రేమ, విశ్వాసం చూసి జీర్ణించుకోలేక వీళ్లంతా ఇన్ని కుయుక్తులు పన్నుతున్నారు. జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేయించి, తద్వారా బెయిల్ రాకుండా చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలని ఈ రెండుపార్టీలూ ప్రయత్నిస్తున్నట్లు ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. 
- వి.శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంపట్నం, కృష్ణాజిల్లా

రఘునందనరావు మీడియా సమావేశం


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.రఘునందన్‌రావు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. ఆయన తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. 

2001లో ఆవిర్భావ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన రఘునందన్‌రావు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. కొంత కాలంగా పార్టీ నాయకత్వం తీరుపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రఘునందన్‌రావు నిన్న భేటీ జరిపారనే సమాచారంతోనే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ప్రకటించారు. 

‘ప్రాణహిత’ పై వైఎస్సార్ సీపీ ఉద్యమం


- 20న ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించనున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ 
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించనుంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈనెల 20న ప్రాజెక్టు నిర్మాణ స్థలమైన ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిని సందర్శించనున్నారు. 2008 డిసెంబరు 16న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవటం, బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించక పోవటంపై దృష్టి సారించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండుతో ఉద్యమం చేపట్టనుంది. 

ఇందులో భాగంగానే ఈనెల 20న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకొని నేరుగా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి వెళ్లి ప్రాజెక్టు శిలాఫలకానికి క్షీరాభిషేకం చేసి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం విజయమ్మ కాగజ్‌నగర్‌కు చేరుకొని ఎస్పీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలోనే సిర్పూరు మాజీ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప వైఎస్సార్ సీపీలో చేరనున్నారని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఇంద్రకరణ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు జనక్‌ప్రసాద్ తెలిపారు.

YS జగన్ కేసులో ఒక్కో కోర్టులో ఒక్కో వాదన

- టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే సీబీఐ మోస్తోంది
- జగన్ కేసులో ఒక్కో కోర్టులో ఒక్కో వాదన వినిపిస్తోంది
- చివరికి ఒకే తుది చార్జిషీట్ వేస్తామని చెప్తున్న సీబీఐ.. అనుబంధ చార్జిషీట్లపై విచారణ కోరటం ఆశ్చర్యకరం
- బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోలు జారీ చేశామని మంత్రి కన్నా సుప్రీంకోర్టులో పేర్కొన్నారు 
- బయట మాత్రం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అజెండానే సీబీఐ మోస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పే వాటినే సీబీఐ న్యాయవాది వల్లిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిన సీబీఐ.. చంద్రబాబు డెరైక్షన్‌లో ముందుకెళ్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. అందుకే సీబీఐ పనితీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా.. చంద్రబాబు మాత్రం ఇప్పటి దాకా పల్లెత్తు మాట అనటంలేదన్నారు.

సీబీఐని విమర్శిస్తే తన అధికార దుర్వినియోగంపై దర్యాప్తు జరుపుతారేమోనని బాబు భయపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. సోమయాజులు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాబు ఆదేశాలతో నడుస్తోన్న సీబీఐ ఒక్కొక్క కోర్టులో ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై పలు చార్జిషీట్లు వేసినా.. అంతిమంగా అన్నింటికీ కలిపి తుది చార్జిషీట్ వేస్తామని సీబీఐ చెప్తోంది. అయితే అనుబంధ చార్జిషీట్లపై విచారణ జరపాలని కోరటం చాలా విచిత్రంగా ఉంది. ఇది కచ్చితంగా ప్రజలను తప్పుదోవ పట్టించటమే. తుది చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ప్రారంభించవచ్చుకదా?’’ అని ఆయన ప్రశ్నించారు. 

బాబు ఆరోపణల్లోనే స్పష్టత లేదు... 
జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు చేస్తున్న కుట్రలను తన అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని సోమయాజులు విమర్శించారు. ‘‘జగన్‌పై మొదట లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారు. కానీ చంద్రబాబు డెరైక్షన్‌లోని సీబీఐ వేస్తున్న అన్ని చార్జిషీట్లను కలిపినా రూ. వెయ్యి కోట్లు లావాదేవీలు మాత్రమే జరిగాయని పేర్కొంది. 

అదికూడా కేసు 70 శాతం దర్యాప్తు పూర్తయ్యిందని కోర్టుకు నివేదించింది. తాజాగా గవర్నర్‌ను కలిసిన సందర్భంగా బాబు మాట్లాడుతూ రూ. 43 వేల కోట్లు అంటున్నారు. అంటే రూ. 57 వేల కోట్లు ఎక్కడ పోయాయి. ఆయన చెప్పేదాంట్లోనే స్పష్టత లేకుండా ప్రజ లను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని వివరించారు. ఎమ్మార్ విషయంలోనూ రూ.10 వేల కోట్లు దుర్వినియోగం జరిగిం దంటూ బాబు అనుకూల మీడియా దుష్ర్పచారం చేస్తే.. సీబీఐ దర్యాప్తులో మాత్రం ప్రభుత్వానికి రూ. 43 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

రూల్స్ ప్రకారమే జీవోలిచ్చామని కన్నా చెప్పారు కదా.. 
చంద్రబాబు ఏం చెప్తే కాంగ్రెస్ అధిష్టానం తు.చ. తప్పకుండా పాటిస్తుందని.. ఆయన ఈ మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకొని గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో.. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ భయంతోనే మాట్లాడారని సోమయాజులు వ్యాఖ్యానించారు. ‘‘బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ జీవోలు విడుదలయ్యాయని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కన్నా.. తాజాగా జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇలా విభిన్నంగా ప్రవర్తిస్తూ ప్రజలు, సుప్రీంకోర్టులో ఎవర్ని మోసం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. 

చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తే ఆయనకు వంద ఏళ్లు జైలు శిక్ష వేసినా తక్కువే అవుతుందని సోమయాజులు మండిపడ్డారు. ‘‘అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారే తమ్మునిగా తనను తాను భావిస్తున్న బాబు.. తనపై ఉన్న ఆరోపణల మీద విచారణ జరిపించుకునే ధైర్యం ఉందా?’’ అని సవాల్ విసిరారు. టీడీపీ విచిత్రమైన ధోరణి అవలంబిస్తోందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను, వైఫల్యాలను వైఎస్‌కు లేదా జగన్‌కు ఆపాదించి నిందించటం ఆనవాయితీగా చేసుకుందని ధ్వజమెత్తారు. పాలకుల చేతకానితనం కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తితే దాన్నికూడా వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ వల్లే అని చెప్పటం సిగ్గుచేటనన్నారు. బయ్యారం గనులను ప్రభుత్వం విశాఖ స్టీల్‌కు అప్పగిస్తే దానికి షర్మిల సమాధానం చెప్పాలని టీడీపీ నేత ఎర్రబెల్లి వ్యాఖ్యానించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వైఎస్ తొలి సంతకానికి తొమ్మిదేళ్లు 
దివంగత సీఎం రాజశేఖరరెడ్డి సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట ఇదే రోజు (మే 14)న ప్రమాణ స్వీకారం చేసి సువర్ణపాలనకు శ్రీకారం చుట్టారని సోమయాజులు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు తొమ్మిదేళ్ల ప్రజావ్యతిరేక దుష్టపాలనకు చరమగీతం పలికి రైతు, పేదప్రజల సంక్షేమానికి వైఎస్ నాంది పలికారన్నారు. సరిగ్గా ఇదే రోజున రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేయటంతో పాటు 2001-04 మధ్య కాలం నాటి రూ. 1,400 కోట్ల విద్యుత్ బకాయిలు కూడా రద్దు చేశారని చెప్పారు. వైఎస్ ఐదేళ్ల పరిపాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 తదితర ఎన్నో సంక్షేమాలను విజయవంతంగా కొనసాగించారన్నారు.

సెక్షన్ 409 YSజగన్‌కు వర్తించదు


* ‘దాల్మియా’ చార్జిషీట్‌పై స్పష్టం చేసిన సీబీఐ కోర్టు
* అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కూడా వర్తింపజేయలేం
* 2004-09 మధ్య ఆయన పబ్లిక్ సర్వెంట్ కారన్న జగన్ లాయర్లు
* అలాంటపుడు ఆ చట్టమెలా వర్తింపజేస్తారంటూ ఆది నుంచీ వాదన.. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
హైదరాబాద్: ‘సాక్షి’, ‘భారతి సిమెంట్’ తదితర సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆది నుంచీ చేస్తున్న వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏకీభవించింది. ఈ పెట్టుబడుల వ్యవహారమంతా 2004-2009 సంవత్సరాల మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న సీబీఐ... దాని అంతిమ లబ్ధిదారు జగన్‌మోహన్‌రెడ్డి అంటూ ఆయన్నే అన్ని అంశాల్లోనూ నిందితుడిగా పేర్కొంటూ... ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద, ఐపీసీ సెక్షన్ 409 కింద కేసులు నమోదు చేయడాన్ని మొదటి నుంచీ జగన్ తరఫు లాయర్లు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.

సీబీఐ చెబుతున్న సమయంలో(2004-09) ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదని, ప్రజా ప్రతినిధి కాదని, బ్యాంకర్ కానీ... ఏజెంట్ కానీ ఏమీ కాదని... అసలు పబ్లిక్ సర్వెంటే కానపుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టం కానీ, ఐపీసీలోని సెక్షన్ 409 కానీ ఎలా వర్తిస్తుందని వాదించారు. మంగళవారం ఈ కేసులో 5వ చార్జిషీటును విచారణకు స్వీకరించిన సందర్భంగా... సీబీఐ ప్రత్యేక కోర్టు పై వాదనతో ఏకీభవించింది. ఈ చార్జిషీటుకు సంబంధించి జగన్‌పై భారతీయ శిక్షాసృ్మతి (ఐపీసీ)లోని సెక్షన్ 409 (ప్రజాప్రతినిధి హోదాలో నమ్మకద్రోహానికి పాల్పడడం) నమోదు చేయలేమని స్పష్టంచేసింది. అలాగే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) లోని సెక్షన్ 12 (అవినీతిని ప్రోత్సహించడం) కూడా ఆయనకు వర్తించదని తేల్చిచెప్పింది. 

జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో దాల్మియా సిమెంట్ సంస్థ పెట్టుబడులు పెట్టిన వ్యవహారానికి సంబంధించి ఆయనపై ఐపీసీ 409, పీసీ యాక్టు 12 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలన్న సీబీఐ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఐపీసీ 120(బి) రెడ్‌విత్ 420, 420, పీసీ యాక్టులోని సెక్షన్ 9 కింద మాత్రమే జగన్‌పై అభియోగాలు నమోదు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. ‘‘చార్జిషీట్‌ను, దానికి అనుబంధంగా సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ అభియోగాల కింద మాత్రమే చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తున్నాం’’ అని న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి టీడీపీ ఎంపి?

చిత్తూర్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ని వీడిన కడియం శ్రీహరికి మద్దతుగా శివప్రసాద్ మాట్లాడారు. దీంతో ఆయన పార్టీ ని వీడడానికే ఆ విధమైన మద్దతు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. తన రాజకీయ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని పార్టీ ని వీడినంతా మాత్రాన శ్రీహరిని ద్రోహిగానో, రాజకీయ వ్యభీచారిగానో చిత్రీకరించడం సరి కాదని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆ మాటకొస్తే ఫిరాయింపు దార్లు కానిదేవరనేది అన్నారు. పార్టీలో కొనసాగేలా చూసుకోవడానికి బదులు పార్టీ ని వదిలిపెట్టే వారిని దూషించడం పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచిది కాదని శివప్రసాద్ అభిప్రాయంగా కనిపిస్తోంది. శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వై ఎస్ జగన్ నాయకత్వం లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గతంలో ప్రచారం సాగింది. అయితే, ఆయన పార్టీ లో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా ప్రకటనతో ఆయన పార్టీ లో కొనసాగే విషయం పై సందేహం కల్గుతోందని అంటున్నారు. 

సీఎంపై సుప్రీంకోర్టుకెళ్తా: మాజీ మంత్రి పి.శంకర్రావు

హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారంలో సీఎం కిరణ్ హస్తం ఉందని, ఇది 2జీ స్పెక్ట్రం కన్నా పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఎర్ర చందనం అక్రమ తరలింపునకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించినప్పటికీ, ఈ కేసులో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ సహా కళంకిత మంత్రులను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 149వ రోజు బుధవారం 12.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. టి.నరసాపురం మండలం ముత్యాలంపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నపు వారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు
ముత్యాలంపేట, టి.నరసాపురం, గురవాయగూడెం, ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపు వారిగూడెం 

ఇందులో దిట్టే టిజి వెంకటేష్

రాష్ట్ర చిన్ననీటివనరుల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఎప్పుడో ఏదో ఒక అనవసర ప్రకటన చేయడంలో దిట్ట అనే చెప్పాలి.తాజాగా ఆయన చేసిన ప్రకటన కూడా అటువంటిదే.తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావును హీరోగా పెట్టి తాను ఒక సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. సిగరెట్ , మద్యం మానివేసిన కెసిఆర్ ఇప్పుడు ఈ పాత్రకు సరిపోతారని అన్నారు. విజయశాంతి దర్శకత్వంలో ,హరీష్ రావు డైలాగులతో సినిమా తీయడానికి సిద్దమని ఆయన అన్నారు.ఇక ఫైటింగ్ సీన్ లలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ఉంటారని వెంకటేష్ చెప్పారు.మంత్రికి ఈ ప్రకటన చేయడం ఇప్పుడు అవసరమా!

రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

వరంగల్‌: ఇటీవల టీడీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత కడియం శ్రీహరి రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

స్థానిక ఎన్నికలకు సిద్ధం: కొణతాల రామకృష్ణ

విశాఖపట్నం: వైఎస్ జగన్ విషయంలో సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. సోనియా అల్లుడుకి ఒక న్యాయమా.. వైఎస్‌ జగన్‌కు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్‌ కుంభకోణంలో సోనియా అల్లుడిని వెనకేసుకొచ్చి తప్పించిందని అన్నారు. అతిగా ప్రవర్తించే సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. 

Konda couple vows to continue support to ysrcp- Video

కళంకిత మంత్రులను తొలగించాలి: మాజీ మంత్రి శంకర్రావు

హైదరాబాద్: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో సీఎం హస్తం ఉందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసువేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంత్రుల అవినీతితో కాంగ్రెస్‌ శ్రేణులు నీరుగారిపోతున్నాయని అన్నారు.

వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ


హైదరాబాద్: వైఎస్ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్ ను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై తనకు అసంతృప్తిలేదని చెప్పారు. తాము పార్టీ మారడంలేదన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

YSజగన్ ను కలిసిన కొండా దంపతులు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ, సురేఖ దంపతులు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. చంచల్ గూడ జైలులో ములాఖత్ సమయంలో వారు జగన్ ను కలిశారు. 

YSజగన్ కేసులో కీలక పరిణామం

జగన్ కేసులో కీలకమైన పరిణామం సంభవించింది.దాల్మియా సిమెంటు చార్జీషీటులో జగన్, విజయసాయిరెడ్డిలపై నమోదైన సెక్షన్లను కోర్టు తోసిపుచ్చింది.420,409, అవినీతి నిరోదక చట్టం కింద నమోదైన సెక్షన్లను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినీతి నిరోదక చట్టం కేవలం ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నవారికే మాత్రమే వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు ప్రభుత్వంలో పనిచేయలేదు కనుక ఈ చట్టం కింద సెక్షన్లు వర్తించవన్న భావనతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని చెబుతున్నారు.దీనితో ఇంతకుముందు నాలుగు చార్జీషీట్లలో తీసుకున్న రెండు సెక్షన్లను దాల్మియాలో పెట్టకపోవడం వల్ల జగన్,విజయసాయిరెడ్డిలకు కొంత ఊరట కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు.శ్రీలక్ష్మి,సబిత, రాజగోపాల్ లపైన ఐపిసి,అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయగా, జగన్ , విజయసాయిలకు వాటిని వర్తింప చేయలేదు.దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

జగనన్నతోనే వైఎస్ సువర్ణ యుగం :షర్మిల


ఏలూరు: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆ మహానేత వైఎస్ సువర్ణ యుగం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. చింతలపూడి రచ్చబండలో ఆమె ప్రసంగించారు. జగనన్న సీఎం అయితే మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండవని చెప్పారు. కరెంట్ చార్జీలు పెంచడమే సంక్షేమమా? ఫీజు రియెంబర్స్‌మెంట్ కు తూట్లు పొడవటమే సంక్షేమమా ? వైఎస్ పథకాలను నీరు గార్చడమే సంక్షేమమా? పేదవారికి ఇళ్లు లేకపోవడమేనా సంక్షేమమంటే? సంక్షేమమంటే పేద విద్యార్థుల బస్ పాస్ సబ్సిడీలు కుదించడమేనా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం మూడు గంటలు కూడ కరెంట్ ఉంటడంలేదని చెప్పారు. విద్యార్దుల బస్‌పాస్ చార్జీలు సైత పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్దులపై 3 వందల కోట్ల రూపాయల భారం పడనుంది. వైఎస్ఆర్ ఉన్నప్పడు అందరికీ 7-9 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. కాని కిరణ్ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో నాలుగు సార్లు చార్జీలు పెంచి 30 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసిందన్నారు. వడ్డీ లేని రుణాలు ప్రచారానికి మాత్రమే పరిమితమైందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి ప్రభుత్వం తీరు కూడా అదే అన్నారు. 

జగనన్న సీఎం అయి రాజన్న రాజ్యం వచ్చాక వికలాంగులు, వృద్ధులకు ప్రతినెల పెన్షన్లు ఇస్తారని చెప్పారు. పేద పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల 500 రూపాయలు, ఇంటర్ విద్యార్థులకు 700, డిగ్రీ విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఇస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు, కిరణ్ కు బుద్ధి చెబితే రాబోయేది రాజన్న రాజ్యమే అన్నారు.