Monday 6 May 2013

పార్లమెంట్ లో దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంటులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, నందమూరి కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు.

జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా: కొణతాల రామకృష్ణ

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరికపై పరిస్థితులను ములాఖత్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించినట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

YS జగన్ తప్ప మరో నాయకుడు...మన ఆత్మగౌరవాన్ని నిలపలేడు


ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన రోజులవి. నేను పదవ తరగతి చదువుతున్నాను. అప్పటికి నాకు ఆత్మగౌరవమంటే అర్థం తెలియదు. ఇప్పుడనిపిస్తుంటుంది ఆత్మగౌరవానికి ఎంత పవరుందీ అని! వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారి మరణానంతరం జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని వారి కుటుంబసభ్యులెవరైనా ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ఒత్తిడి చేశారా? లేదే! రాజకీయంగా పేరు ప్రఖ్యాతులున్న కుటుంబాలకు ఇస్తున్న గౌరవంగా భావించి నాడు రాజీవ్‌గాంధీని ఎలా ప్రధానిని చేశారో జగన్‌పై కూడా అదే అభిమానాన్ని ఎమ్మెల్యేలు, ప్రజలు చూపించారు. వైయస్సార్ అంటే ఆది నుండి వ్యతిరేకించే సోనియా భజనపరులు, వైయస్సార్‌ను తిడితే పదవులొస్తాయని భావించే కొందరు అవకాశవాద రాజకీయనాయకులు, లేనిపోని అబద్ధాలను కల్పించి, జగన్‌ని పార్టీ నుండి బయటకు పంపారు. తీరా ఇప్పుడు పార్టీ సర్వనాశనం అయ్యాక గాని అర్థం కాలేదు కాంగ్రెస్‌కు! చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

జగన్‌ని కాంగ్రెస్‌పార్టీ నుండి బయటకు పంపడానికి ఈ నాయకులు ఎన్నో ఎత్తులు, జిత్తులు ప్రదర్శించారు. కాశ్మీర్ నుండి ఒకరు, కన్యాకుమారి నుండి ఒక రు, తమిళనాడు నుండి ఒకరు, తంజావూరు నుండి మరొకరు మీడియా కనిపిస్తే చాలు పది రోజుల్లో జగన్‌ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని, లేదు లేదు రేపే సస్పెండు చేస్తారని, అబ్బే ఇంకా టైముందని... ఇలా రోజుకో విధంగా ప్రజల్ని, పార్టీని కన్‌ఫ్యూజన్‌లో పెట్టి మన ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేసి, చివరకు కాంగ్రెస్ కూడా ఈ కన్‌ఫ్యూజన్‌లో కొట్టుకుపోయింది. 

గ్రామీణ ప్రజలపై, గ్రామీణ రాజకీయాలపై నాకున్న అవగాహన ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ అంటేనే కుతకుతలాడిపోతున్నారు. ప్రస్తుతం గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్నదేమిటో తెలుసా? ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముంది గనుక ఎమ్మెల్యేల దగ్గర ద్వితీయశ్రేణి నాయకులు వినయం నటిస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు, ఛోటానాయకుల దగ్గర ప్రజలు విధేయత నటిస్తున్నారు. వీరి అందరి నటనా 2014 సాధారణ ఎన్నికలు సమీపించేసరికి జగన్‌పై పూర్తిస్థాయి అభిమానంగా, ఆదరణగా మారుతుంది. ఇది నూటికి నూరుపాళ్లు సత్యం.

నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిన్న సమస్య ఏర్పడినా, చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పరుగులు తీయడం! అక్కడి పైస్థాయి ఇతర రాష్ట్ర నాయకులు మన రాష్ట్రంపై అధికారం చలాయించడం!! ఏమిటిదంతా? ఓట్లేసి గెలిపించుకున్న మన నాయకులపై ఇతర రాష్ట్రాల నాయకులు పెత్తనం చలాయించడం ఏమిటి? వెన్నెముక లేకపోవడం అంటే ఇదే. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం అంటే ఇదే. మీడియా పుణ్యమా అని ఇవన్నీ చూసి, తెలుసుకుని అర్థం చేసుకుంటున్న గ్రామీణులు వచ్చే ఎన్నికల్లో జగన్‌ను తమ నాయకుడిగా ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఆంధ్రులఆత్మగౌరవం మరోసారి గెలవబోతున్నది. ప్రజలకు వీలైనంతగా ఉపయోగపడే నాయకుడు కావాలి. జగన్ సరిగ్గా అలాంటి నాయకుడే. అతడు ధీశాలి. పోరాటయోధుడు. మాటతప్పనివాడు. మడమ తిప్పనివాడు. కల్లోల గాలుల్లో సైతం ఆంధ్రప్రదేశ్ అనే నావను సురక్షితంగా నడిపించగల కెప్టెన్. 

అయినప్పటికీ ఆయన...కష్టాల్నే ఎంచుకున్నారు కానీ,కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు!


అయినప్పటికీ ఆయన...కష్టాల్నే ఎంచుకున్నారు కానీ,కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు!
రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారు ఎంతగానో అభిమానించే ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డిగారు అకస్మాత్తుగా ఈ లోకం విడిచివెళ్లిపోయారు. ఆ బాధలో ఉండగానే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్! మరోవైపు రాష్ట్రంలో నానాటికీ అధ్వానంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు. ఈ తరుణంలో రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక ఆశాజ్యోతి జగన్... దాదాపు ఏడాదిగా నిర్బంధంలో ఉన్నారు. ఓదార్పుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల్ని తెలుసుకుంటున్న సమయంలో జగన్‌ని అరెస్ట్ చేయడం బాధాకరం. జగన్ కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే ఇన్ని కష్టాలు మీద పడేవి కావేమో. అయినప్పటికీ ఆయన కష్టాల్నే ఎంచుకున్నారు కానీ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌పార్టీని కాదు. 

అన్ని పార్టీలు, ఆ పార్టీలలోని కుటిల నాయకులు జగన్‌ని ఒక్కడిని చేసి వేధిస్తున్నాయి. అయితే ఆ వేధింపులను జగన్ ఎంతో హుందాగా ఎదుర్కొంటున్నారు. పాలక, ప్రతిపక్షాలు ఒక వాస్తవం తెలుసుకోవాలి. ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న జగన్‌ని ఈ అవరోధాలు, నిర్బంధాలు ఏమీ చేయలేవు. జగన్ స్థాపించిన వైయస్‌ఆర్‌సీపీ ప్రజలకు అండగా ఉంది. ప్రజలూ ఆయనకు అండగా ఉన్నారు. ఏ కుటిల రాజకీయాలూ తెలియని జగన్‌ను ఒక్కడిని చేసినా... ప్రజలు తమ కన్నబిడ్డలా, అన్నలా, తమ్ముడిలా చూసుకుంటున్నారు. జగన్‌లా పూర్తిగా ప్రజల పక్షానే ఉండే ధైర్యం ఇవాళ మన రాజకీయనాయకులకు ఉందా? అలాగే ప్రజల్లో మాకు ఆదరణ ఉందని ఒక్క నాయకుడైనా చెప్పుకోగలడా? ఎన్ని వేధింపులకు గురి చేసినా జగన్‌ను ప్రజలకు దూరం చేయలేరు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలకు దగ్గర కాలేదు. 

YS షర్మిల వాదనా బాగానే ఉందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు, జగన్ సోదరి షర్మిల ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.కేంద్రంలోకాని, రాష్ట్రంలో కాని అదికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైన వాదనలు ఎలా తయారు చేసుకుంటున్నారన్నదానిపై ఆమె ప్రజలకు వివరంగా తెలియచేస్తున్నారు. ఆమె ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన వాదన వినిపించారు. కేంద్రంలో 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా అనే కేంద్ర మంత్రి పేరు చార్జిషీటులో ఉంటే తప్పంతా ఆయనదే అన్నారు. ఆ కుంభకోణంలో ప్రధానమంత్రికి ఏ సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం చార్జిషీట్‌లో ఉన్న మంత్రుల తప్పు లేదట. తప్పంతా అప్పటి ముఖ్యమంత్రిదే అని బుకాయిస్తున్నారు. కేంద్రంలోనేమో.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రిదే తప్పు.. ప్రధానమంత్రి తప్పులేదు అంటున్నారు. రాష్ట్రంలోనేమో.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రులది తప్పులేదు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌దే తప్పు అంటున్నారు. కేంద్రంలో చార్జిషీట్‌లో ఉన్న మంత్రికి ఒక న్యాయం, రాష్ట్రంలో చార్జిషీట్‌లో ఉన్న మంత్రులకు ఇంకో న్యాయం. కేంద్రంలో ప్రధానికి ఒక న్యాయం, రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన వైఎస్సార్‌కు ఇంకో న్యాయం. ఒక్కో చోట ఒక్కో న్యాయం.. ఒక్కొక్కరికీ ఒక్కొక్క న్యాయం. ఇదేనా ప్రజాస్వామ్యం.. జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం ఎన్నో ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు. బొగ్గు శాఖ ను నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు గనులను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే రెండు లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్ చెప్పిందని ఆమె అన్నారు.అయినా ప్రధాని తప్పు లేదని కాంగ్రెస్ ఆయనను వెనుకేసుకు వచ్చిందని ఆమె అన్నారు. అదే సమయంలో వై.ఎస్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఆరోపణలు రాలేదని,ఆయన చనిపోయాక అన్ని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాజీవ్ బతికి ఉన్నప్పుడు బోఫోర్స్ కేసులో ఆయన పేరుంటే, ఆయన చనిపోయాక ఆయన పేరును చార్జీషీట్ నుంచి తొలగించారని, అదే బతికి ఉన్నప్పుడు వై.ఎస్.పేరు ఛార్జీషీట్ లో లేకపోయినా, చనిపోయిన తర్వాత ఆయన పేరు అందులో పెట్టారని ఇంతకన్నా దుర్నీతి ఏమి కావాలని ఆమె ప్రశ్నించారు. ఈరోజు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే ఒక న్యాయం.. వ్యతిరేకిస్తే ఇంకో న్యాయం. వీళ్లు మన పాలకులు, వీళ్లకు న్యాయం, ధర్మం ఆలోచన లేదు. మంచి, మానవత్వం గురించి అక్కర్లేదు. విలువలు, విశ్వసనీయత పట్టదు. వీళ్లను నాయకులు అనాలా? ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగులు అనాలా షర్మిల తీవ్రంగా ప్రశ్నించారు. షర్మిల లాయర్ లా చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. నిజానికి పాలనలో ఉన్నవారు కాని, దర్యాప్తు సంస్థలు కాని ఇలాంటివాటికి సమాదానం చెప్పగలిగే పరిస్థితి ఉంటే అప్పుడు జగన్ పైన అయినా మరెవరిపైన అయినా చర్య తీసుకుంటే ప్రశ్నించే పరిస్థితి ఉండదు.తాజాగా సుప్రింకోర్టు అఫిడవిట్ కేసులో సిబిఐ తయారు చేసిన నివేదికను ముందుగానే చూశారన్న అశ్వనికుమార్ ను, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బన్సల్ మేనల్లుడి కేసులో రైల్వే మంత్రి బన్స్ ల్ ను తప్పించబోమని కాంగ్రెస్ నిస్సిగ్గుగా ప్రకటించిన తర్వాత కాంగ్రస్ ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.

సిబిఐ డైరెక్టర్ చేతులు కాలాక..


సిబిఐ డైరెక్టర్ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తుంది.బొగ్గు కుంభకోణం వ్యవహారంలో సుప్రింకోర్టు ఆదేశం మేరకు తయారైన నివేదికను ముందుగానే ప్రభుత్వంలోని పెద్దలకు చూపించిన విషయంపై ఇప్పుడు డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టు క్షమాపణ కోరారు.
పీఎంఓ జేఎస్ శతృఘ్నసిన్హా నివేదిక చూశారని కోర్టుకు సిబిఐ తెలిపింది. బొగ్గు మంత్రిత్వశాఖ జేఎస్ ఏకే భల్లా కూడా నివేదిక చూశారని, ముసాయిదా నివేదికను మాత్రమే చూపామని సిబిఐ తెలిపింది. విచారణ స్థితిని తెలిపే నివేదికను మాత్రం చూపలేదని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల, పేర్లను తొలగించలేదని వివరించింది.అయితే నివేదికలో మార్పులు చేర్పులు ఎవరినుద్దేశించి చేశారో ఇప్పుడు చెప్పలేమని పేర్కొనడం విశేషం.అయితే బొగ్గు కుంభకోణంపై నిష్పాక్షికంగా విచారణ చేస్తామని సిబిఐ హామీ ఇవ్వడం కొసమెరుపు.

వై.కాంగ్రెస్ కూడా అదే ఆరోపణ చేసింది

శాసనసభలో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవుల విషయంలో గతంలో టిఆర్ఎస్ చేసిన విమర్శనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా చేసింది. కాంగ్రెస్ , టిడిపి లు ఛైర్మన్ పదవులను పంచుకున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.తగు సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ స్టాండింగ్ కమిటీల ఛైర్మన్‌ పదవులను కాంగ్రెస్‌-టీడీపీలు పంచుకున్నాయని విమర్శించారు.దీని గురించి స్పీకర్ కు కూడా చెప్పానని అన్నారు. కాగా చిరంజీవి కుమారుడు తేజ విసయంలో పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన శ్రీశైలంగౌడ్

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కూన శ్రీశైలంగౌడ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కార్పొరేటర్ రావుల శేషగిరి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలోకి టిడిపి, సిపిఐ నాయకుల చేరిక


కొత్తగూడెం (ఖమ్మం జిల్లా) : పినపాక నియోజకవర్గ సిపిఐ, టిడిపి నాయకులు పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో‌ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పినపాక నియోజకవర్గ సమన్వయకర్త పాయం వెంకటేశ్వర్లు, కేంద్ర పాలక మండలి సభ్యుడు చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో శ్రీమతి షర్మిల వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
పినపాక మండల టిడిపి అధ్యక్షుడు రావుల సోమయ్య, తెలుగు యువత మండల ప్రచార కార్యదర్శి రావుల రవితో పాటు పినపాక మండలంలోని కరకగూడెం, భట్టుపల్లి, సమత్‌భట్టుపల్లిలకు చెందిన మరో 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. టిడిపి మండల నాయకులు ఉప్పర్ల రామారావు, బర్ల వెంకన్న, పోతిబోయిన సారయ్య, పూనెం శంకరయ్య, కొమరం లాలయ్య, తొలెం ఎర్రయ్య, దయ్యాల మల్లయ్య, డేగాల విజయ్, వీరగాని సమ్మయ్య, గొగ్గల రవి, ‌గొగ్గల స్వామి, కొమరం స్వామి, గొగ్గలి నరేందర్, వుప్పలి నాగే‌ష్, మిట్టపల్లి చందు, తొలెం రాంబాబు, గొసంగి శంక‌ర్, మోడెపు సాంబయ్య, జలగం ఐలయ్య తదిదరులు పార్టీలో చే‌రారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ చే‌సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శ్రీ జగన్‌తోనే సాధ్యమన్న విశ్వాసంతో తాము వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, అహ్మద్‌హుస్సేన్, పి. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ నాయకుల చేరిక :
పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు సిపిఐ జిల్లా నాయకులు శ్రీమతి షర్మిల సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్టీ పినపాక నియోజకవర్గ ఇ‌న్‌చార్జి పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా నాయకులు కైపు సుబ్బిరామిరెడ్డి, పసుపులేటి విజయలక్ష్మి తదితరులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి శ్రీమతి షర్మిల ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖ‌ర్, జిల్లా నాయకురాలు పాయం ప్రమీల పాల్గొన్నారు.

YS జగన్ బెయిల్‌పై తీర్పు రిజర్వు

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. 
జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై జరిగిన వాదనల్లో ఆయన తరపున సీనియర్‌ న్యాయవాదులు, హరీష్ సాల్వే, ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏడు అంశాల్లో జగన్‌ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. 

మరోవైపు జగన్ కేసు విచారణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని సీబీఐ వాదించింది. విచారణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ మంజూరు చేయరాదని న్యాయస్థానాన్ని కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును నిలుపుదల చేసింది. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ గత ఏడాది మే 27న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

YS జగన్ బెయిల్ ఇవ్వవద్దు: సిబిఐ


న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధించిన కేసు ఇప్పుడు చాలా కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తరపు న్యాయవాది అశోక్‌ భాన్ సుప్రీం కోర్టును కోరారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వాదించారు. 

ఛార్జిషీటులో పేరున్నవారిని ఎందుకు అరెస్టుచేయలేదు? అని జగన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీష్ సాల్వే ప్రశ్నించారు. ఎంతటి తీవ్రబ నేరమైనా 90 రోజుల్లో ఛార్జిషీటు వేయాలని ఆయన తెలిపారు. కావాలనే సీబీఐ సాగదీస్తూ పోతోందని ఆయన వాదించారు.