Saturday 11 May 2013

మాజీ మంత్రి శంకరరావు చెప్పినట్లు చేస్తే మాత్రం..

మాజీ మంత్రి డాక్టర్ పి.శంకరరావు మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.కిరణ్ ప్రభుత్వం పనితీరు, కిరణ్ శైలి, అవినీతి అభియోగాలకు గురైన మంత్రులకు సంబందించిన విషయాలపై కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ విషయాలపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు. కేంద్రంలో మాదిరి ఇక్కడ కూడా ఆరోపణలకు గురైన మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు.అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న కిరణ్ ను కూడా తప్పించాలని డిమాండ్ చేశారు.వీటిపై సోనియాగాంధీకి లేఖ రాస్తానని ఆయన అంటున్నారు. కొందరు మంత్రులను తప్పిస్తేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుదని ఆయన అన్నారు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందని శంకరరావు ఎలా భరోసా ఇస్తున్నారో తెలియదు. ముందుగా ఆయన టార్గెట్ కిరణ్ కాబట్టి , ఆయన వంతుగా ఆయన ఆరోపణలు చేసి కాంగ్రెస్ ఘనతను ఆయనే తెలియచేస్తున్నారనుకోవాలి.

0 comments:

Post a Comment