Saturday 11 May 2013

వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు : దాడి

విశాఖ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న వన్ పాయింట్ ఫార్ములాను అందరూ అనుసరించాలని వైఎస్ఆర్ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను అధికారంలోకి తేవటమే లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన తొలిసారి శనివారం జిల్లాకు విచ్చేశారు. 

ఈ సందర్బంగా దాడి వీరభద్రరావు మాట్లాడుతు సమాజం మార్పుకోరుకుంటోందని.... వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అందలం ఎక్కించాలన్నది ప్రజల భావనగా కనిపిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని దాడి అన్నారు. 

అవినీతి ఆరోపణలు లేని పార్టీ ఏముందని ...ప్రధానమంత్రే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు. ఏ జైల్లో పెట్టినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని జగన్‌ చెప్పారని, ఇది ఎంతో దమ్మున్న నాయకుడి లక్షణమని దాడి వ్యాఖ్యానించారు.

పదవి కోసం కాదని... గౌరవం కోసమే వైఎస్ఆర్‌ పార్టీలో చేరానని దాడి వీరభద్రరావు తెలిపారు. కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాని ఆయన అన్నారు. తమ మధ్య విభేదాలున్నాయనేది మీడియా సృష్టేనని దాడి కొట్టిపారేశారు. కొణతాల బాధ్యత కలిగిన నాయకుడని, అందరం కలిసి వైఎస్‌ఆర్‌ సీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

0 comments:

Post a Comment