Wednesday 1 May 2013

త్వరలో రాజన్న రాజ్యం: YSషర్మిల


ఖమ్మం: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కరెంట్‌ బిల్లులు విపరీతంగా పెరిగాయని, రైతులకు రుణాలు అందడంలేదని, పంటనష్ట పరిహారం అందడంలేదని గిరిజన మహిళలు సూర్యతండాలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో పావలావడ్డీ రుణాలు సక్రమంగా అందేవని..ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ మహిళలు షర్మిలతో అన్నారు. అయితే మహిళల బాధలకు స్పందించిన షర్మిల ..త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుంది అని భరోసా నింపారు. 
రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని షర్మిల అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా గిరిజనులకు 2లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కు కల్పించిన ఘనత వైఎస్‌దేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వైఎస్‌ బతికివుంటే మరో 6లక్షల ఎకరాలు భూపంపిణి జరిగి వుండేదని షర్మిల అన్నారు. నాడు వైఎస్‌ ప్రతి కుటుంబానికి 30కేజీల బియ్యం ఇవ్వాలనుకున్నారని.. కానీ నేడు కిరణ్‌ సర్కార్‌ 20కేజీలకే పరిమితం చేసిందని షర్మిల విమర్శించారు. మహిళలకు మేలు చేసేందుకు జగనన్న అమ్మఒడి వంటి పథకాన్ని ప్రకటించారని షర్మిల తెలిపారు.

0 comments:

Post a Comment