Monday 29 April 2013

YS జగన్‌ బెయిల్‌పై సిబిఐకి సుప్రీం నోటీసులు


న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మే 6 లోపు నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాజకీయ దురుద్దేశంతోనే బెయిల్‌ను సీబీఐ అడ్డుకుంటోందని జగన్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే ... జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. 

సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన హామీని సీబీఐ నిలబెట్టుకోలేదని హరీష్‌ సాల్వే అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అక్టోబర్‌ 5 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని న్యాయమూర్తులకు వివరించారు. ఆ ఉత్తర్వు కాపీని న్యాయమూర్తులు పరిశీలించారు. హరీష్‌ సాల్వే వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 6న జరగనుంది. 

0 comments:

Post a Comment