Monday 6 May 2013

YS జగన్ బెయిల్‌పై తీర్పు రిజర్వు

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. 
జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై జరిగిన వాదనల్లో ఆయన తరపున సీనియర్‌ న్యాయవాదులు, హరీష్ సాల్వే, ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏడు అంశాల్లో జగన్‌ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. 

మరోవైపు జగన్ కేసు విచారణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని సీబీఐ వాదించింది. విచారణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ మంజూరు చేయరాదని న్యాయస్థానాన్ని కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును నిలుపుదల చేసింది. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ గత ఏడాది మే 27న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

0 comments:

Post a Comment