Monday 13 May 2013

కోర్టులపై కూడా కోపం వస్తోంది కాని..

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలకు సిబిఐపై తోపాటు కోర్టుల మీద కూడా చాలా కోపం వస్తోంది.కాని నేరుగా కోర్టులను విమర్శిస్తే ఏమి ఇబ్బందులు వస్తాయో నని భయపడుతున్నట్లు ఉన్నారు. అయినా ఒక్కోసారి కొన్ని మాటలు వదలి మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు సుప్రింకోర్టు బెయిల్ ఇవ్వకుండా నిర్ణయం చేసినప్పుడు జూపూడి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఏదో చేశారన్నట్లుగా ఆరోపణ చేశారు. రెండు రోజులపాటు డిల్లీలో ఏమి చేశారని ప్రశ్నించారు. ఆ తర్వాత అది కోర్టు దిక్కారం కింద వస్తుందని టిడిపి నేత యనమల ప్రభృతులు హెచ్చరించారు. కారణం ఏమైనా కాని జూపూడి తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.తనకు సుప్రీంకోర్టుపై గౌరవముందని , చంద్రబాబు ఢిల్లీలో ఏం చేశారని ప్రశ్నించాను తప్ప, న్యాయస్థానంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని జూపూడి వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కై జగన్‌కు బెయిల్‌ రాకుండా చేశారని ఆరోపించారు.

0 comments:

Post a Comment