Tuesday 7 May 2013

నేపాల్‌కు వైఎస్సార్ సీపీపతినిధి బృందం

హైదరాబాద్: దుబాయ్‌లో గత ఆరేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కరీంనగర్ చెందిన ఆరుగురు ఖైదీలకు విముక్తి కలిగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో విడత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2007లో మృతి చెందిన ఒక నేపాలీ కేసులో వీరు దుబాయ్‌లో శిక్షను అనుభవిస్తున్నారు. ఖైదీల తరఫున నేపాలీ పౌరుడి కుటుంబంతో మాట్లాడి వారిని ఒప్పించి ఖైదీల విడుదలకు సమ్మతిని తీసుకునేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రతినిధి బృందం బుధవారం కఠ్మాండుకు వెళ్తోంది. పార్టీ ప్రవాస భారతీయ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్, సీజీసీ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డితో పాటు దుబాయ్‌కి చెందిన న్యాయవాది వి.అనూరాధ ఈ బృందం లో ఉన్నారు. కొద్ది నెలల కిందట ఖైదీల కుటుంబ సభ్యులు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత్‌లోని ప్రవాస భారతీయ కార్యాలయం అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. 

0 comments:

Post a Comment