Sunday 5 May 2013

మహిళలకు భద్రతలేదు: YS విజయమ్మ


బాపట్ల: రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు భద్రతలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'మహిళానగారా' పేరుతో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయన్నారు. మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో ఈ రకమైన అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నాంగా ఉందని చెప్పారు. గ్రామీణుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్న మద్యపానాన్ని నియంత్రిస్తామని జగన్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని జగన్ చెప్పారన్నారు. బెల్టుషాపులను గుర్తించి తొలగించేదుకు, మహిళలకు రక్షణగా మహిళా రక్షకభటును కూడా నియమిస్తామని జగన్ చెప్పినట్లు తెలిపారు.

మహిళా సంక్షేమానికి వైఎస్ కేటాయించినన్ని నిధులు మరెవరూ కెటాయించలేదన్నారు. మహిళలను ఆయన అక్కయ్యా, చెల్లెమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారని గుర్తు చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆడపిల్లలు కూడా ఉన్నత చదువుకున్నారని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరుగురు మహిళలు మంత్రులుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా హొం శాఖను కూడా మహిళకే అప్పగించారని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

0 comments:

Post a Comment