Thursday, 18 April 2013

జగనన్నను తరలించే కుట్ర

జయంతి (కృష్ణా జిల్లా), 17 ఏప్రిల్‌ 2013: జగనన్నను మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కొత్త కుట్ర చేస్తున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వీళ్ళ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోవాలో, అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. మహానేత వైయస్‌ కుటుంబాన్ని వెలివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేద వ్యక్తంచేశారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు బుధవారంనాడు శ్రీమతి షర్మిల కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని జయంతిలో...

నిబంధనల ప్రకారమే జగన్ ములాఖ‌త్‌లు

హైదరాబాద్ : చట్టం, న్యాయ నిబంధనలు, జైలు మాన్యువల్ ప్రకారమే వైయస్‌ఆర్ ‌కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ములాఖత్‌లలో రాజకీయ నాయకులను కలుసుకుంటున్నారని, ఈ విషయం సాక్షాత్తూ జైళ్ల శాఖ డి.జి. కృష్ణరాజు చెప్పారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వివరించారు. హైదరాబాద్‌లో ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ జగన్ ములాఖ‌త్‌లు జరుగుతున్నాయంటూ టిడిపి‌, కాంగ్రెస్‌ నాయకులు యనమల రామకృష్ణుడు, వి. హనుమంతరావు, గండ్ర వెంకట రమణారెడ్డి చేస్తున్న ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు. ములాఖత్‌లపై...