హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మంగళవారం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అలాగే కాకినాడలో పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో గొల్ల బాబురావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బొడ్డు భాస్కర రామారావు, కుడిపూడి చిట్టబ్బాయ్, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, నారాయణస్వామి, అమర్ నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ దీక్షకు దిగింది. ఈ దీక్షకు జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి,కడప ఇంఛార్జ్ అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు.
మచిలీపట్నంలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు దీక్షకు కూర్చున్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, కుక్కల నాగేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు. కర్నూలులో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీమంత్రి మారెప్ప, చక్రపాణిరెడ్డి దీక్ష చేపట్టారు.
ఆదిలాబాద్ లో చేపట్టిన నిరసన దీక్షలో బోడ జనార్థన్, జనక్ ప్రసాద్, కోనేరు కోనప్ప, సోయం బాబూరావు పాల్గొన్నారు. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, తోపుదుర్తి కవిత, వై. విశ్వేశ్వరరెడ్డి కూర్చున్నారు. నిజామాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి దీక్ష చేపట్టారు.
విశాఖలో వైఎస్ఆర్ సీపీ చేపట్టిన దీక్షలో దాడి వీరభద్రరావు, వంశీకృష్ణయాదవ్, గండి బాబ్జీ, చెంగల వెంకట్రావ్, ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు పాల్గొన్నారు.మరోవైపు ఏడాది నుంచి వైఎస్ జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా కూకట్‌పల్లి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ నేత వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో రెండు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.