Tuesday, 7 May 2013

మద్దుకూరులో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ

మద్దకూరు : మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగం వైఎస్ షర్మిల బుధవారం ఖమ్మం జిల్లా మద్దకూరులో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రకు తరలి వచ్చారు. జై జగన్ నినాదంతో మద్దకూరు హోరెత్తింద...

కర్ణాటకలో నరేంద్రమోడీ ప్రభావం కనిపించలేదు

బెంగళూర్: కర్ణాటక ప్రజలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రభావితం చేయలేకపోయారని ఆ రాష్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య బుధవారం బెంగళూర్ లో వెల్లడించారు. రాష్ట్రంలో మోడీ మంత్రం పని చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురువేసిందని సిద్దరామయ్య ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.&nbs...

మాజీ సీఎం సదానంద గౌడ ఓటమి

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగలింది. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓడిపోయారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శకుంతాల శెట్టి చేతిలో పరాజయం పొందారు. మరోవైపు ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. బీజేపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.&nbs...

కర్ణాటకలో కాంగ్రెస్ తొలి విజయం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. పుత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి శకుంతాల శెట్టి విజయం సాధించారు. కాగా శకుంతలా శెట్టి చేతిలో మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ పరాజయం పాలయ్యారు. దీంతో కర్ణాటకలో బీజేపీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఉడిపిలో ప్రమోద్ మద్వరాజ్ (కాంగ్రెస్) గెలుపొందారు. కాంగ్రెస్ 107 స్థానాల్లో ముందంజలో ఉంది.&nbs...

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ

బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. 93 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ 35, జేడీఎస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 36 కేంద్రాల్లో ఎన్నిక లెక్కింపు జరుగుతుండగా మొత్తం 223 స్థానాలకు గాను 2940 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారితో 58 మంది మహిళా అభ్యర్థులు కూడా వున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కాంగ్రెస్‌ ఆధిక్యత మొదలైంది. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించార...

కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ లోకి వెళతారా?

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను వీడతారా? ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లవచ్చా?దీనిపై మీడియాలో ప్రత్యేకించి జగన్ వ్యతిరేక మీడియాలో కధనాలు వస్తున్నాయి. దాడి వీరభద్రరావను పార్టీలో చేర్చుకున్న అంశంలో అదికారికంగా తాను జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కొణతాల ప్రకటించినప్పట్టికీ, ఆయన అసంతృప్తిలో రగులుతున్నారని , కాంగ్రెస్ లోకి వెళ్లే యోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి గంటా శ్రీనివాసరావులు కూడా...

ఊహించిన ప్రకారమే వేటుకు రంగం సిద్దమా!

శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటుకు ఇప్పుడు రంగం సిద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలు రాకుండా జాప్యం చేసి ఆ గడువు పూర్తి అయ్యాక వేటు వేయడానికి రెడి అవుతున్నట్లే కనబడుతోంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ పద్దెనిమిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నిజంగానే వీరందరిని అనర్హులుగా చేస్తే చరిత్రలో నాదెండ్ల మనోహర్ ఒక రికార్డు సృష్టించినవారు అవుతారు.దాదాపు ముప్పైఐదుమంది ఎమ్మెల్యేలను అనర్హులను...

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. క్షణమొక యుగంగా గడుపుతున్న కన్నడ రాజకీయ నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.  మధ్యాహ్నం 12 గంటలకు ప్రాథమిక ఫలితాలు తెలిసి, ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గానూ, 223 స్థానాలకు గత ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి మృతి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ...

నేపాల్‌కు వైఎస్సార్ సీపీపతినిధి బృందం

హైదరాబాద్: దుబాయ్‌లో గత ఆరేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కరీంనగర్ చెందిన ఆరుగురు ఖైదీలకు విముక్తి కలిగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో విడత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2007లో మృతి చెందిన ఒక నేపాలీ కేసులో వీరు దుబాయ్‌లో శిక్షను అనుభవిస్తున్నారు. ఖైదీల తరఫున నేపాలీ పౌరుడి కుటుంబంతో మాట్లాడి వారిని ఒప్పించి ఖైదీల విడుదలకు సమ్మతిని తీసుకునేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రతినిధి బృందం బుధవారం కఠ్మాండుకు వెళ్తోంది. పార్టీ ప్రవాస భారతీయ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్, సీజీసీ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డితో పాటు దుబాయ్‌కి చెందిన న్యాయవాది వి.అనూరాధ...

వైఎస్‌ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించిన YS షర్మిల

ఖమ్మం: వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం తిప్పనపల్లి చేరుకుంది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. తిప్పనపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు.&nbs...

అవినీతి మంత్రులను తొలగించని కేంద్రం:అంబటి రాంబాబు

గుంటూరు: అవినీతి మంత్రులను కేంద్రం తొలగించడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పిఎంఓలో సీబీఐ నివేదికను ట్యాంపరింగ్ చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మంట కలిసినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్గేట్ వ్యవహారంలో సాక్ష్యాలను తారుమారు చేసిన పెద్దమనుషులను వదిలేశారన్నారు. జగన్ బెయిల్ పై బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఢిల్లీలో...

జగన్ సిఎం-ప్రజలకు మేలు:కొణతాల రామకృష్ణ ఆశయం

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నదే తన ఆశయం, ఉద్దేశం అని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి లేనప్పుడు నమస్కారం పెట్టి వెళ్లిపోవాలన్నారు. వైఎస్ తో, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే తాను ఇక్కడకి వచ్చానని, ఈ పార్టీ తన పుట్టినిల్లు అని తెలిపారు.  ఏ రాజకీయపార్టీ అయినా...

కొండా దంపతులు మా వైపే- ఆ మాట వారు చెప్పరు

వరంగల్ జిల్లా కు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు కొండా మురళీ, కొండా సురేఖ దంపతులు తమ పార్టీలోనే కొనసాగుతారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెబుతున్నారు. పార్టీలో అంతర్గత కలహాల వల్ల పెద్దగా నష్టం ఉండదని ఆయన అన్నారు. అన్ని పార్టీలలో చిన్న, చిన్న గొడవలు ఉంటాయని ఆయన అన్నారు. కొండా సురేఖ దంపతులు తమతోనే ఉంటారన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ఈ మాట చెప్పడమే కాని, మాజీ మంత్రి కొండా సురేఖకాని, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ కాని దీనిపై ఎందుకు...

శైలజానాథ్ అవినీతి మంత్రి : గోనె ప్రకాష్ రావు

హైదరాబాద్ : ప్రాధమిక విద్యా శిక్షణ కళాశాలలకు అనుమతులు మంజూరు చేసేందుకు మంత్రి శైలజానాథ్ భారీ ముడుపులు పుచ్చుకున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. జనవరి 25 నాటికే పూర్తి కావాల్సిన ప్రక్రియను స్వలాభాల కోసం కొనసాగించారన్నారు. 300 కళాశాలలకు ఒక్కొక్కదానికీ విడివిడిగా అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.  ఒక్కో కళాశాల నుంచి 7 లక్షల రూపాయల వరకు సొమ్మును దండుకున్నారని గోనె మంగళవారమిక్కడ విమర్శించారు....

హీరో రామ్ చరణ్ బాధితులను పోలీసులు బెదిరించారా?

కారు వెళ్ళేoదుకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు చితకబాదిన రాoచరణ్ సెక్యూరిటీ పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కేసు నమోదు చేయకపోగ బాధితులనే పోలీసులు బెదరగొట్టి పంపారని, పై నుంచి వచ్చిన ఒత్తిల్లు ఆ మేరకు పనిచేశాయని తెలుస్తోంది. అయితే, ఈ దాడికి సాక్ష్యంగా ఫోటో లు లబించాయీ . జివికే బస్ స్టాప్ వద్ద ఆదివారం మధ్యానం నడిరోడ్డుపైనే రాంచరణ్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన ఫనిష్, కళ్యాణ్...