సుప్రింకోర్టు తీర్పు నిష్పక్షపాతంగా లేదని, అదికారంలో లేని జగన్ ఎలా ప్రబావితం చేస్తారో సుప్రింకోర్టు చెప్పి ఉండవలసిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాలపై గౌరవం ఉందని చెబుతూనే సుప్రింకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టారు. ఇదే సమయంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు డిల్లీలోనే ఉండి ఏమి చేశారని, జగన్ కు బెయిల్ రాకుండా చేయడంలో ఎలాంటి కృషి చేశారో తెలియాల్సి ఉందని మరో నేత జూపూడి ప్రభాకరరావు అన్నారు.సుప్రింకోర్టు తీర్పు ప్రభావితమైందని అంటున్నారా అని అడగ్గా అలా అనడం లేదని అంటూనే టిడిపి బృందం అంతా హోటల్ లో ఎందుకు కూర్చున్నారో చెప్పాలని అన్నారు.మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు కేసు ప్రభావితం చేయకుండా ,అదికారంలో లేని జగన్ ఎలా ప్రబావితం చేస్తారో సుప్రింకోర్టు చెప్పాలని శ్రీకాంత రెడ్డి ప్రవ్నించారు.కాగా కొణతాల రామకృష్ణ సిబిఐపై సుప్రింకోర్టు పంజరంలో చిలుక మాదిరి సిబిఐ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇలాంటి తీర్పు రావడం దురదృష్టకరమని కొణతాల రామకృష్ణ అన్నారు.