ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నేడు షర్మిల పాదయాత్ర తల్లమడ నుంచి ప్రారంభం కానుంది. బేతుపల్లి మీదుగా మరో ప్రజాప్రస్థానం గంగారం చేరుకుంటుంది. భోజన విరామం అనంతరం పాతపాకలగూడెం, పాకలగూడెం, గురుబట్లగూడెం మీదుగా షర్మిల పాదయాత్ర చేస్తారు. చివరిగా లింగగూడెం చేరుకుంటారు. నిన్నటికి షర్మిల 19వందల 40 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో ఆమె పాదయాత్ర నేటి సాయంత్రం ముగియనుంది. ఈ సాయంత్రం మరోప్రజాప్రస్థానం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభం కానుంది.