Tuesday, 21 May 2013

మా మనసు ఎంత బాధపడి ఉంటుంది- YS షర్మిల

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మంత్రులు ధర్మాన, సబితలు తమను కళంకిత మంత్రులు అంటుండడంపై బాధపడుతున్నారని, తమను అవినీతి మంత్రులు అని అనవద్దని కోరుతున్నారని, మరి జగన్ ను ఏ కోర్టు దోషి అని చెప్పిందని కొందరు కాంగ్రెస్ నేతలు అవినీతి కడుతున్నారని ప్రశ్నించారు. ఒక మంత్రి అయితే జగన్ ను ఉరివేయాలంటున్నాడని, అప్పుడు మా మనసుకు బాధ కలగదా అని షర్మిల వ్యాఖ్యానించారు.26 జీవోలు కేబినెట్ సమిష్టి నిర్ణయం అని ఈ రోజు చెప్పుకుంటున్నారని..నాడు...

పులివెందులలో నేడు విజయమ్మ పర్యటన

పులివెందుల : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ బుధవారం పులివెందులలో పర్యటించనున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందుల చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు.  ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వేంపల్లెలో తాగునీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం చక్రాయపేట మండలంలోని కె.రాజుపల్లెలో తాగునీటి సమస్య తీర్చనున్న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈనెల 23న దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో విజయమ్మ పాల్గొంటారు...

తవ్వుకున్న గోతిలోనే పడ్డారు

* జగన్ కేసులో మంత్రుల తీరుపై నిప్పులు చెరిగిన షర్మిల * 26 జీవోలపై కోర్టు నోటీసులిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సమాధానమివ్వలేదు * జీవోలతో సంబంధం లేని జగనన్నను జైలుకు పంపుతుంటే వీరంతా వేడుక చూశారు * ఈ రోజు వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడుతుంటే.. ఆ జీవోలన్నీ సక్రమమేనని ఒప్పుకొంటున్నారు * నేరం నిరూపణ కాకుండా తమను అవినీతి మంత్రులని ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారు * మరి ఏ కోర్టూ చెప్పకుండానే జగన్‌ను దోషి అంటే మాకు బాధ కలగదా? * దెయ్యాలు వేదాలు...

ఏ తీర్పులు ఎలా ఉన్నా...ప్రజాతీర్పులో గెలుపు YS జగన్‌దే

జగన్ కేసును పరిశీలించిన కొద్దీ మామూలు ప్రజానీకం కూడా న్యాయస్థానాలు, వాటి పనితీరును శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది! న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదా, సీబీఐ లాంటి సంస్థలను అవి పూర్తిగా నమ్ముతున్నాయా అనే అనుమానం కూడా వస్తోంది. నేర నిరూపణ అయ్యేవరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే అన్న న్యాయసూత్రాన్ని అంతా విస్మరించారా అనిపిస్తోంది. విస్మరించనట్లయితే సంవత్సరకాలంగా జగన్ జైల్లో ఉండేవారు కాదు. ఒకపక్క సీబీఐ పూర్తిగా ప్రభుత్వ చెప్పుచేతల్లో నడిచే సంస్థ...

తిరుగులేని జనాదరణతో నాయకునిగా YS జగన్ అంతకంతకూ ..

కాంగ్రెస్-టీడీపీ ఎన్ని కుమ్మక్కు కుట్రలకు దిగినా, జన నేతను ప్రజలకు దూరం చేయాలన్న వాటి లక్ష్యం మాత్రం అస్సలు నెరవేరలేదు. సరికదా, ఈ నిస్సిగ్గు ప్రయత్నాల ద్వారా రెండు పార్టీలూ విశ్వసనీయతను, జనాదరణను నానాటికీ కోల్పోతూ అధఃపాతాళానికి దిగజారుతుంటే... తిరుగులేని జనాదరణతో నాయకునిగా జగన్ అంతకంతకూ ఎదుగుతున్నారు. తాము వైఎస్ తనయుని వెన్నంటే ఉన్నామని ప్రతి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీర్పు చెబుతూనే వస్తున్నారు. కనీసం జేబు వ్యవస్థల సాయంతో జగన్‌ను...

పార్టీలోనే ఉండి పోరాడుతా!

కరీంనగర్ ఎమ్.పి పొన్నం ప్రబాకర్ తాను కాంగ్రెస్ లోనే ఉండి తెలంగాణ కోసం పోరాడుతానని ప్రకటించారు.ఇప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుదన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.హై కమాండ్ మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.లేకుంటే కాంగ్రెస్ కు తెలంగాణలో తీవ్ర నష్టం వస్తుందని ఆయన హెచ్చరించారు. ముగ్గురు ఎంపీలు ఇదే అంశంపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారని, అధిష్టానం సానుకూలంగా స్పందిస్తే వారు పార్టీలోనే కొనసాగుతారేమోనని పొన్నం...

కాంగ్రెస్ లో చంద్రబాబు హవా!

కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు హవా కొనసాగుతోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని ఆమె అన్నారు.చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్‌ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు.చంద్రబాబు డిమాండుకు తలొగ్గే ఇద్దరు మంత్రులను కాంగ్రెస్ బలిపశువులను చేసిందని ఆమె ఆరోపించారు.ఇప్పుడు ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే మార్చేస్తుందని కూడా ఆమె అన్నారు.ధర్మాన...

టీఆర్ఎస్ లొల్లిపై సీబీ'ఐ'

అసత్యపు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరఘునందన్ రావు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నారు. పదమూడేళ్ల నుండి ఉద్యమ జెండాలు మోసిన తనకు ఎన్నికల సమయంలో మొండి చేయి చూపించడాన్ని జీర్ణించుకోలేని రఘనందన్ రావు టీఆర్ఎస్ అగ్రనేతలపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. రఘునందన్ రావు ఆరోపణలపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆత్మసంరక్షణలో పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది....

కేసీఆర్, హరీష్ వసూళ్లపై ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఆ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావుల వసూళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఇటీవల ఆ పార్టీనుంచి సస్పెండ్ అయిన రఘునందన్‌రావు సీబీఐకి ఫిర్యా దు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణను కలిసి మూడు పేజీల ఫిర్యాదును అందజేశారు. అనంతరం రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి స్టైలిష్ హోం ఎండీ రంగారావుకు...

రఘునందన్ సీఎం తొత్తు : టీఆర్‌ఎస్

హైదరాబాద్: రఘునందన్‌రావు సీఎం కిరణ్ తొత్తుగా మారారని టీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఇతర నేతలపై ఆయన చేసిన విమర్శల్లో ఒక్కదానికి కూడా ఆధారాలు చూపలేకపోయారని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే తనకు గన్‌మెన్లను కేటాయించాలని స్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరితే ఇంతవరకు స్పందనలేదని.. కానీ, కోరిన రెండు గంటల్లోనే రఘునందన్‌కు డీజీపీ గన్‌మెన్‌ను కేటాయించారని తెలిపారు. కిరణ్ కనుసన్నలలోనే ఆయన పనిచేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా అని శ్రవణ్ ప్రశ్నించారు.&nbs...

చంద్రబాబు పై YS విజయమ్మ ధ్వజం

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. ఎన్.టి.ఆర్.పేరు చెప్పుకునే ఆయన బతుకుతున్నాడని , తెహల్క డాట్ కామ్ రెండువేల సంవత్సరంలోనే చంద్రబాబును అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని , అవినీతిపరుడని పేర్కొందని ఆమె అన్నారు గత మూడేళ్లుగా అన్ని ఎన్నికలలో టిడిపి ఓటమి చెందిందని,అనేకచోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు.జగన్...

మిగిలిన మంత్రులకు ఎసరు పెట్టిన బొత్స సత్యనారాయణ

పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులంతా రాజీనామా చేయవలసిందేనని ఆయన ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు మంత్రుల తప్పు లేదని చెబుతూ వచ్చిన బొత్స ప్రకటన ఉద్దేశం అదిష్టానం నిర్ణయానుసారం మాట్లాడడమా?లేక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెట్టడమా?అన్నది చూడాల్సి ఉంది.అంతేకాక పార్టీని వదలి వెళుతున్న ఎమ్.పిలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టుకుని వేలాడుతామా అని కూడా ఆయన అన్నారు.తెలంగాణ అంశం కేంద్రం పరిదిలో...

రఘునందన్ సంచలన ఆరోపణ

టిఆర్ఎస్ నుంచి సస్పెండైన నేత రఘునందనరావు మరో సంచలన ఆరోపణ చేశారు.జగన్ కేసులో నిందితుడుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి టిఆర్ఎస్ నేతలు పది కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.దీనికి సంబందించిన ఆదారాలు సిబిఐకి ఇచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పడం విశేషం.అలాగే ఎమ్.ఆర్.కేసులో ఉన్న కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావులతో కెసిఆర్,హరీష్ రావు లావాదేవీలు నడిపారని ఆయన ఆరోపించార...

'ప్రాణహిత'కు జాతీయహోదా: YS విజయమ్మ డిమాండ్

సిర్పూర్-కాగజ్ నగర్(ఆదిలాబాద్ జిల్లా): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జగన్ సీఎం కాగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు.  ఈ...

బాబుకు తలొగ్గిన ప్రభుత్వం: శోభానాగిరెడ్డి

హైదరాబాద్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్‌ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు.  ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే.. మార్చే స్థితిలో కాంగ్రెస్‌ ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డిమాండ్‌కు తలొగ్గి ఇద్దరు మంత్రులను బలిపశువులను చేశారని అన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ఇంత...

సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా!

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండైన రఘునందనరావు చెప్పినట్లుగానే చేశారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ వసూళ్లపై చర్య తీసుకోవాలని కోరుతూ రఘునందనరావు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా కేసీఆర్, హరీష్‌రావులపై సీఆయన తన ఫిర్యాదును ఇచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని ఆయన తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం...

యుపిఎకి గడ్డుకాలమే-సర్వే ఫలితాలు

కేంద్రంలో యుపిఎ భవిష్యత్తు కొంత గందరగోళంగానే ఉన్నట్లుంది.పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక టీవీ ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకి కేవలం 136 సీట్లే వచ్చే అవకాశం కనబడుతోంది. అదే బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. సీట్ల సంఖ్య 206 సీట్లకు పెరగవచ్చు.దేశవ్యాప్తంగా నూట ఏభై రెండు సీట్లలో చేసిన సర్వే ప్రకారం వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కు పూర్తి నిరాశగా ఉన్నాయని చెప్పాలి.అయితే బిజెపి కి పూర్తి స్థాయి అదికారం వచ్చే అవకాశం కనడడం లేదు....

నాడు వై.ఎస్.ఆర్., నేడు విజయమ్మ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో టిడిపి అదికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండింగు ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేసి పూర్తి కాని ప్రాజెక్టు శిలాఫలకాలను సందర్శించి అక్కడ మొక్కలు నాటి నిరసన కార్యక్రమాలు చేసి వచ్చారు.ఇప్పుడు ఆయన సతీమణి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నవై.ఎస్.విజయమ్మ కూడా ఇప్పుడు అదే పనిలో పడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ వెళ్లిన విజయమ్మ...

'కేసీఆర్, హరీష్ పై సీబీఐకి ఫిర్యాదు'

హైదరాబాద్: కేసీఆర్, హరీష్‌రావుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేసినట్టు టీఆర్ఎస్ నుంచి బహిష్కృతుడయిన రఘునందన్ రావు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని చెప్పారు. టీఆర్ఎస్ కు సంబంధించిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘునందన్ రావుపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే....

జగన్ వస్తే సమస్యల పరిష్కారం: YS విజయమ్మ

ఆదిలాబాద్: జగన్ బాబు వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. తుమ్మడి వద్ద భూమి పూజకు వైఎస్ వేసిన పైలాన్ కు ఆమె పాలాభిషేకం చేశారు. ఆ తరువాత అక్కడ మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల నిర్మిద్దాం తెలంగాణను సశ్యశ్యామలం...