Friday, 24 May 2013

హరీష్‌కు కేసీఆర్ ఝలక్..?


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పీఠంపై కన్నేసారు. 2014 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణాతో పాటు సీఎం పీఠం సాధించాలని వ్యూహం రూపొందించారు. తెలంగాణాలోని 100 అసెంబ్లీ సీట్లు, 16 ఎంపీ సీట్లు పొంది చక్రం తిప్పాలని చుస్తున్నారు. అసెంబ్లీకి పోటితో హరీష్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని భావిస్తున్నారు. దీంతో సమైఖ్య రాస్ట్రం లోనూ సీఎం పదవి వచే అవకాశాలు ఉన్నాయని గులాబీ బాస్ అంచనా . మరి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సిందే. దీంతో పార్టీకి ఇబ్బంది గా మారిన హరీష్ ను కుడా చెక్ పెట్టినత్లు అవుతుందని కేసీఆర్ వ్యూహం రూపొందించినట్లు సమాచారాం.
ఇందులో భాగమే రఘునందన్ అరోపణల తైం లొ పార్టీ వర్గాలు నోరు మెదపలేదని ప్రచారం జరుగుతోంది.

YSజగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా 27న ర్యాలీ!

హైదరాబాద్: ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భంధించిన తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాకు తరలి రావాలని వైఎస్ భారతి పిలుపునిచ్చారు. మే 27 తేది సోమవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన కార్యక్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొనాలని వైఎస్ భారతి విజ్ఞప్తి చేశారు. జగన్ కు బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కొవ్వొత్తితో తరలిరావాలి అని అభిమానులను వైఎస్ భారతీ కోరారు.

మే 28న ఇందిరాపార్క్ వద్ద YSవిజయమ్మ దీక్ష!

హైదరాబాద్: జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మే 28 తేదిన హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు వెల్లడించారు. 28 తేది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారని వైఎస్ఆర్ సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. విజయమ్మ దీక్షకు మహానేత వైఎస్ఆర్ అభిమానులు, జననేత వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలుపాలని పార్టీ నాయకులు విజ్క్షప్తి చేశారు. 

26న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్: వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ నిర్వహిస్తున్నట్టు యూనియన్ అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

టీడీపీలోకి మరో టీఆర్ఎస్ నేత


రెండేళ్ల క్రితం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన రాజ్యసభ మాజీ ఎంపీ రుమాండ్ల రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఎన్టీఆర్ దగ్గర చాలా సన్నిహితంగా ఉంటూ పార్టీ 
కార్యాలయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుతో సన్నిహితం ఉన్నప్పటికీ అప్పటి తెలంగాణ ఉద్యమ ఎఫెక్ట్ వల్ల రామచంద్రయ్య టీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. టీఆర్ఎస్ లోఉన్న తాజాగా పరిణామాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రయ్య ప్రకటించారు.

చంద్రబాబుకు కేసీఆర్ సవాల్


బాన్సువాడ: తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తీర్మానం చేయాలని చంద్రబాబు నాయుడికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణపై టీడీపీది నాటకమేనని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నందుకే చంద్రబాబు పాదయాత్ర చేశారని అన్నారు. ఓట్ల కోసం వచ్చే గుంటనక్క వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు సకలజనుల సమ్మె చేసినా కేంద్ర సర్కారు స్పందించలేదని వాపోయారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ టీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు.

'బ్రహ్మణి'ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు


జమ్మలమడుగు: బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, రాచమళ్ల ప్రసాద్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బీసీ గోవిందరెడ్డి, బద్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మునయ్య, బ్రహ్మానందరెడ్డి, అప్జల్‌ఖాన్‌ సందర్శించారు. 

ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను తీసుకుని నిర్మాణం చేపడితే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించినట్లు అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల పర్యటన స్థానికుల్లో ఆశలు రేపుతోంది. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నారు.

'బ్రహ్మణి'ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు


జమ్మలమడుగు: బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, రాచమళ్ల ప్రసాద్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బీసీ గోవిందరెడ్డి, బద్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మునయ్య, బ్రహ్మానందరెడ్డి, అప్జల్‌ఖాన్‌ సందర్శించారు. 

ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను తీసుకుని నిర్మాణం చేపడితే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించినట్లు అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల పర్యటన స్థానికుల్లో ఆశలు రేపుతోంది. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నారు.

'టీఆర్ఎస్ లో చేరేందుకు ఎర్రబెల్లి యత్నం'


వరంగల్: టీఆర్ఎస్ లోకి రావడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ మాజీ పొలిట్ బ్యురో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. ఓ ఫౌల్ట్రీ యజమాని ద్వారా, ఓ పెద్ద బిల్డర్ ద్వారా ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకంటే ముందు నుంచే టీఆర్ఎస్ లో చేరేందుకు వారు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 

చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఎర్రబెల్లి, రేవూరికి కడియం హితవు పలికారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ నేతలు దమ్ముంటే మహానాడులో చంద్రబాబుతో ఒక్కసారి జై తెలంగాణ అనిపించగలరా అని సవాల్ విసిరారు.