న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంటులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, నందమూరి కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు.