హైదరాబాద్: త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు దాడి వీరభద్రరావు వెల్లడించారు. ఆయన శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలిశారు. అనంతరం దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ తాను విన్న జగన్ వేరు... ఇప్పుడు తాను చూసిన జగన్ వేరు అని అన్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ వైఖరి మేరకే తాను వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశానని ఆయన తెలిపారు. ఆరోపణలపై అప్పట్లో రెండో వైపు తెలుసుకునే అవకాశం లేదని... ఇప్పుడు అసలు వాస్తవం తెలిసిందని, అందుకే ఆ కుటుంబంతో కలిసి నడవాలనుకుంటున్నట్లు దాడి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 11 నెలలుగా జైల్లో ఉన్నా జగన్‌లో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న కసి కన్పించిందని దాడి వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment