Tuesday, 14 May 2013

మాట మీద నిలబడినందుకే ప్రజలంతా YS జగన్ వైపు

ఒకే ఒక్కమాట... నల్లకాలువలో అడవితల్లి సాక్షిగా ఇచ్చిన మాట.... ‘నా తండ్రి అకాల మరణం తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను. ఓదారుస్తాను’ అని ఇచ్చినమాట. ఆ మాటకు కట్టుబడినందుకే కాంగ్రెస్ జగన్‌ని కాదనుకుంది. పొమ్మనలేక పొగబెట్టింది. జగన్ మాత్రం ఇచ్చినమాటకు కట్టుబడి తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్‌పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. లీడర్ అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపారు. మాట తప్పని,...

రఘునందనరావు మీడియా సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.రఘునందన్‌రావు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. ఆయన తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.  2001లో ఆవిర్భావ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన రఘునందన్‌రావు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. కొంత కాలంగా పార్టీ నాయకత్వం తీరుపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రఘునందన్‌రావు నిన్న భేటీ జరిపారనే సమాచారంతోనే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ప్రకట...

‘ప్రాణహిత’ పై వైఎస్సార్ సీపీ ఉద్యమం

- 20న ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించనున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ  కాగజ్‌నగర్, న్యూస్‌లైన్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించనుంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈనెల 20న ప్రాజెక్టు నిర్మాణ స్థలమైన ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిని సందర్శించనున్నారు. 2008 డిసెంబరు 16న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన...

YS జగన్ కేసులో ఒక్కో కోర్టులో ఒక్కో వాదన

- టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే సీబీఐ మోస్తోంది - జగన్ కేసులో ఒక్కో కోర్టులో ఒక్కో వాదన వినిపిస్తోంది - చివరికి ఒకే తుది చార్జిషీట్ వేస్తామని చెప్తున్న సీబీఐ.. అనుబంధ చార్జిషీట్లపై విచారణ కోరటం ఆశ్చర్యకరం - బిజినెస్ రూల్స్ ప్రకారమే జీవోలు జారీ చేశామని మంత్రి కన్నా సుప్రీంకోర్టులో పేర్కొన్నారు  - బయట మాత్రం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అజెండానే సీబీఐ మోస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ...

సెక్షన్ 409 YSజగన్‌కు వర్తించదు

* ‘దాల్మియా’ చార్జిషీట్‌పై స్పష్టం చేసిన సీబీఐ కోర్టు * అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కూడా వర్తింపజేయలేం * 2004-09 మధ్య ఆయన పబ్లిక్ సర్వెంట్ కారన్న జగన్ లాయర్లు * అలాంటపుడు ఆ చట్టమెలా వర్తింపజేస్తారంటూ ఆది నుంచీ వాదన.. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం హైదరాబాద్: ‘సాక్షి’, ‘భారతి సిమెంట్’ తదితర సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆది నుంచీ చేస్తున్న వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏకీభవించింది. ఈ...

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి టీడీపీ ఎంపి?

చిత్తూర్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ని వీడిన కడియం శ్రీహరికి మద్దతుగా శివప్రసాద్ మాట్లాడారు. దీంతో ఆయన పార్టీ ని వీడడానికే ఆ విధమైన మద్దతు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. తన రాజకీయ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని పార్టీ ని వీడినంతా మాత్రాన శ్రీహరిని ద్రోహిగానో, రాజకీయ వ్యభీచారిగానో చిత్రీకరించడం సరి కాదని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆ మాటకొస్తే...

సీఎంపై సుప్రీంకోర్టుకెళ్తా: మాజీ మంత్రి పి.శంకర్రావు

హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారంలో సీఎం కిరణ్ హస్తం ఉందని, ఇది 2జీ స్పెక్ట్రం కన్నా పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఎర్ర చందనం అక్రమ తరలింపునకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించినప్పటికీ, ఈ కేసులో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ సహా కళంకిత మంత్రులను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చే...

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 149వ రోజు బుధవారం 12.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. టి.నరసాపురం మండలం ముత్యాలంపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మధ్యాహ్నపు వారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు.  పర్యటించే ప్రాంతాలు ముత్యాలంపేట, టి.నరసాపురం, గురవాయగూడెం, ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపు వారిగూడెం ...

ఇందులో దిట్టే టిజి వెంకటేష్

రాష్ట్ర చిన్ననీటివనరుల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఎప్పుడో ఏదో ఒక అనవసర ప్రకటన చేయడంలో దిట్ట అనే చెప్పాలి.తాజాగా ఆయన చేసిన ప్రకటన కూడా అటువంటిదే.తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావును హీరోగా పెట్టి తాను ఒక సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. సిగరెట్ , మద్యం మానివేసిన కెసిఆర్ ఇప్పుడు ఈ పాత్రకు సరిపోతారని అన్నారు. విజయశాంతి దర్శకత్వంలో ,హరీష్ రావు డైలాగులతో సినిమా తీయడానికి సిద్దమని ఆయన అన్నారు.ఇక ఫైటింగ్ సీన్ లలో కెసిఆర్ కుమారుడు...

రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

వరంగల్‌: ఇటీవల టీడీపీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత కడియం శ్రీహరి రేపు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన సంగతి తెలిసింద...

స్థానిక ఎన్నికలకు సిద్ధం: కొణతాల రామకృష్ణ

విశాఖపట్నం: వైఎస్ జగన్ విషయంలో సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. సోనియా అల్లుడుకి ఒక న్యాయమా.. వైఎస్‌ జగన్‌కు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్‌ కుంభకోణంలో సోనియా అల్లుడిని వెనకేసుకొచ్చి తప్పించిందని అన్నారు. అతిగా ప్రవర్తించే సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు.&nbs...

Konda couple vows to continue support to ysrcp- Video

...

కళంకిత మంత్రులను తొలగించాలి: మాజీ మంత్రి శంకర్రావు

హైదరాబాద్: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో సీఎం హస్తం ఉందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసువేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంత్రుల అవినీతితో కాంగ్రెస్‌ శ్రేణులు నీరుగారిపోతున్నాయని అన్నార...

వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ

హైదరాబాద్: వైఎస్ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్ ను కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై తనకు అసంతృప్తిలేదని చెప్పారు. తాము పార్టీ మారడంలేదన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు...

YSజగన్ ను కలిసిన కొండా దంపతులు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ, సురేఖ దంపతులు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. చంచల్ గూడ జైలులో ములాఖత్ సమయంలో వారు జగన్ ను కలిశారు.&nbs...

YSజగన్ కేసులో కీలక పరిణామం

జగన్ కేసులో కీలకమైన పరిణామం సంభవించింది.దాల్మియా సిమెంటు చార్జీషీటులో జగన్, విజయసాయిరెడ్డిలపై నమోదైన సెక్షన్లను కోర్టు తోసిపుచ్చింది.420,409, అవినీతి నిరోదక చట్టం కింద నమోదైన సెక్షన్లను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినీతి నిరోదక చట్టం కేవలం ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నవారికే మాత్రమే వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు ప్రభుత్వంలో పనిచేయలేదు కనుక ఈ చట్టం కింద సెక్షన్లు వర్తించవన్న భావనతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని...

జగనన్నతోనే వైఎస్ సువర్ణ యుగం :షర్మిల

ఏలూరు: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ ఆ మహానేత వైఎస్ సువర్ణ యుగం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. చింతలపూడి రచ్చబండలో ఆమె ప్రసంగించారు. జగనన్న సీఎం అయితే మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండవని చెప్పారు. కరెంట్ చార్జీలు పెంచడమే సంక్షేమమా? ఫీజు రియెంబర్స్‌మెంట్ కు తూట్లు పొడవటమే సంక్షేమమా ? వైఎస్ పథకాలను నీరు గార్చడమే సంక్షేమమా? పేదవారికి ఇళ్లు లేకపోవడమేనా సంక్షేమమంటే? సంక్షేమమంటే పేద విద్యార్థుల బస్ పాస్ సబ్సిడీలు కుదించడమేనా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం మూడు గంటలు కూడ కరెంట్...