Monday, 29 April 2013

సీబీఐ చెప్పిందా.. అధిష్టానం చెప్పిందా?

జగన్ కేసులో కోట్ల వ్యాఖ్యలపై ఎంపీ సబ్బం హరి మండిపాటు విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి వదలబోమని సీబీఐ చెప్పిందా... లేక వదలొద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందా అని ఎంపీ సబ్బంహరి ప్రశ్నించారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మండిపడ్డారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల సంస్థగా వ్యవహరించాల్సిన...

విచారణకు రాకముందే వాయిదా ఎలా: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : క్విడ్‌ప్రోకో కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సిబిఐ తన ధోరణి మాత్రం మార్చలేదు. నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లు ఇవ్వాళ కోర్టు ముందుకు రానున్నాయి. కోర్టు ఇచ్చిన నెంబరింగ్‌ ప్రకారం ఏడో సీరియల్‌ నెంబర్‌లో ఈ రెండు పిటీషన్లు విచారణకు రానున్నాయి. అయితే ఈలోగానే సిబిఐ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ముందు మెన్షనింగ్‌ మ్యాటర్‌ ఉంచారు. అత్యవసర సమయంలో చేయాల్సిన వాదనను మెన్షనింగ్‌ మ్యాటర్‌ అంటారు. నిమ్మగడ్డ, విజయసాయిలకు...

సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. సోనియా నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన టీ జాక్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే సోనియాకు వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రం అనుమతించారు. పోలీసుల అనుమతితో టీ జాక్ నేత శ్రీనివాస్ గౌడ్ వినతపత్రం సమర్పించి వెనుదిరిగారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ముట్టడించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశార...

సోనియాగాంధీ నివాసం వద్ద భద్రత పెంపు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం వద్ద మంగళవారం భద్రతను పెంచారు. దీంతోపాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణవాదులు సోనియా నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో... ముందస్తుగా భద్రతను పెంచారు.&nbs...

తెలంగాణకు అడ్డుపడింది చంద్రబాబే: అద్వానీ

హైదరాబాద్: ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చేవాళ్లమని.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డు పడకుంటే అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర నేతలతో సుమారు గంట సేపు మాట్లాడారు. తెలంగాణ జేఏసీ ఢిల్లీలో సంసద్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. తెలంగాణ ఇవ్వడానికి రాజకీయ సంకల్పం కావాలని అద్వానీ వారితో పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ, విదర్భ...

Abhimanyuda...! Arjunuda...! YS Jagan Song

...

YS Jagan's bail plea hearing adjourned to May 6

...

మే 1 నుంచి యధావిధిగా షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 29 ఏప్రిల్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మే 1వ తేదీ నుంచి యధావిధిగా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాదయాత్రికురాలు, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ఎడమకాలి మడమ నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా మంగళవారం మరో ప్రజాప్రస్థానానికి విరామం ప్రకటించారు. శ్రీమతి షర్మిలకు మంగళవారం కూడా విశ్రాంతి అవసరమని వైద్యులుసూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తల‌శిల రఘురాం చెప్పార...

చంద్రబాబువి శుష్క వాగ్దానాలు: గట్టు రామచంద్రరావు

హైదరాబాద్ : శుష్క వాగ్దానాలు చేయడం చంద్రబాబుకు కొత్తకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ కోసం వస్తున్న పాదయాత్రలో బాబు చాలానే శుష్క వాగ్దానాలు చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎన్ని వాగ్దానాలు అమలు చేశారని గట్టు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాల కోసం పోరాడారన్నారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు...

YS జగన్‌ బెయిల్‌పై సిబిఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మే 6 లోపు నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాజకీయ దురుద్దేశంతోనే బెయిల్‌ను సీబీఐ అడ్డుకుంటోందని జగన్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే ... జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.  సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన హామీని సీబీఐ నిలబెట్టుకోలేదని...