Thursday, 16 May 2013

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల


హైదరాబాద్ : పదవ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి పరీక్షా ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈసారి కూడా గతేడాది తరహాలోనే మార్కులు వెల్లడించకుండా కేవలం గ్రేడ్లను మాత్రమే ప్రకటించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే అధికశాతం ఉత్తీర్ణత సాధించారు. 88.08 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 0.24 ఉత్తీర్ణత శాతం పెరిగింది. 

విద్యార్థులు ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల నుంచి తమ గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్ పాయింట్ల సగటు (జీపీఏ) పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్, మొబైల్ ద్వారా (ఐవీఆర్‌ఎస్) 1255225 నంబరుకు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ఎస్‌ఎస్‌సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ టైప్ చేసి 53345, 53346 నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు. 5888 నం బరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. www.saksh.com, www.sakshieducation.com వెబ్‌సైట్‌తోపాటు వివిధ ప్రైవేటు సైట్లలో ఫలితాలను చూడవచ్చు.

కెటిఆర్ ఎందుకు ఖండించడం లేదు!

తెలంగాణ రాష్ట్ర సమితిలో సస్పెండ్ అయిన మెదక్ జిల్లా పార్టీ మాజీ అద్యక్షుడు రఘునందనరావు పార్టీ అదినేత కెసిఆర్ కుటుంబంలోనే చిచ్చుపెట్టారన్న కధనాలు వస్తున్నాయి.కెసిఆర్ కుమారుడు తారకరామారావును ఓడించడానికి హరీష్ రావు స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన మహేంద్ర రెడ్డికి డబ్బులు పంపించారన్న ఆరోపణ ప్రకంపన సృష్టిస్తోంది.దీనిని నేరుగా మీడియా ముందుకు వచ్చి ఖండించాలని కెటిఆర్ ను హరీష్ రావు కోరారని అంటున్నారు. కాని దీనికి కెటిఆర్ అంత సుముఖంగా లేరని చెబుతున్నారు. అందువల్లనే ఆయన ఒక ఎస్.ఎమ్.ఎస్.ను మొక్కుబడిగా ఇచ్చి సరిపెట్టుకున్నారని అంటున్నారు.కెటిఆర్ కు ఈ ఆరోపణను నమ్ముతున్నారని అనుకోవాలా?లేక ఈ టైమ్ లో హరీష్ కు మద్దతు ఇస్తే తాను బలహీనపడుతానని ఆయన అనుకున్నారా అన్నది చూడాలి.దీంతో హరీష్ రావు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. నేరుగా ఖండిచాలని కెటిఆర్ ను బతిమలాడినా ఆయన అంగీకరించలేదని మీడియాలో కధనం రావడం మాత్రం హరీష్ రావు ప్రతిష్టకు భంగం కలిగించేదే.మొత్తం మీద హరీష్ రావు, కెటిఆర్ ల మద్య విబేధాలు ఇంత బహిరంగంగా బయటకు రావడం ఇదే మొదటిసారి.

వై.ఎస్ విజయమ్మ ప్రశ్నలు

సిబిఐ ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకమైన ప్రమాణం పాటిస్తున్నదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యానించారు. జగన్ ను జైలులో పెట్టి ఏడాది అయిందని, ఇంకెంతకాలం జైలులో ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. షర్మిల రెండువేల కిమీ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా జరిగినసభలో ఆమె ప్రసంగించారు ప్రధానమంత్రికి ఒక న్యాయం, అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం రాష్ట్రంలో వైఎస్సార్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత బోఫోర్స్ కేసులో ఆయన పేరును తీసేశారని, కానీ రాష్ట్రంలో మాత్రం వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐర్‌లో చేర్చారని ఆమె పేర్కొన్నారు.మోపిదేవి, ధర్మాన ప్రసాద్, సబితమ్మ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ములాయం కోడలు,ఇలా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం జరుగుతోందని ఆమె ధ్వజమెత్తుతున్నారు. న్యాయ వ్యవస్థపై విమర్శలు చేస్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విజయమ్మ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.నిజానికి న్యాయ వ్యవస్థ కూడా ఈ ప్రశ్నలన్నటికీ సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది.

మంత్రి సి. రామచంద్రయ్య లక్ష్యం ఇదేనా!


మంత్రి సి.రామచంద్రయ్య తన ఎజెండా ప్రకారమే కధ నడుపుతున్నట్లున్నారు.చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం, కాపులకు రిజర్వేషన్లు కల్పించడం లక్ష్యాలుగా పెట్టుకుని కాపు సంఘాలన్ని పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కాపు సంఘాల సమావేశంలో ఆయన పా్లొన్నారు. రామచంద్రయ్య రెండు లక్ష్యాలతో ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు కాపులను నిలబెట్టడం, చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ ఐక్యత అవసరం అని తెలియచెప్పడం వంటి ఉద్దేశాలతో రామచంద్రయ్య మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఏ రాజకీయ పార్టీతో సంబందం లేదని కాపునాడు అద్యక్షుడు మిరియాల వెంకటరావు చెప్పినా , రామచంద్రయ్య మాత్రం తన పద్దతితో కుల సంఘాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.అయితే ఆయనే చెప్పినట్లు మిగిలిన కులాలను వెంటబెట్టుకోగలిగితేనే వారి రాజకీయ ప్రాదాన్యం పెరుగుతుంది.కాకపోతే కాంగ్రెస్ లో తమ బలం పెంచుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడవచ్చు.

కాన్వాయ్ లేకుండా బయటకు వెళ్లిన సీఎం కిరణ్

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం ఏపీ భవన్ నుంచి కాన్వాయ్ లేకుండా బయటకు వెళ్లారు. ఏఐసీసీ ఉపాధ్యక్షురాడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకే ముఖ్యమంత్రి వెళ్లినట్లు సమాచారం. గత రెండు రోజులుగా హస్తినలో మకాం వేసిన కిరణ్ కుమార్ రెడ్డి పలువురు నేతలతో సమావేశం అయ్యారు. ఈరోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు.

వై.ఎస్.కుటుంబంపై రాళ్లు వేస్తున్నారు


దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇమేజీతో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు వెన్నుపోటు పొడిచిందని, ఆయన కుటుంబంపై రాళ్లు వేస్తోందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని ఆమె ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడులో రెండువేల కి.మీ.పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. తాను జగన్ వదలిన బాణాన్నే అని ఆమె ప్రకటించారు.వచ్చే ఎన్నికలలో ఈ కుట్రదారులను నరకాసురులను ఓటు ద్వారా సంహరించాలని, అప్పటివరకు యుద్దమేనని ఆమె ప్రకటించారు.పార్టీ ముఖ్యనేతలంతా వెళ్లి సంఘీ భావం ప్రకటించిన ఈ షర్మిల ఉత్సాహంగా మాట్లాడారు.

నేడు టెన్త్ ఫలితాలు


5/17/2013 1:12:00 AM
- 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి పార్థసారథి
- ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల్లో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, జీపీఏ లభ్యం
- ఫోన్, ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలను సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల నుంచి తమ గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్ పాయింట్ల సగటు (జీపీఏ) పొందవచ్చని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్, మొబైల్ ద్వారా (ఐవీఆర్‌ఎస్) 1255225 నంబరుకు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించారు. అలాగే ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా పొందవచ్చని వివరించారు. ఎస్‌ఎస్‌సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ టైప్ చేసి 53345, 53346 నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు. 5888 నం బరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. www.sakshieducation.com వెబ్‌సైట్‌తోపాటు వివిధ ప్రైవేటు సైట్లలో ఫలితాలను పొందవచ్చు.

జిల్లా వెబ్‌సైట్లలోనూ..: జిల్లాల్లో డీఈఓల వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఫలితాలను మంత్రి విడుదల చేసిన వెంటనే వాటిని ఈ మెయిల్ ద్వారా డీఈఓలకు పంపించాలని ప్రభుత్వపరీక్షల విభాగం డెరైక్టర్‌ను పాఠశాల విద్యా డెరైక్టర్ ఉషారాణి ఆదేశించారు. ఫలితాల వివరాలను సంబంధిత స్కూళ్లకు ఈ మెయిల్ ద్వారా పంపించాలని, విద్యార్థులకు వెంటనే సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.

అన్ని పేపర్ల రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీ
ఈసారి అన్ని పేపర్లకు రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ అందజేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. గత ఏడాది ఐదు పేపర్లలో రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చిన విద్యాశాఖ ఈసారి చివరి పేపరుకు కూడా (సాంఘిక శాస్త్రం) అవకాశం కల్పిస్తోంది.

జీపీఏ లెక్కింపు ఇలా: విద్యార్థి సంబంధిత సబ్జెక్టులో సాధించే మార్కుల రేంజ్‌ను బట్టి ప్రతి సబ్జెక్టుకు ఎ1, ఎ2, బి1, బి2, సి1, సి2, డి 1, డి2, ఇ వరకు 9 గ్రేడ్లు ఉంటాయి. 

ఒక సబ్జెక్టులో ఎ1 గ్రేడ్ వస్తే 10 పాయింట్లు, ఎ2కు 9, బి1కు 8, బి2కు 7, సి1కు 6, సి2కు 5, డి1కు 4, డి2 గ్రేడ్‌కు 3 పాయింట్లు ఇస్తారు. మొత్తం సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్లను కలిపి, మొత్తం సబ్జెక్టుల సంఖ్యతో భాగిస్తారు. తద్వారా వచ్చే పాయింట్లను గ్రేడ్ పాయింట్ ఏవరేజ్‌గా (జీపీఏ) పేర్కొంటారు. ఉదాహర ణకు ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో (92-100 మార్కుల రేంజ్ ఆధారంగా) ఎ1 గ్రేడ్ వస్తే.. ప్రతి సబ్జెక్టుకు 10 పాయింట్ల చొప్పున ఆరు సబ్జెక్టులకు ఇచ్చే 60 పాయింట్లను ఆ సబ్జెక్టుల సంఖ్యతో భాగించి ఏవరేజ్ చేసి, జీపీఏని 10 పాయింట్లుగా నిర్ణయిస్తారు. 

హరికృష్ణతో రాజీ యత్నాలు జరుగుతున్నాయా!

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు, రాజ్య సభ సభ్యుడు హరికృష్ణల మద్య ఏర్పడిన అంతరం తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కదనాలు వస్తున్నాయి.ఎన్.టి.ఆర్.కుమారుడు, తన వియ్యంకుడు బాలకృష్ణ ప్రత్యేకంగా చంద్రబాబు తో భేటీ అవడంపై కధనాలు వస్తున్నాయి. హరికృష్ణకు ఇటీవలికాలంలో ప్రాధాన్యత తగ్గించారని, చివరికి గవర్నర్ వద్దకు వెళ్లే కార్యక్రమానికి కూడా హరికృష్ణను పిలవలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపద్యంలో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు ఆరంబించారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వర్గాలు ఈ బేటీకి ప్రాధాన్యత లేదని చెబుతున్నా, ఎవరికి తగ్గ ఊహాగానం వారు చేస్తుననారు.ఫ్లెక్సీల వివాదం నుంచి హరికృష్ణ అసంతృప్తిగా ఉంటున్న విషయం బహిరంగ రహస్యమే. వచ్చే మహానాడులో హరికృష్ణ హాజరు కాకపోతే, అదో అంశంగా మీడియాలో వచ్చే అవకాశం ఉంది.దానిని కూడా గమనంలోకి తీసుకుని బాలకృష్ణ ద్వారా రాయబారం జరుపుతున్నారా అంటూ ఒక ప్రచారం ఉంది.ఏది ఏమైనా అంతర్గత వివాదాలు తగ్గించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం మంచిదే.

కాంగ్రెస్, టీడీపీ వెన్నుపోటు పార్టీలు: వైఎస్ షర్మిల


రావికంపాడు: వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆయన గుండెల్లోంచి పుట్టినదేనని పశ్చిమ గోదావరి జిల్లా రావికంపాడు సభలో షర్మిల అన్నారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల రెండు వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్త చేసుకున్నారు. కిరణ్‌, చంద్రబాబుల 'పథకాల'పై షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీలు రెండూ వెన్నుపోటు పార్టీలేనని షర్మిల అన్నారు. 

ఎన్ టీఆర్ ను టీడీపీ వెన్నుపోటు పొడిస్తే.. వైఎస్ఆర్ చనిపోయాక కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచిందని షర్మిల తెలిపారు. ఐఎంజీపై సీబీఐ నిజాయితీగా దర్యాప్తు చేసుంటే బాబు ఎప్పుడో జైల్లో ఉండేవారని షర్మిల అన్నారు. జగనన్న దోషి అని ఏ కోర్టు చెప్పలేదని, ఐఎంజీ, ఎమ్మార్‌ కేసుల్లో బాబు నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదని షర్మిల తెలిపారు. 

జగన్‌ను ఎంతకాలం జైల్లో ఉంచుతారు?: వైఎస్‌ విజయమ్మ


రావికంపాడు: జగన్‌బాబును జైల్లో పెట్టి ఏడాది అవుతోంది. ఇంక సరిపోలేదా? ఇంకెంత కాలం జైల్లోనే ఉంచుతారు? సీబీఐ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా విచారణ చేస్తోంది. ఒక్కోక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతోంది.ప్రధానమంత్రికి ఒక న్యాయం, అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం రాష్ట్రంలో వైఎస్సార్‌కు ఒక న్యాయమా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజీవ్ గాంధి బోఫోర్స్‌కేసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తరువాత ఆయన పేరు తీసేశారు. రాష్ట్రంలో మాత్రంలో వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐర్‌లో దోషిగా చేర్చారు. 

ఒక మోపిదేవికైతేనేమి,ధర్మాన ప్రసాద్, సబితమ్మ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ములాయం కోడలుకు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రం 150 రోజులు, 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రావికంపాడు వద్ద ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు హజరయ్యారు. 

T.మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్!


కరీంనగర్‌: తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మండిపడ్డారు. సీఎంను చూస్తే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయని కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టి.మంత్రులు, కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం బూట్లు మోయడానికే పనికొస్తారు అని కేసీఆర్‌ అన్నారు. 

తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమంటే నోరు మెదమని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మలు చవటలు అని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ పూడికతో నిండిపోతుంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు అని అన్నారు. తెలంగాణ వస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు. 24గంటలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని కేసీఆర్‌ హమీ ఇచ్చారు.

సోషల్ నెట్ వర్క్ - వ్యాఖ్యలపై తీర్పు

ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారిని ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల అనుమతితో మాత్రమే అరెస్ట్‌ చేయాలని సుప్రింకోర్టు అబిప్రాయపడింది. అభిప్రాయాలపై ముందే అరెస్ట్ లు వద్దని, విచారణ అనంతరమే వారిని అరెస్ట్ చేయాలని సూచించింది.అది కూడా ఉన్నత స్థాయి అదికారుల పర్యవేక్షణలోనే జరగాలని సుప్రింకోర్టు చెప్పడం విశేషం. మన రాష్ట్రానికి చెందిన జయ వింద్యాల కేసులో సుప్రింకోర్టు ఈ గైడ్ లైన్స్ జారీ చేసింది.ఏది ఏమైనా సోషల్ నెట్ వర్క్ లలో అభ్యంతరకర, అసబ్యకర భాష వాడకుండా, దేశద్రోహ, ఉగ్గరవాద, తీవ్రవాద అనుకూల వ్యాఖ్యలు చేయకుండా ఉంటే దేశానికిర సమాజానికి మంచిదని చెప్పక తప్పదు.పౌరహక్కుల విషయంలో స్వేచ్చ కలిగిన భారత్ లో ఆ స్వేచ్చ దుర్వినియోగం కాకుండా ఉండడం అవసరం.అలాగే ఎవరు పడితే వారు అరెస్టు చేయకుండా ఉండాలన్న సుప్రిం తీర్పు కూడా స్వాగతించదగిందే.

'షర్మిల యాత్రతో కార్యకర్తల్లో నూతనోత్సహం'

తిరుపతి: షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్‌-టీడీపీ పార్టీలు బెంబేలెత్తుతున్నాయని శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్ర వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తల్లో నూతనోత్సహం నింపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నిరాహార దీక్ష చేపడతా: కొండా సురేఖ

వరంగల్: భూపాలపల్లి కేటీపీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్‌ సీపీ నేత కొండా సురేఖ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్న కార్మికులను పరామర్శించి కొండా సురేఖ, మురళి దంపతులు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబుకు ఆస్కార్ ఇవ్వాలి: తులసిరెడ్డి

హైదరాబాద్: తృతీయ ఫ్రంట్‌లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు అనడం పెద్ద జోక్ అని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు హయాం అంతా కుంభకోణాలమయమేనని, తనపై ఉన్న అవినీతి కేసుల్లో బెయిల్‌ తెచ్చుకున్న బాబుకు నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినీతిపై చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.