Thursday, 30 May 2013

ప్రార్ధనల కోసం జెరుసలెమ్ కు జోగి రమేష్

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ జెరుసలెమ్ వెళుతున్నారు.ఆయన ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ను ఉల్లంఘించి మరీ జగన్ కు మద్దతు ప్రకటించారు.ఇప్పుడు ఆయన జెరుసలెమ్ కు వెళుతున్న కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ ను బెయిల్ రావాలని,వై.ఎస్.కుటుంబానికి మేలు జరగాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయడానికి తాను జెరుసలెమ్ వెళుతున్నట్లు ఆయన చెబుతున్నారు.గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఒకసారి...

కేసీఆర్‌పై కేసు నమోదుకు ఖమ్మం కోర్టు ఆదేశం

ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై కేసు నమోదు చేసి జూన్ 28న కోర్టుకు దర్యాప్తు నివేదిక పంపాలని ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ గురువారం ఖమ్మం పోలీసులను ఆదేశించారు. ఈ ఫిర్యాదును ఖమ్మం న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి రామారావు కోర్టులో దాఖలు చేశారు. కేసు వివరాలివీ... 2013 జనవరి 28న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద జరిగిన సమరదీక్షను ఉద్దేశించి కేసీఆర్...

చంద్రబాబువన్నీ అసత్యాలే:జైళ్లశాఖ డీజీ

హైదరాబాద్: జైళ్లలో ఖైదీలు మద్యం సేవిస్తున్నారంటూ, నీలి చిత్రాలు చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు స్పష్టం చేశారు. చంద్రబాబువి పూర్తి నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. జైళ్ల గురించి అవగాహనా రాహిత్యంగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని...

వరంగల్ ఎమ్.పి దారెటు

వరంగల్ కాంగ్రెస్ ఎమ్.పి సిరిసిల్ల రాజయ్య దారి ఎటు అన్నది చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన కూడా చేరవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తుండగా,భారతీయ జనతా పార్టీ కూడా ఆయనపై కన్నేసింది.తమ పార్టీలో చేరవలసిందిగా ఆ పార్టీ నాయకత్వం కోరగా చూద్దాం అని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ స్థానాన్ని కడియం శ్రీహరికి ఇవ్వవలసి ఉన్నందున మానకొండూరు అసెంబ్లీని రాజయ్యకు టిఆర్ఎస్ ఆఫర్ చేసిందని అంటున్నారు.దానికి రాజయ్య అసంతృప్తి చెందారు.ఈ నేపధ్యంలో రాజయ్య బిజెపి ఆఫర్ ను స్వీకరిస్తారా?టిఆర్ఎస్ లోకి వెళతారా?కాంగ్రెస్ లోనే ఉంటారా అన్నది...

కాంగ్రెస్ టి.ఇవ్వదూ..కాని ఎలా వస్తుంది!

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత కె.కేశవరావు,ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ప్రకటించారు.అందువల్లనే తాము కాంగ్రెస్ ను వీడుతున్నామని చెప్పారు.ఇంతవరకు బాగానే ఉంది.తాము ఉద్యమానికి ప్రతిరూపంగా ఉన్న టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.అయితే ఇంతవరకు ఒకేగాని, కొందరు ఇతర పక్షాల నేతలు అడుగుతున్నట్లుగా టిఆర్ఎస్ లో చేరితే తెలంగాణ ఎలా వస్తుందన్నదానికి కేశవరావు వంటి నేతలు సమాధానం సమర్ధంగా...

రాజ్యసభకు ఐదోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నిక

గువాహటి: ప్రధాని మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో ఆయనకు 49 తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. అస్సాం నుంచి పోటీ చేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి శాంటియస్ కుజుర్‌కు 45 ఓట్లు లభించాయి. ఆలిండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) తరఫున పోటీచేసిన అమీనుల్ ఇస్లాంకు 18 ఓట్లు మాత్రమే దక్కడంతో ఓడిపోయారు. ఫలితాల వివరాలను అస్సాం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి జి.పి.దాస్...

నాకు వేరే మార్గం లేదు: జానారెడ్డి

హైదరాబాద్: ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌తో పాటు సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌ను వీడి వెళ్లటం కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. ఎంత ప్రభావం ఉంటుందనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందని, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. జానారెడ్డి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ వీడి వెళ్తున్న ఎంపీలతో పాటు మిగతా వారిని కూడా పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. తనకు వేరే మార్గం లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటానని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతానని పేర్కొన్నారు....

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ బదిలీ

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జూన్ ఏడో తేదీన తిరిగి తన సొంత క్యాడర్ అయిన మహారాష్ట్ర సర్వీస్ కు వెళ్లిపోతున్నారు.ఆయన ముంబై క్రైం బ్రాంచ్ అధినేతగా నియమితులైనట్లు సమాచారం.గాలి జనార్ధనరెడ్డి కేసులో సంచలన అధికారిగా నమోదైన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జగన్ కేసులో కొంత వివాదాస్పదుడయ్యారు.ఈ కేసు రాజకీయ కేసుగా మారిపోవడంతో కొన్ని పొగడ్తలు,కొన్ని విమర్శలు స్వీకరించవలసి వచ్చింద...

మర్రి జనార్ధనరెడ్డి దారి టిఆర్ఎస్సే!

నాగర్ కర్నూల్ నుంచి కిందటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జెసి బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధనరెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నారు.ఆయన బిజెపిలో చేరతారేమోనని ప్రచారం జరిగింది. కాని కేశవరావు, మందా జగన్నాధం,వివేక్ తదితరులతో పాటు ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.కాగా తాము ఎలాంటి పదవులు ఆశించడం లేదని కేశవరావు చెప్పారు.అయితే ఆయన కుమారుడు విప్లవ్ కుమార్,మందా జగన్నాధం కుమారుడు శ్రీనాధ్ కూడా కేశవరావు ఇంటివద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.కాగా...