Friday, 17 May 2013

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ దే పైచేయి


ఢిల్లీ లో అధిష్టానం పెద్దల వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే పైచేయి అయినట్లు కనిపిస్తుంది.జగన్ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులపై చర్య తీసుకోవాలా?వద్దా అన్నదానిపై అదిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ముఖ్యమంత్రి కిరణ్ ఈ మంత్రుల తరపున గట్టిగా వాదించారని చెబుతున్నారు.దానితో ఆ విషయంపై నిర్ణయాన్ని ఆయనకే వదలిపెట్టినట్లు కధనాలు వస్తున్నాయి.దర్మాన, సబిత తదితరులపై కేవలం ఆరోపణలే వచ్చాయని, అవి నిర్దారణ కాకుండా చర్య తీసుకోరాదన్నది ముఖ్యమంత్రి అబిమతంగా ఉంది. వారి రాజీనామాలను కూడా ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఇప్పుడు వారిని తొలగిస్తే ముఖ్యమంత్రి వైఖరి తప్పని తేలుతుంది.ఈ నేపధ్యంలో అదిష్టానం వద్ద తన వాదన వినిపించడం సఫలీకృతులైనట్లుగా ఉంది.

మోసం చేయడానికే కెసిఆర్ కంకణం


తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావుపై మళ్లీ విమర్శలు కురిపించడానికి కాంగ్రెస్ నేతలు సన్నద్దమవుతున్నట్లుంది.గతంలో తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ నేతలు కెసిఆర్ పై విమర్శలు చేయడానికి వెనుకాడుతుంటారు.కాని ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు సంతోష్ కుమార్ కెసిఆర్ విమర్శల వర్షం కురిపించారు. కోటీశ్వరులకు టికెట్లు అమ్ముకుని, తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తే నిర్బంధ ఉచిత విద్య అని కేసీఆర్ అంటున్నారని, టిఆర్ఎస్ లో చేరినవారి విద్యాసంస్థల కళాశాలల్లో ఎంతమందికి ఉచిత విద్య అందిస్తున్నారని సంతోష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కెసిఆర్ కంకణం కట్టుకున్నారన్నారు.టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఎలక్షన్, కలెక్షన్ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

బొత్స సత్యనారాయణను మార్చనట్లేనా!

పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను మార్చనట్లేనా! పిసిసి కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.తొమ్మిది మంది ప్రధానకార్యదర్శులు, ఐదుగురు ఉపాధ్యక్షులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి బొత్సకు అనుమతి ఇచ్చారని అంటున్నారు. ఒక వైపు మంత్రుల వ్యవహారంలో అధిష్టానం సీరియస్ గానే ఉన్నా ముఖ్యమంత్రి వారిని తొలగించడానికి సిద్దంగా లేరన్నది ఒక కదనం, బొత్సను మార్చుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా అదేమీ లేదని ఇప్పటికైతే అర్ధం అవుతుంది.

YSషర్మిల పాదయాత్రకు కువైట్ వాసుల సంఘీభావం

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకున్న సందర్భంగా కువైట్‌లోని పార్టీ అభిమానులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కువైట్‌లోని హవల్లీ ప్రాంతం వద్దకు వారు శుక్రవారం పెద్ద సంఖ్యలో చేరుకొని హర్షం వ్యక్తం చేశారు. మండుటెండలో కూడా షర్మిల తన పాదయాత్ర కొనసాగిస్తూ... రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటడం ద్వారా ప్రపంచ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేకనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐని అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పి.రెహమాన్, పి.వాసుదేవరెడ్డి, గోవింద్ నాగరాజు, షేక్ ఇనాయత్, జీఎం బాబు రాయుడు, సత్తార్‌ఖాన్, రమణయాదవ్‌లతో పాటు పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. 

ముందస్తు ఎన్నికలురావచ్చు

పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు రావచ్చని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు.పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. చత్తీస్ గడ్,మద్యప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. జగన్ కూడా ఇదే అబిప్రాయంతో ఉన్నారని, దీనిని పార్టీలోని ప్రతి ఒక్కరు గమనించి ప్రజలలో ఉంటూ సిద్దంకావాలని ఆమె అన్నారు.ముందస్తు ఎన్నికలు బహుశా నవంబరులో ఉండవచ్చని అన్నారు. కాగా జగన్ ను జైలులో ఉంచి ఏడాది అవుతున్నదని, దీనిపై కూడా మనం ప్రజలలోకి వెళ్లాలని ఆమె అన్నారు.

టిడిపి తెలంగాణ లేఖలో సారం లేదా!

రాజకీయ నేతల అభిప్రాయాలు ఎలా మారిపోతాయో చెప్పడానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రకటన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశానికి టిడిపి తరపున తీసుకువెళ్లిన లేఖలో ఎలాంటి సారం లేదని కడియం అన్నారు. గతంలో తెలంగాణకు సంబందించిన లేఖ గురించి మాత్రమే ప్రస్తావన ఉందని అన్నారు.తానే ఆ లేఖ ఆధారంగా గట్టిగా మాట్లాడానని అన్నారు. తెలంగాణపై ప్రకటన వచ్చినప్పుడు తెలంగాణ నేతలను ఒక గదిలో , సీమాంధ్ర నేతలను మరో గది లో ఉంచి చంద్రబాబు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు.విశేషం ఏమిటంటే కడియం శ్రీహరి అఖిలపక్ష సమావేశం రోజున టిడిపి వాదనను, ఆ లేఖలోని ప్రతి అంశాన్ని పట్టి,పట్టి చదివి వినిపించి గట్టిగా వినిపించి తెలంగాణకు టిడిపి అనుకూలం అని చెప్పారు. ఇప్పుడేమో ఆయనే ఆ లేఖలో ఎలాంటి సారం లేదంటున్నారు.ఒపినీయన్స్ మార్చుకోకపోతే రాజకీయ నాయకులు కారని నానుడి ఊరికే రాలేదు కదా!

అన్ని కులాలకు ప్రాధాన్యత : YS విజయమ్మ


హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామస్థాయి నాయకత్వం బలంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామస్థాయిలో మంచి నాయకులను ఎంపిక చేసుకోవాలని జగన్ చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో పార్టీకి ఉన్న బలాన్ని చీల్చాలని కొందరు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు.ఈ ఎన్నికల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై మనం సైనికుల్లా పనిచేయాలని చెప్పారు. ప్రజలకు పార్టీ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇద్దామని చెప్పారు. ఒక్క రోజు కూడా వృథా కాకుండా నాయకులు ప్రజల్లోనే ఉండాలన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. గ్రామాలలో మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచన చేశారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తూ, అందరిని కలుపుకుకోవాలని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ప్రజలలోకి వెళ్లవలసిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం మైనార్టీలో ఉందని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహకారంతో నడుస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అండతో కిరణ్ ప్రభుత్వం ఎటువంటి భయంలేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. వైఎస్ఆర్ సిపి ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికలలో కూడా కలిసి నడుస్తున్నాయన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన వ్వ్యూహంపై జరిగిన ఈ సమావేశానికి దాదాపు 150 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఎలక్షన్,కలెక్షన్ పద్ధతిలో కెసిఆర్:ఎమ్మెల్సీ సంతోష్

కరీంనగర్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఎలక్షన్, కలెక్షన్ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్ ఆరోపించారు. కోటీశ్వరులకు టికెట్లు అమ్ముకుని, తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే నిర్బంధ ఉచిత విద్య అని కేసీఆర్ అంటున్నారని, టిఆర్ఎస్ లో చేరినవారి విద్యాసంస్థల కళాశాలల్లో ఎంతమందికి ఉచిత విద్య అందిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కెసిఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. 

అందరితో కలిసి ఐక్యంగా పనిచేయాలి: YS విజయమ్మ

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిలుపు ఇచ్చారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన వ్వ్యూహాలపై చర్చించారు. దాదాపు 150 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ గ్రామాలలో మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచన చేశారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తూ, అందరిని కలుపుకుకోవాలని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ప్రజలలోకి వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. 

ప్రభుత్వం మైనార్టీలో ఉందని, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహకారంతో నడుస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి అండతో కిరణ్ ప్రభుత్వం ఎటువంటి భయంలేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని చెప్పారు. వైఎస్ఆర్ సిపి ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికలలో కూడా కలిసి నడుస్తున్నాయన్నారు.