సైకిలు దిగి కారెక్కుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఏళ్ల తరబడి పచ్చ జెండా మోసిన నేతలు గులాజీ కండువా కపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తమ ప్రాంతంపై రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్న పచ్చ పార్టీ అధినేత తీరుతో విసిగిపోయిన నేతలు గలాబీ దళంలో చేరేందుకు వరుస కడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా సంక్లిష్ట సమస్యపై స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన టీడీపీ అధ్యక్షుడి దాటవేత ధోరణి తమ భవిష్యత్ రాజకీయ జీవితానికి ముప్పుగా మారే అవకాశముందన్న ఆందోళనతో తెలంగాణ నేతలు...