Sunday, 2 June 2013

YSజగన్ నిర్బంధం రాజకీయ కుట్రే

నెల్లూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్బంధం ముమ్మాటికీ రాజకీయకుట్రేనని న్యాయవాదులు, మేధావులు,
సామాజికవేత్తలు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మ క్కై సీబీఐని అడ్డుపెట్టుకుని ఆయన్ను జైలులో పెట్టించాయని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్ట ని హెచ్చరించారు. ఈ పరిణామాలతో న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారని, దీనిని కోర్టులు సైతం గమనిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. నెల్లూరులోని హరిత హోటల్‌లో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చైతన్యపథం కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయ విశ్రాంత ఉద్యోగి రామ్మూర్తి మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని, ఆయనపై గాని, విజయసాయిరెడ్డిపైగాని ఎలాంటి కేసు లేదన్నారు. క్విడ్ ప్రోకో అంటే పరస్పర సహకారమని, జగన్‌కు ఈజీఓలు, లావాదేవీ లతో ఏ సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటే సెప్టెంబర్ 5న జగన్‌కు బెయిల్ ఇవ్వాలన్నారు. ఒక్క కాంగ్రెస్‌కేగాక ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీతో కూడా సీబీఐ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నుంచి బయటకు రానీకుండా కుట్రలు పన్నుతున్నాయని కొమరిక గ్రామానికి చెందిన రైతు గూడూరు ప్రభాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ అనేది ఓ నైతిక హక్కు అని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. 

జగన్ కేసులో అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవని న్యాయవాది సత్యనారాయణ అన్నారు. మాయావతి, ములాయంసింగ్‌లపై అనేక కేసులు ఉన్నాయి, కాంగ్రెస్ నేతలు పలు కుంభకోణాల్లో కీలకంగా ఉన్నారు. వీరివిషయంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని డాక్డర్ ఏవీఎస్‌రెడ్డి విమర్శిం చారు. ప్రజలగుండెల్లో ఉన్న వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలకు గురిచేయడం దారుణమని, కక్షసాధింపు చర్యేనని రాధికారెడ్డి విమర్శించా రు.దోషా, నిర్దోషా అనేది తేల్చకుండా ఏడాదిగా జైలులో బంధించి, వేధిం చడం దారుణమని సాహితీవేత్త మెట్టు రామచంద్రప్రసాద్ విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లోపెట్టి వేధించడం రాజకీయ కుట్రఅని అందరికీ అర్థం అవుతోందని న్యాయవాది గోవిందరాజుల సుభద్రాదేవి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవ హరించారు.

ఇక వీరు టిఆర్ఎస్ నాయకులు

ఇంతకాలంగా కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సీనియర్ నేతలు కేశవరావు,మందా జగన్నాధం, వివేక్ లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయ్యారు.నిజాం కాలేజీ మైదానంలో జరిగిన ఒక సభలో వారికి టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు.ఈ ముగ్గురుతో పాటు మాజీ మంత్రి వినోద్,టిడిపి నేతలు మాణిక్ రెడ్డి,మర్రి జనార్ధనరెడ్డిలు కూడా టిఆర్ఎస్ లే చేరారు. ఎమ్.పి విజయశాంతి, హరీష్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇంత అవమానమా!డి.ఎల్. ఆగ్రహం

సీనియర్ నేత డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి తనను బర్తరఫ్ చేసిన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను సోనియాగాంధీకి ఎప్పుడో రాజీనామా లేఖ పంపితే,దానిని పట్టించుకోకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేయడానికి అనుమతి ఇవ్విడం ఏమిటన్నది ఆయన ఆవేదనగా ఉంది.తన రాజీనామాను ఆమోదించి ఉంటే బాగుండేదని ఆయన తనతో మాట్లాడిన మీడియాతో అన్నారు.తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఆయన వాపోతున్నారు. కిరణ్ వ్యవహార శైలి వల్ల పార్టీ నష్టపోతున్నదని చెబుతున్నానని, అయినా తనపట్ల ఇలా అధిష్టానం వ్యవహరిస్తుందనుకోలేదని ఆయన వాపోతున్నట్లు చెబుతున్నారు.దీనిపై ఏమి చేయాలన్నదానిపై మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. కాగా జగన్ కేసుల చాలా తీవ్రంగా వ్యవహరించిన డాక్టర్ పి.శంకరరావు, అలాగే ఎమ్.ఆర్.కేసులో తీవ్రంగా మాట్లాడిన డి.ఎల్.రవీంద్ర రెడ్డి ఇద్దరూ పదవులు పోగొట్టుకోవడం, అది కూడా అవమానకరమైన రీతిలో ఇంటిబాట పట్టడం విశేషం.అయితే డి.ఎల్.తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుందా అన్నది ప్రస్తుతానికి సందేహమే.అయితే గతంలో ఆయన వేరే పార్టీలోకి వెళ్లవచ్చని ప్రచారం జరిగింది కాని దానిని ఆయన ఖండించారు.

లోకేష్ కోసం జూనియర్ కు వెన్నుపోటు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటు పొడిచారని,ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్.టి.ఆర్.కు వెన్ను పోటు పొడుస్తున్నారని టిఆర్ఎస్ నేత, కెసిఆర్ కుమారుడు అయిన తారకరామారావు వ్యాఖ్యానించారు.తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెబుతున్న చంద్రబాబునాయుడు వచ్చిన తెలంగాణకు పీక నొక్కడానికి బీజం వేసిందే ఆయనని కెటిఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రోమ్ నగరం తగలబడుతుంటే పిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.కిరణ్ కుమార్ రెడ్డి ప్రజామోదం లేని సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు.విశేషం ఏమిటంటే ఎన్.టి.ఆర్.కు వెన్నుపోటు పొడిచాడని చంద్రబాబుపై కెటిఆర్ ఆరోపణ చేస్తున్నారని, అప్పట్లి తిరుగుబాటు లేదా వెన్నుపోటులో కెసిఆర్ కు కూడా పాత్ర ఉన్న సంగతిని ఈయన మర్చిపోతున్నారా?

వివేక్ కు టిఆర్ ఎస్ సూట్ అయ్యేనా!

పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్.పి వివేక్ అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావుకు అప్పుడే సలహా ఇస్తున్నారు.కెసిఆర్,కెకెల ద్వారానే తెలంగాణ రాదని, అందరిని కలుపుకుపోవాలని వివేక్ సూచిస్తున్నారు.ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరేవారికి సీట్లిస్తే తప్పేంటని,తెలంగాణ కోసం అందరినీ కలుపుకోవాలని కేసీఆర్‌కు కూడా సూచిస్తానని వివేక్ అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై విమర్శలు చేయిస్తున్నారని, తన వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నారని కూడా వివేక్ ఆరోపించారు.వివేక్ కాంగ్రెస్ లో మాదిరిగా ఇక్కడ కూడా ఏమైనా హడావుడి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడతారేమో. ఎంత అయినా ఇది ఉప ప్రాంతీయ పార్టీ కదా!