Monday, 3 June 2013

YS షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు మంగళవారం 13 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొవ్వూరు పట్టణానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. సాయంత్రం కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. పర్యటించే ప్రాంతాలు : కొవ్వూరు పట్టణంలోని మెరక వీధి, బస్టాండ్ సెంటర్, విజయ విహార్ సెంటర్,...

మీ పార్టీ పూర్తి పేరు మీకు తెలుసా బొత్సా?

రాష్ట్రంలో 2004 నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలు అక్షరాలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డివేనని, అవెంత మాత్రం కాంగ్రెస్ పార్టీవి కానే కావని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వైఎస్‌వి కావని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భూమన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొదలు ఫీజుల చెల్లింపు పథకం వరకూ కాంగ్రెస్ పథకాలే అయితే 2004 ఎన్నికల సందర్భంగా కాని, 2009లోగాని జాతీయ స్థాయిలో ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టో(ప్రణాళిక)లో...

టి.ని వ్యతిరేకించి పార్టీలతో కలవబోమంటే..

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాద్ సింగ్ చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి బిజెపిలో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ను వ్యతిరేకించే పార్టీలతో కలవబోమని ఆయన అన్నారు. అంటే రాష్ట్రంలో పార్టీలా?లేక జాతీయ స్థాయిలోని పార్టీలతోనే అన్నది స్పష్టత లేదు.రాష్ట్రంలో బిజెపితో కలవడానికి ఏ పార్టీ సిద్దంగా లేదు. తెలంగాణ సాధన కోసమే పుట్టిన టిఆర్ఎస్ కూడా బిజెపిని అంటరాని పార్టీగానే ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో...

జగ్గారెడ్డి ఆ విషయం ఒప్పుకున్నట్లే కదా!

మొత్తం మీద విప్ జగ్గారెడ్డి ఒక మాట ఒప్పుకున్నారు.కెసిఆర్ పై విమర్శలు చేస్తూనే ప్రజలు ఆయన మాటలను నమ్ముతున్నారన్న అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పారు.కెసిఆర్ మాయ మాటలు చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు.అందులో ఆయన సఫలం అవుతున్నారని కూడా జగ్గారెడ్డి అనడం విశేషం. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకుంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)విమర్శించారు. అందులో అతను...

నిజాయితీపరులు టిడిపిలో ఎలా ఉంటారు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చిరంజీవి బహిరంగంగా అమ్ముడుపోతే, చంద్రబాబు తెరవెనుక అమ్ముడుపోయారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే...ఆ పార్టీ నుంచి నీతిపరులైనవారు వలసబాట పడుతున్నారని ఆమె సూత్రీకరించారు. చంద్రబాబు తన హయాంలో రుణమాఫీ ఎందుకు చేయలేదని షర్మిల అడుగుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ, అవిశ్వాస సమయంలోనూ కాంగ్రెస్‌తో బాబు జతకట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు తీరుతో నిజాయతీపరులైన...

కెసిఆర్ కు కొత్త చికాకు!

రాజకీయాలలో కావాలని జరగకపోయినా, అది ఒక్కోసారి ఇబ్బంది సృష్టిస్తుంది.తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్తగా చేరిన కాంగ్రెస్ ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లకు నిజాం కాలేజీ మైదానంలో జరిగిన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. వర్షం తదితర కారణాలు ఎలా ఉన్నా వారిద్దిరికి కొద్ది సేపైనా అవకాశం ఇచ్చి ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండేది కాదు. అప్పుడు కారణం ఏమైనా వారు మాట్లాడకపోవడంతో ప్రత్యర్ధి పార్టీలు ఆ పాయింటు మీద కెసిఆర్ పై విమర్శలకు దిగుతున్నాయి.దళితుడిని...