Friday, 24 May 2013

చంద్రబాబుకు కేసీఆర్ సవాల్


బాన్సువాడ: తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తీర్మానం చేయాలని చంద్రబాబు నాయుడికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణపై టీడీపీది నాటకమేనని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నందుకే చంద్రబాబు పాదయాత్ర చేశారని అన్నారు. ఓట్ల కోసం వచ్చే గుంటనక్క వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు సకలజనుల సమ్మె చేసినా కేంద్ర సర్కారు స్పందించలేదని వాపోయారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ టీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు.

'బ్రహ్మణి'ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు


జమ్మలమడుగు: బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, రాచమళ్ల ప్రసాద్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బీసీ గోవిందరెడ్డి, బద్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మునయ్య, బ్రహ్మానందరెడ్డి, అప్జల్‌ఖాన్‌ సందర్శించారు. 

ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను తీసుకుని నిర్మాణం చేపడితే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించినట్లు అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల పర్యటన స్థానికుల్లో ఆశలు రేపుతోంది. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నారు.

'బ్రహ్మణి'ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు


జమ్మలమడుగు: బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు, రాచమళ్ల ప్రసాద్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బీసీ గోవిందరెడ్డి, బద్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మునయ్య, బ్రహ్మానందరెడ్డి, అప్జల్‌ఖాన్‌ సందర్శించారు. 

ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను తీసుకుని నిర్మాణం చేపడితే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పించినట్లు అవుతుందని భావిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల పర్యటన స్థానికుల్లో ఆశలు రేపుతోంది. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నారు.

'టీఆర్ఎస్ లో చేరేందుకు ఎర్రబెల్లి యత్నం'


వరంగల్: టీఆర్ఎస్ లోకి రావడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ మాజీ పొలిట్ బ్యురో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. ఓ ఫౌల్ట్రీ యజమాని ద్వారా, ఓ పెద్ద బిల్డర్ ద్వారా ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకంటే ముందు నుంచే టీఆర్ఎస్ లో చేరేందుకు వారు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 

చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఎర్రబెల్లి, రేవూరికి కడియం హితవు పలికారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ నేతలు దమ్ముంటే మహానాడులో చంద్రబాబుతో ఒక్కసారి జై తెలంగాణ అనిపించగలరా అని సవాల్ విసిరారు. 

Thursday, 23 May 2013

కొత్త కార్పోరేషన్ల పై ఊహాగానాలు

కొత్త కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ గా శ్రీకాకుళం నకు చెందిన సీనియర్ నేత త్రిపురాన వెంకటరత్నం , ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నిజామాబాద్ కి చెందిన గంగాధర్ పేరు వినిపిస్తున్నాయి . ఇవే నిజమైతే పార్టీలో మాజీ పీసీసీ ఛీప్ డీ.ఎస్ కు పలుకుబడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగాధర్ డీ.ఎస్ కు అనుచరుడుగా ఉండంటం, అలాగే త్రిపురాన కూడా డీ.ఎస్ సిఫార్సు చేసినవారు కావడం విశేషం. దీంతో డీ.ఎస్ కు మళ్ళీ గిరాకీ పెరిగిందని చెప్పక తప్పదు. 

టీడీపీ లోకి మాజీ మంత్రి డీకే సమరసిం హా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి డీకే సమరసిం హా రెడ్డి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసారు. గత కొంతకాలం గా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్నారు. మహబూబ్ నగర్ లో గతం లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిద్యం వహించారు . డీకే చేరిక తో టీడీపీ కి మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ పొటీ చేస్తారన్నది ఇంకా తెలియనప్పటికీ సీనియర్ గ డీకే సేవలు పార్టీ కి ఉపయోగపడతాయని మహబూబ్ నగర్ నేతలు చెప్తున్నారు. అయితే డీకే కు గతం లో ఎవరితోనూ పడని చరిత్ర వుంది. ఇక కాంగ్రెస్ నుంచి బీజేపి, టీఅరెస్ లోకి మారిన డీకే ఇప్పుడు టీడీపీ నిలదొక్కుకోగలరా అనేది ప్రశ్నార్ధకమేనని రాజకీయ విశ్లేషకుల వ్యాక్యానిస్తున్నారు .

YS జగన్‌ను టార్గెట్‌ చేస్తే కాంగ్రెస్‌కే నష్టం: శంకర్రావు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని మీడియా సర్వేలే చెబుతున్నాయని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ మధ్య విభేదాలతో పార్టీ కేడర్ డీలా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను నమ్ముకుని పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు, స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని సూచించారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులను తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ను అదేపనిగా టార్గెట్‌ చేయడం కాంగ్రెస్‌కే నష్టమని శంకర్రావు అన్నారు. 

చంద్రబాబుకు గద్దె పవర్ ఫుల్ డైలాగ్


ఒకపక్కన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంస్కరణల గురించి నల్లధనం గురించి మాట్లాడుతుంటే, ఆయన పార్టీకి చెందిన మాజీ ఎమ్.పి గద్దె రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి.చంద్రబాబు నాయుడు డబ్బున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని గద్దె వ్యక్తం చేయడం విశేషం.పైగా గద్దె పవర్ ఫుల్ డైలాగులు వాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. రాజకీయాల్లో డబ్బు ప్రధానమని, అయితే డబ్బే రాజకీయం కాదని ఆయన ఘాటుగా మాట్లాడారు. టీడీపీ తరఫున ఎంపీ సీటు ఇస్తే తాను డబ్బు ఖర్చు పెడతానని రామ్మోహన్ ప్రకటించారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు డబ్బు ఖర్చుపెడితే.. ఎప్పటినుంచో పార్టీలో ఉండి డబ్బు ఖర్చుపెడుతున్నవారి పరిస్థితి ఏంటని గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు.ఎంపీ సీటు తన డిమాండ్ అని... అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటానని గద్దె తెలిపారు.కేశినేని ట్రావెల్స్ సంస్థ అధినేత కేశినేని నాని కి విజయవాడ టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారన్న సమాచారం గద్దెకు జీర్ణం కావడం లేదు.దాంతో ఆయన తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టారు.

జూన్ 3న బీజేపీలో చేరుతా: నాగం జనార్ధన్ రెడ్డి

వరంగల్‌: వచ్చేనెల 3 తేదిన బీజేపీలో చేరుతానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేస్తానని ఓ ప్రశ్నకు నాగం సమాధానమిచ్చారు. మహబూబ్‌నగర్‌ లోకసభ స్థానం బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తానని నాగం తెలిపారు. 

YSజగన్ విడుదల కోసం ప్రత్యేక పూజలు!

ఆలూమూరు: జగన్‌ జైలు నుంచి విడుదల కావాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలుమూరు మండలం జొన్నాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ విడుదల కోసం జగ్గిరెడ్డి చేపట్టిన యాత్రకు మద్దతుగా వైఎస్ఆర్‌ సీపీ నాయకులు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, సీబీఐలు కుమ్మక్కై జగన్ ను జైల్లో పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు.