Wednesday, 8 May 2013

సుప్రింకోర్టు తీర్పు- చంద్రబాబు పై అనుమానం

సుప్రింకోర్టు తీర్పు నిష్పక్షపాతంగా లేదని, అదికారంలో లేని జగన్ ఎలా ప్రబావితం చేస్తారో సుప్రింకోర్టు చెప్పి ఉండవలసిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానాలపై గౌరవం ఉందని చెబుతూనే సుప్రింకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టారు. ఇదే సమయంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు డిల్లీలోనే ఉండి ఏమి చేశారని, జగన్ కు బెయిల్ రాకుండా చేయడంలో ఎలాంటి కృషి చేశారో తెలియాల్సి ఉందని మరో నేత జూపూడి ప్రభాకరరావు అన్నారు.సుప్రింకోర్టు తీర్పు ప్రభావితమైందని అంటున్నారా అని అడగ్గా అలా అనడం లేదని అంటూనే టిడిపి బృందం అంతా హోటల్ లో ఎందుకు కూర్చున్నారో చెప్పాలని అన్నారు.మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు కేసు ప్రభావితం చేయకుండా ,అదికారంలో లేని జగన్ ఎలా ప్రబావితం చేస్తారో సుప్రింకోర్టు చెప్పాలని శ్రీకాంత రెడ్డి ప్రవ్నించారు.కాగా కొణతాల రామకృష్ణ సిబిఐపై సుప్రింకోర్టు పంజరంలో చిలుక మాదిరి సిబిఐ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇలాంటి తీర్పు రావడం దురదృష్టకరమని కొణతాల రామకృష్ణ అన్నారు.

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆలోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్ కోసం పిటిషనర్ ట్రయిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బెయిల్ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం సుదీర్ఘ వాదనలు జరిగిన విషయం తెలిసిందే. 

విజయ సాయిరెడ్డి బెయిల్

న్యూఢిల్లీ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ న్యాయస్థానం నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 

కాసేపట్లో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావటంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా ఈరోజే తీర్పు వెలువడనుంది. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ వర్గీయులపై వేటు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ దంపతులకు అనుయాయులుగా ఉన్న నలుగురు జిల్లా నేతలపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీం.రాధ, మసూద్, మోమన్ రావు తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు కార్మిక, ఎస్.సి.సెల్, వాణిజ్య,మహిళ విబాగాలకు చెందిన నేతలుగా ఉన్నారు. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నట్లుగా అనుకోవాలి.

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్

ఖమ్మం : జిల్లాలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన గురువారమిక్కడ తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని అజయ్ కుమార్ తెలిపారు.

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు

వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరిస్తారు. జగన్‌తో పాటుగా ఇదే కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్, విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్లపైనా తీర్పు రానుంది. మూడు తీర్పులనూ వేర్వేరుగా ఇవ్వనున్నారు.

YS జగన్ బెయిల్ కోసం సర్వమత ప్రార్ధనలు

మహేశ్వరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత దీపాభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్వమత ప్రార్థన కార్యక్రమంలో భారీ ఎత్తున్న అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

సీఎం కిరణ్ కు మరో షాక్!

వరంగల్‌: రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో సీఎం కిరణ్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. వరంగల్ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ తీర్పు ప్రకారమే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.