Thursday 16 May 2013

నేడు టెన్త్ ఫలితాలు


5/17/2013 1:12:00 AM
- 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి పార్థసారథి
- ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల్లో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, జీపీఏ లభ్యం
- ఫోన్, ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలను సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏపీ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల నుంచి తమ గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్ పాయింట్ల సగటు (జీపీఏ) పొందవచ్చని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్, మొబైల్ ద్వారా (ఐవీఆర్‌ఎస్) 1255225 నంబరుకు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించారు. అలాగే ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా పొందవచ్చని వివరించారు. ఎస్‌ఎస్‌సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్‌నంబర్ టైప్ చేసి 53345, 53346 నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు. 5888 నం బరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. www.sakshieducation.com వెబ్‌సైట్‌తోపాటు వివిధ ప్రైవేటు సైట్లలో ఫలితాలను పొందవచ్చు.

జిల్లా వెబ్‌సైట్లలోనూ..: జిల్లాల్లో డీఈఓల వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఫలితాలను మంత్రి విడుదల చేసిన వెంటనే వాటిని ఈ మెయిల్ ద్వారా డీఈఓలకు పంపించాలని ప్రభుత్వపరీక్షల విభాగం డెరైక్టర్‌ను పాఠశాల విద్యా డెరైక్టర్ ఉషారాణి ఆదేశించారు. ఫలితాల వివరాలను సంబంధిత స్కూళ్లకు ఈ మెయిల్ ద్వారా పంపించాలని, విద్యార్థులకు వెంటనే సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.

అన్ని పేపర్ల రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీ
ఈసారి అన్ని పేపర్లకు రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ అందజేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. గత ఏడాది ఐదు పేపర్లలో రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చిన విద్యాశాఖ ఈసారి చివరి పేపరుకు కూడా (సాంఘిక శాస్త్రం) అవకాశం కల్పిస్తోంది.

జీపీఏ లెక్కింపు ఇలా: విద్యార్థి సంబంధిత సబ్జెక్టులో సాధించే మార్కుల రేంజ్‌ను బట్టి ప్రతి సబ్జెక్టుకు ఎ1, ఎ2, బి1, బి2, సి1, సి2, డి 1, డి2, ఇ వరకు 9 గ్రేడ్లు ఉంటాయి. 

ఒక సబ్జెక్టులో ఎ1 గ్రేడ్ వస్తే 10 పాయింట్లు, ఎ2కు 9, బి1కు 8, బి2కు 7, సి1కు 6, సి2కు 5, డి1కు 4, డి2 గ్రేడ్‌కు 3 పాయింట్లు ఇస్తారు. మొత్తం సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్లను కలిపి, మొత్తం సబ్జెక్టుల సంఖ్యతో భాగిస్తారు. తద్వారా వచ్చే పాయింట్లను గ్రేడ్ పాయింట్ ఏవరేజ్‌గా (జీపీఏ) పేర్కొంటారు. ఉదాహర ణకు ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో (92-100 మార్కుల రేంజ్ ఆధారంగా) ఎ1 గ్రేడ్ వస్తే.. ప్రతి సబ్జెక్టుకు 10 పాయింట్ల చొప్పున ఆరు సబ్జెక్టులకు ఇచ్చే 60 పాయింట్లను ఆ సబ్జెక్టుల సంఖ్యతో భాగించి ఏవరేజ్ చేసి, జీపీఏని 10 పాయింట్లుగా నిర్ణయిస్తారు. 

0 comments:

Post a Comment