అధిష్టానానికి డెడ్‌లైన్లు విధించవద్దన్న సిఎం వ్యాఖ్యలపై కేసీఆర్ కుమారుడు ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకు పడ్డారు. ప్రజాదరణ లేని, ప్రజామోదం లేని సిఎంగా కిరణ్ ఉండటం తెలుగు ప్రజలు, తెలంగాణవాళ్లు చేసుకున్న పాపమని కేటీఆర్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంకెంతకాలం తీర్చకుండా ఉంటారని ప్రశ్నించారు. కావూరి అలకబూనితే వెంటనే రాజీకి వెళ్లిన సిఎం కిరణ్, తెలంగాణ ఎంపీలు డెడ్‌లైన్ పెట్టినా కనీసం స్పందన లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సిఎం అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలకు ఓ న్యాయం..ఆంధ్రా ఎంపీలకు ఓ న్యాయమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబును కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు..లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment