Tuesday, 18 June 2013

జగన్‌ది తప్పు ఎలా అవుతుంది?: భూమన

హైదరాబాద్: మంత్రులకు ఓ న్యాయం, వైఎస్ జగన్‌కు మరో న్యాయమా అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. మంత్రులు ఏతప్పు చేయలేదని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని, మంత్రులది తప్పుకాకుంటే వైఎస్ జగన్‌ది తప్పు ఎలా అవుతుందన్నారు. క్విడ్‌ప్రోకో జరగనపుడు వైఎస్ జగన్‌ నేరస్తుడు, కుట్రదారుడు ఎలా అవుతారని అడిగారు. ఒక్క రోజు కూడా ప్రభుత్వభాగస్వామిగా లేని వైఎస్ జగన్ నేరస్తుడు ఎలా అవుతారని నిలదీశారు.  చంద్రబాబుపై ఉన్న కుంభకోణాల సంగతి టీడీపీ నేతలు మరచిపోయారా...

Friday, 14 June 2013

జగన్ కోసం యువకుడి ఆత్మహత్య

మెదక్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీరారెడ్డి అనే యువకుడు జగన్ ను విడుదల చేయడంలేదన్న మనఃస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడ...

కలిసికట్టుగా పనిచేయాలి: ఎంపీ మేకపాటి

తిరుపతి : చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పని చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు-ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఇక నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశా...

అక్రమ అరెస్టులకు సిఎం బాధ్యుడు: శంకర్రావు

హైదరాబాద్: తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి, డిజిపి, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ సందర్భంగా ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలయినా సీఎంపై చర్యలకు హైకోర్టులో పిల్ వేస్తానని ఆయన హెచ్చరించార...

రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే: YS విజయమ్మ

తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నగారాను శుక్రవారం తిరుపతి నగరం నుంచి మోగించింది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను సమర్థంగా ఢీకొట్టేందుకు పార్టీ శ్రేణులకు గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ కర్తవ్యబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే మూలమని అన్నారు.  సదస్సుకు...

రేపు తెలంగాణ బంద్ కు కేసీఆర్ పిలుపు

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్ట్ లు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. ప్రభుత్వ దమన కాండను నిరసిస్తూ శనివారం బంద్ పాటించాలని కేసీఆర్ కోరారు.&nbs...

అక్రమ అరెస్ట్ లు వద్దు:హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్ మోషన్ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు సూచన చేసింది. అక్రమ అరెస్ట్లులు లేకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించింద...

తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు

హైదరాబాద్ : విద్యార్థుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్ కిషోర్ డిమాండ్ చేశారు. కాగా మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నార...

సోనియా గాంధీ తో ఆజాద్ భేటీ

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ముట్టడి అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అంతకు ముందు డిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గులాంనబీ ఆజాద్ ను కలిశారు. వారు కూడా అసెంబ్లీ ముట్టడి, రాష్ట్రంలో పరిస్థితులపైనే చర్చించినట్లు తెలిసింద...

మోడీ వివాదంతో జేడీయూలో చీలిక!

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ వివాంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్డీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెబుతోంటే, మరోవైపు నితీష్ కుమార్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బీహార్ లో శనివారం జరిగే ర్యాలీలో నితీష్ కుమార్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూ సస్పెన్స్ కొనసాగుతోంద...

కిరణ్ వేరేవారి కారులో ఎందుకు వెళ్లారు!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కారులో సచివాలయానికి వెళ్లడం చర్చనీయాంశం అయింది. చలో అసెంబ్లీ నేపధ్యంలో ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కిరణ్ రహస్యంగా వెళ్లిపోయారని కధనాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కాన్వాయ్ పూర్తి భద్రతతో ఉంటుంది కనుక అది పెద్ద ఇబ్బంది అవుతుందా అన్నది ప్రశ్న.ఏమైనప్పట్టికీ ఇలాంటి సమయాలలో వేరే నేత కారులో వెళ్లడం రకరకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంద...

ఉస్మానియాలో ఉద్రిక్త వాతావరణం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ఆర్ట్స్‌ కాలేజ్‌ నుంచి బయల్దేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్విన విద్యార్థులపై పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థి కృష్ణకు టియర్‌గ్యాస్‌ షెల్‌ తగలడంతో గాయపడ్డాడు. సొమ్మసిల్లిపోయిన విద్యార్థిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. దాంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నార...

ఎమ్.పి విజయశాంతికి దేవుడి ఆశిస్సులు ఉంటాయా?

తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ ఎమ్.పి విజయశాంతికి కొత్త దిగులు పట్టుకుంది. ఈసారి మెదక్ లోక్ సభ సీటు రాదన్న ప్రచారం ఆమెకు చికాకు కలిగిస్తోంది.టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు ఈసారి మెదక్ సీటు నుంచి పోటీచేయాలని భావిస్తుండడమే దీనికి కారణం.ఇప్పుడున్న పరిస్థితిలో మెదక్ నుంచి పోటీచేయడం బాగుంటుందని కెసిఆర్ అనుకుంటున్నారు.తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ అయిన సిద్దిపేట అందులో ఉండడం,పైగా తన ప్రభావంతో మెదక్ జిల్లాలో మరికొన్ని అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉండడం వంటి...

చంద్రబాబుది పిలవని పేరంటం

తెలుగుదేశం పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై అవిశ్వాసం పెడతామని అనడాన్ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎద్దేవ చేసింది.ఇది కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఆ పార్టీ ముఖ్య నేత డాక్టర్ మైసూరారెడ్డి అన్నారు. నామ్‌ కే వాస్తేగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఫెడరల్‌ లేదా మూడో ఫ్రంట్‌లో భాగస్వాములవుతామని, పిలవని పేరంటానికి చంద్రబాబు ఆరాట పడుతున్నారని మైసూరా వ్యంగ్యంగా అన్నారు. ఒకటి, రెండు సీట్లు కూడా రాని చంద్రబాబును...

కొండా మురళీ మళ్లీ లైన్ లోకి వచ్చేనట్లేనా!

గత కొంతకాలంగా అలకలో ఉన్నారని భావిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలలోఒకరైన కొండా మురళీ, ఆయన భార్య సురేఖలు మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సన్నద్దం అవుతున్నట్లు కనిపిస్తుంది. జగన్‌ను సీఎం చేసేంతవరకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని కొండా మురళీ పిలుపునిచ్చారు. చంద్రబాబు పాదయాత్రను ప్రజలు చీదరించుకుంటే, షర్మిల పాదయాత్రను ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత నీతిమాలిన రాజకీయాలు తన జీవితంలో ఎప్పుడూ...

నరేంద్ర మోడీ తపనకు 'తంథాన' పలికితే సమైక్య భారతానికి విషమ ఘడియలే!

ఏమీ తెలియనట్టు, ఇంతకుముందెలాంటి ఘోరకలికి తాను కారణం కాదని బుకాయించజూచే వాడికి నటించేవాడికి మనపెద్దలు "నంగనాచి తుంగబుర్ర'' అని ఎద్దేవా చేసేవారు! ఇప్పుడు అలాంటి పరిణామం "హిందుత్వ'' పేరిట మతరాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీ మూలంగా ఏర్పడింది. నిజానికి అది "హైందవం'' అనేది అసలైన సిసలైన లోకికభారతం, అదే "ఆది బౌద్ధం''. కులాతీత, మతాతీత వృత్తి సమాజాన్ని బౌద్ధధర్మం నిర్మించింది. దాన్ని చెడకొట్టి వృత్తులమీద, శ్రమజీవనంమీద ఆధారపడి బతికే వృత్తి సమాజాన్ని...

Tuesday, 11 June 2013

బిజెపిలో ముగిసిన సంక్షోభం

న్యూఢిల్లీ: బిజెపిలో సంక్షోభం ముగిసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. అద్వానీతో పార్టీ సీనియర్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం అద్వానీ నివాసంలోనే ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో బిజెపి పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అద్వానీ చెప్పిన అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అయితే విలేకరుల సమావేశానికి అద్వానీ హాజరుకాలేదు.&nbs...

మెట్టు దిగిన అద్వానీ?

ఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీని బుజ్జగించడంతో ఆ పార్టీ అగ్రనేతల రాయబారం ఫలించినట్లు కనిపిస్తోంది. అద్వానీ లేవనెత్తిన అంశాలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ హామీ ఇచ్చారు. ఈ సాయంత్రం రాజ్‌నాథ్‌సింగ్ అద్వానీని  కలవనున్నారు. ఆ తరువాత సంక్షోభం సమసినట్లు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నార...

నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: లక్ష్మీనారాయణ

హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రిలీవ్‌ అయ్యారు. డిఐజీ వెంకటేష్‌కు తన బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తుకు సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారాన్ని లీకు చేయలేదని అన్నారు. మీడియా నుంచే సమాచారాన్ని సేకరించానని చెప్పారు. దర్యాప్తులో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని లక్ష్మీనారాయణ తెలిపారు.&nbs...

శుక్లా మరణం పట్ల సోనియా సంతాపం

న్యూఢిల్లీ: తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో మే 25న మావోయిస్టులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన గుర్గావ్ లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచార...

విసి శుక్లా కన్నుమూత

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా (84)కన్నుమూశారు. ఛత్తీస్ గఢ్ లో మే 25న మావోయిస్టుల దాడిలో గాయపడిన ఆయన వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు.  మే 25న జరిగిన కాల్పుల్లో గాయపడిన శుక్లాను ముందు జగదల్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకు వచ్చారు. గత వారం ఆయన...

కేసీఆర్ పై హెచ్ఆర్సీలో రఘునందన్ ఫిర్యాదు

హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్ రావు మంగళవారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. టీఆర్ఎస్ కార్యకర్త నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్ లో హెచ్ ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు కోరారు. కాగా టీఆర్‌ఎస్ నిర్వహించిన సభ వేదికపైకి రానివ్వలేదని మనస్తాపం చెందిన నాగరాజు అనే టీఆర్ఎస్ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింద...

రెచ్చగొడితే టీఎస్ఆర్ కే నష్టం: దగ్గుబాటి వెంకటేశ్వర రావు

హైదరాబాద్: తనను రెచ్చగొడితే కాంగ్రెస్ పార్టీ రాజసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి (టీఎస్ ఆర్ )కే నష్టమని ఆ పార్టీ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి డి.పురంధరేశ్వరీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం హైదరాబాద్ లో స్పష్టం చేశారు. టీఎస్ ఆర్ పంపిన లీగల్ నోటీస్ కు లీగల్ గానే సమాధానమిస్తానన్నారు. అయితే తమ ఇద్దరి మధ్య విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదని వెంకటేశ్వరరావు తెలిపారు.  రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి తాను...

చంద్రబాబు లక్షణం ఇది అంటున్న దాడి

టిడిపి అదినేత చంద్రబాబునాయుడు మనస్తత్వం గురించి టిడిపి మాజీ నేత దాడి వీరభద్రరావు విశ్లేషించారు. చంద్రబాబు తన విశ్వసనీయత పెంచుకోవడం కన్నా, ఎదుటివారిపై ఆరోపణలను చేయడం ద్వారా వారిని దెబ్బతీసే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారని దాడి వ్యాఖ్యానించారు.దానివల్ల చంద్రబాబు తన విశ్వసనీయతను తానే చంపుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఆయన ఎంత సేపు ఎదుటవారిని ఎలా దెబ్బతీయాలనే చంద్రబాబు తరచూ ఆలోచిస్తుంటారని దాడి పేర్కొన్నారు.జైలులో కూడా జగన్ ను ఉండనివ్వరా అంటూ,జైల్లో...

బాబు, కిరణ్ ఒక్కటయ్యారు: ఈటెల రాజేంద్ర

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ ఒక్కటయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు.  తాము ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించినా పట్టువీడేది లేదని ఈటెల స్పష్టం చేశారు. సీఎం, డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ల వ్యవహార శైలి రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఆయన విమర్శించారు. ఛలో అసెంబ్లీ...

డి.ఎల్.కూడా టిడిపిని తప్పుపడుతున్నారా!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత.ఆ ప్రకారం కాంగ్రెస్ లో గొడవలు టిడిపికి కూడా తలనొప్పిగా చుట్టుకుంటున్నాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేసిన మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా ఇరుకున పెట్టాయి.శాసనసభ లాబీలో డిఎల్ రవీంద్ర రెడ్డి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో చేసిన సంభాషణలో ఈ పరిస్థితి కనిపించింది.గత అసెంబ్లీ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపి మద్దతు ఇచ్చి...

క్విడ్‌ ప్రోకో కేసులో జగన్‌ ప్రమేయం లేదు -శంకర్రావు

హైదరాబాద్ : క్విడ్‌ప్రోకో కేసులో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రమేయమేమీ లేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. 26 జీవోలను జారీ చేసిన మంత్రులందరినీ తప్పించాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలను తొలగించాలని శంకర్రావు కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రభుత్వంను ప్రజలే తొలగిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు.&nbs...

కారెక్కనున్న ఎర్రబెల్లి సోదరుడు!

వరంగల్‌: టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారెక్కనున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి ప్రదీప్ రావు చేరికపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశిస్తున్న ప్రదీప్ రావు నేడో, రేపో కేసీఆర్ ను కలవనున్నార...

దాసరికి బొగ్గు మసి

ప్రముఖ దర్శక,నిర్మాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి డాక్టర్ దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి అంటుకుంది. ఆయన మెడకు కోల్ గేట్ కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా యుపిఏను కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన కూడా ఓ నిందితునిగా చేరిపోయారు. ఈ కుంభకోణం పార్లమెంటు ఉభయ సభలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇదే కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు నివేదికను తెప్పించుకుని మార్పులు చేర్పులు చేసినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్‌...

Monday, 10 June 2013

అద్వానీ రాజీనామాను ఆమోదించం: బీజేపీ

న్యూఢిల్లీ: సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రాజీనామాను ఆమోదించేదే లేదు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీకి అద్వానీ సూచనలు, సలహాలు చాలా అవసరం అని అన్నారు. అద్వానీ రాజీనామా అనంతర పరిస్థితులపై పార్లమెంటరీ కమిటీ భేటిలో చర్చించామని బీజేపీ నేతలు వెల్లడించారు.&nbs...

పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ బీజేపీలోని అన్ని పదవులకు సోమవారం రాజీనామా చేశారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలకు రాజీనామా చేస్తూ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.  నరేంద్ర మోడీని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమించటంపై అసంతృప్తితో ఉన్న అద్వానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిట్‌ దీన్‌దయాళ్‌,...

మోడీతో లౌకికవాదానికి ముప్పు: చెన్నితల

తిరువనంతపురం: గుజరాత్ సీఎం నరేంద్రమోడీని 2014 లోక్‌సభ ఎన్నికల సమరానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియామించడంపై కేరళ పీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ నియామకం దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి సవాల్ అని వ్యాఖ్యానించారు. మోడీ పనితీరు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. మోడి, అద్వానీ నాణానికున్న రెండు పార్వ్శాలాంటి వారని పేర్కొన్నారు. మోడీని అద్వానీయే ఆమోదించలేకపోయారని చెన్నితల అన్నార...

Sunday, 9 June 2013

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో సోమ వారం (175వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీ నర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం ప్రకటించారు. మండపేట కె.పి. రోడ్డు నుంచి సోమవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 7.2 కిలోమీటర్ల నడక అనంతరం మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. రామచంద్రపురంలో జరిగే బహిరంగ...

ఉపఎన్నికలకు వీలుంది: గోనె ప్రకాశ్‌రావు

హైదరాబాద్: ఎన్నికలకు ఏడాది గడువుంటే ఉపఎన్నికలు నిర్వహంచకూడదన్న నిబంధన ఏదీ లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌తో సీఈసీ కుమ్మక్కై ఉపఎన్నికలు రావని చెబుతోందని ఆరోపించారు. ఏడాదిలోపే గడువున్నా ఉపఎన్నికలు నిర్వహించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్‌ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలపై కోర్టు తీర్పుఉందని తెలిపారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు నిర్వహించాలని న్యాయపోరాటం చేస్తారని చెప్పా...

ఆనం సోదరులకు మతిభ్రమించింది

తిరుపతి: జగన్‌ను విమర్శించడమే ఆనం సోదరులు పనిగా పెట్టుకున్నారని వైఎస్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆనం సోదరులు మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదవి వ్యామోహంతో సోనియా మెప్పుపొందేందుకు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం సోదరులకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.  టీడీపీలో గుర్తింపు పొందేందుకే వర్ల రామయ్య అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.&nbs...

రేవంత్ డిమాండ్ కే సిబిఐ స్పందించిందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు కొత్త ఆరోపణ సంధిస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన తర్వాతే సిబిఐ విజయసాయి రెడ్డి, జగన్ లను ఒకే జైలులో ఉంచరాదని కోర్టులో మెమో దాఖలు చేసిందని రాంబాబు అంటున్నారు.ఇక్కడే అనుమానం వస్తోందని ఆయన చెబుతున్నారు.ఇప్పటివరకు నిందితులను వేర్వేరు జైళ్లలో ఉంచాలని సిబిఐ కోరలేదని,రేవంత్ రెడ్డి కోరిన తర్వాతే ఇది జరిగినట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం సాక్ష్యాలు తారుమారు చేస్తారనే...

సి.ఎమ్.క్యాంప్ ఆపీస్ వద్ద టిడిపి దర్నా

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ ను కలిసి తాము దీనిపై వివరించాలని అనుకున్నామని,కాని ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా తమను అడ్డుకోవడం పద్దతి కాదని టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. వారంతా సి.ఎమ్.క్యాంప్ ఆపీస్ వద్ద భైఠాయించారు.అయితే ముఖ్యమంత్రి వీరికి ఎందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదో తెలియదు.ముందుగా అప్పాయింట్ మెంట్ కోరకుండా వీరు క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారా?లేక లోపలికి వచ్చి వారు గొడవకు దిగే అవకాశం ఉందని కిరణ్ వారిని కలుసుకోలేదా...

ముఖ్యమంత్రి కిరణ్ ను అసమ్మతి మంత్రులు ఏమీ చేయలేరా!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అధిష్టానంలో పట్టు పెరిగిందా?కాంగ్రెస్ లో ఆయనదే పై చేయి అవుతోందా?కాంగ్రెస్ లో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతిని తుంచడానికే మొగ్గు చూపుతోందని సి.ఎమ్ శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోంది. వైద్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని బర్తరఫ్ చేసిన తీరు పై అసమ్మతి ఏర్పాడింది. అసమ్మతి మంత్రులు డిల్లీ వెళ్లి దానిపై తమ అబిప్రాయాలు చెప్పినా అధిష్టానం సీరియస్ గా పట్టించుకోలేదన్న...

బిజెపి బ్రాండ్ అంబాసిడర్ గా నరేంద్ర మోడీ

మొత్తం మీద బిజెపి బ్రాండ్ అంబాసిడర్ గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. పార్టీ అగ్ర నేత ఎల్.కె. అద్వాని కి అంతగా ఇష్టం లేకపోయినప్పట్టికీ పార్టీ అద్యక్షుడుగా ఉన్న రాజ్ నాద్ సింగ్ ఆధ్వర్యంలో కార్యవర్గం ఈ నిర్ణయం తీసేసుకుంది.దీనిపై మోడీ అనుకూల వర్గం అంతా ఆనందంతో ఉంది.కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణలో బీజేపీకే పట్టం కడతారని దీమా వ్యక్తం చేశారు. మోడి నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని...

స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు

కేంద్ర ప్రభుత్వం సిబిఐ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.తమను అనర్హులుగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర నెలలు జాప్యం చేసి ఆ తర్వాత వేటు వేశారని, తద్వారా ఉప ఎన్నికలు రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు సలహా మేరకే ఈ వేటు పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు...

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాతో మందకృష్ణ భేటీ ఆంతర్యం!

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రంపై బాగానే దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మద్య కాలంలో ఆంద్రప్రదేశ్ కు సంబందించిన పలువురు నేతలు,ప్రముఖులను ఆమె కలుసుకుని ఆయా అంశాలపై మాట్లాడుతున్నారన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. తాజాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అదినేత మంద కృష్ణ మాదిగ తో కూడా ఆమె సమావేశం అయ్యారు.ఎస్ సిలను వర్గీకరణ చేయాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు మంద కృష్ణ చెప్పారు. ఎస్ సిలను వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్ ఆ వర్గాల ఓట్లు...

Tuesday, 4 June 2013

Special edition on Godavari Sakshigaa..

...

ఆ చేతి స్పర్శ కొండంత ధైర్యం... నిండైన భరోసా...

జగనన్న! ఆ పేరు తలచుకుంటే సామాన్యుడి ఛాతీ సముద్రమంత అవుతుంది ఆ రూపం గుర్తొస్తే చెయ్యి సగర్వంగా మీసం మీదకు చేరుతుంది నిద్రలో, మెలకువలో శత్రువులు సైతం జపిస్తున్న పేరది తడి నిండిన కళ్లతో రాష్ట్రమే తపిస్తున్న పేరది గడిచిన చరిత్ర కాదు - నడుస్తున్న వర్తమానం తను రాజకీయశక్తి కాదు... ఈ రాష్ట్ర భవిష్యత్తు తను..! చెక్కిలి తాకే ఆ చేతి స్పర్శ నేనెప్పుడూ అనుభవించలేదు కానీ దాని చల్లదనం నాకు తెలుసు కొండంత ధైర్యాన్ని కరపత్రంలా పంచే ఆ ఆలింగనాన్ని నేనెప్పుడూ అందుకోలేదు కానీ...

హెరిటేజ్ పాలలో ఈగ

‘బ్రింగ్ హోమ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్’ అనే స్లోగన్‌తో ప్రచారం చేసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో క్రిమి కీటకాలు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఒక వినియోగదారుడు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో ఈగ దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడు. గతంలో కూడా అనేకసార్లు హెరిటేజ్ పాలలో క్రిమికీటకాలు దర్శనమిచ్చిన విషయం విదితమే. పాల శుద్ధి, ప్యాకింగ్‌లో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు...

ఈ వర్షంతో నాన్నే ఆశీర్వదించినట్లుంది

అది గోదారమ్మ పశ్చిమ తీరం.. మంగళవారం సాయంత్రం 4.40 అవుతోంది.. ఒక వైపు గోదారమ్మ హొయలు... మరోవైపు సూర్యుని సెగలు.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రేవువైపు షర్మిల నడుస్తున్నారు. మరోవైపు ఆమె వెంట తరలివస్తున్న జన నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో పొద్దంతాసెగలు చిమ్మిన సూర్యుడు మబ్బుల్లోకి పోయాడు. షర్మిల నదిలోకి వెళ్లి తల్లి గోదారికి దండం పెట్టారు. పసుపు, కుంకుమ, గాజులు గోదారమ్మకు సమర్పించారు. తలో ఆకాశంలో ఏదో మార్పు.. చూస్తుండగానే మబ్బులు కమ్ముకున్నాయి....

జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?

టీడీపీని కబ్జా చేసి.. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి.. ఒక్క లోకేశ్‌నే పైకి తేవాలనుకోవడం లోక కల్యాణం కాదు..  లోకాన్ని దోచుకుని మీరు సంపాదించుకున్న ఆస్తులేమో లోకేశ్‌కు ఇస్తారు.. జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా? జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా? చంద్రబాబూ.. మీకు పదవీ వ్యామోహం లేదంటే మీ పార్టీ వారే నమ్మరు ఇప్పుడు వెలుగులు నింపుతానంటున్నారు.. మరి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఏంచేశారు? షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’...

న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ

గూడూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైలులో అక్రమంగా నిర్బంధించడం ముమ్మాటికీ కుట్రపూరితచర్యేనని పలువురు న్యాయవాదులు, మేధావులు, సామాన్యప్రజలు అభిప్రాయపడ్డారు. కేంద్రం సీబీఐని కీలుబొమ్మలా ఆడిస్తోందన్నారు. ప్రాథమికంగా ఎటువంటి ఆధారాల్లేని కేసులు బనాయించి జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నాయన్నారు.  శ్రీపొట్టి శ్రీరాములు...

తెలంగాణ రాబందుల పార్టీ

రాజకీయ పార్టీలు ఒకదానిని ఒకటి విమర్శించుకోవడానికి కొత్త,కొత్త డైలాగులు కనిపెడుతుంటాయి. టిడిపిని తెలంగాణ ద్రోహుల పార్టీగా టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల పార్టీగా టిడిపి వ్యాఖ్యానించింది.టిడిపి ఎమ్మెల్యేలు సీతక్క,సత్యవతి రాధోడ్ లు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.తెలంగాణలో పలువురు మరణానికి కారణం టిఆర్ఎస్ అని వారు వ్యాఖ్యానించారు.అవకాశవాదులే టిఆర్ఎస్ లో చేరుతున్నారని వారు మండిపడ్డారు.సీమాంధ్ర పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయానని కడియం శ్రీహరి అంటున్నారని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కడియంకు 2013లోనే కనువిప్పు...

బీజేపీతో మాది మిత్ర వైరుధ్యమే: కేటీఆర్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో తమకు మధ్య ఉన్నది మిత్రవైరుధ్యం మాత్రమేనని.. శత్రుత్వం కాదని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కోరుకునే ఏ సంస్థలకు చెందిన వారినైనా తాము సోదరులుగానే చూస్తామని తెలిపారు. వారితో చిన్నచిన్న అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ, యూపీఏ తెలంగాణ ఇస్తామంటూ మో సం చేశాయని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణ...

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో బుధవారం (170వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ప్రకటించారు. రాజమండ్రి సెయింట్ పాల్స్ చర్చి వద్ద నుంచి షర్మిల బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారు. 5.4 కిలోమీటర్ల నడక అనంతరం శానిటోరియం సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.9 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. మధురపూడి సమీపంలోని బత్తుల సత్తిరాజు తోటలో...

కెసిఆర్ ప్రజల ఆస్తి

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై చేసిన విమర్శలను ఆయన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు ఘాటుగా తిప్పికొట్టారు.తాము ఉద్యమంలో పాల్గొంటే మీరు పదవులలో కులుకుతారా అని ఆయన సీరియస్ గా ప్రశ్నించారు.తెలంగాణ ద్రోహులు చట్టసభలలో ఉంటే,తెలంగాణ బిడ్డలు రోడ్లపై ఉండాలా అని ఆయన ప్రశ్నించారు.టిఆర్ఎస్ కు ఓట్లు ,సీట్లు రాకూడదా అని కెటిఆర్ ప్రశ్నించారు.ఓట్లు,సీట్లతోనే టిఆర్ఎస్ రాజకీయ అస్థిత్వాన్ని సాధిస్తుందని...

జానా మాటలు ఏమి చెబుతున్నాయి..

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ప్రకటనలు ఒక్కోసారి భలేగా ఉంటాయి.తెలంగాణపై ఆయన చేసిన ప్రకటన అలాంటిదే.తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అంటున్నారు. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందని చెబుతూ, తెలంగాణపై అధిష్టానం మరోసారి చర్చలకు పిలుస్తుందని జానా అంటున్నారు.చర్చలు నిరంతర ప్రక్రియ అంటే ఇప్పట్లో తేలదని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా?అయితే అదే సమయంలో యధా ప్రకారం అదిష్టానంపై నమ్మకం ఉంచారు.కాగా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడానికి...

వై.ఎస్.ను తిడితే పదవి ఇచ్చారుగా..

డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిడితే మంత్రి పదవులు ఇచ్చారని, కిరణ్‌ను తిడితే మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. డి.ఎల్.గతంలో వై.ఎస్.ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని జూపూడి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి అని ఆయన ఎద్దేవ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు...

అప్పట్లో నాగం, కెసిఆర్ లు ఒక గూటి పక్షులే!

మున్ముందు రోజులలో బిజెపి, టిఆర్ఎస్ లకు మధ్య కూడా మాటల యుద్దం ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.గతంలో నాగం జనార్ధనరెడ్డి తెలంగాణ కోరుకునే నాయకులు ఒకరినొకరు విమర్శించుకోకూడదని అంటుండేవారు. ఆయన ఇప్పుడు ఒక పార్టీలోకి వచ్చాక దానిని పక్కన బెట్టి విమర్శల పర్వంలోకి దిగారు.స్టేషన్ ఘనపూర్ లో కెసిఆర్ ఈయనపై విమర్శలు చేశారు. దానికి బదులు చెబుతూ, టీఆర్‌ఎస్ ఆవిర్భావం ముందే బీజేపీ రెండు రాష్ట్రాలు కావాలి కోరిందని నాగం చెప్పారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అడ్రస్...