పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ప్రకటనలు ఒక్కోసారి భలేగా ఉంటాయి.తెలంగాణపై ఆయన చేసిన ప్రకటన అలాంటిదే.తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అంటున్నారు. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందని చెబుతూ, తెలంగాణపై అధిష్టానం మరోసారి చర్చలకు పిలుస్తుందని జానా అంటున్నారు.చర్చలు నిరంతర ప్రక్రియ అంటే ఇప్పట్లో తేలదని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా?అయితే అదే సమయంలో యధా ప్రకారం అదిష్టానంపై నమ్మకం ఉంచారు.కాగా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడానికి అజాద్ పిలిపించారని ఆయన వెల్లడించడం విశేషం. అంటే చివరికి పంచాయతీ ఎన్నికలు పెట్టాలా?వద్దా?అన్నదానిపై కూడా డిల్లీ పెద్దలే నిర్ణయించాల్సి వస్తున్నదని అనుకోవాలా?ఈ నెల 11లోపు పంచాయతీ రిజర్వేషన్లు పూర్తిచేస్తామన్నారు. జులై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయని , ఆగస్టు చివరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుండే అవకాశం ఉందని జానారెడ్డి తెలియచేశారు.కాగా మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ గురించి బాధపడుతున్నానని అనడం విశేషం.
0 comments:
Post a Comment