హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో తమకు మధ్య ఉన్నది మిత్రవైరుధ్యం మాత్రమేనని.. శత్రుత్వం కాదని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కోరుకునే ఏ సంస్థలకు చెందిన వారినైనా తాము సోదరులుగానే చూస్తామని తెలిపారు. వారితో చిన్నచిన్న అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ, యూపీఏ తెలంగాణ ఇస్తామంటూ మో సం చేశాయని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణ కోసం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నప్పుడు ఏ ఒక్క రోజూ బీజేపీ సభ్యులు కలిసి రాలేదని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు వల్లే తెలంగాణ ఇవ్వలేకపోయామని చెబుతున్న బీజే పీ నేతలు.. రేపు వెంకయ్యనాయుడు అడ్డు అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.
0 comments:
Post a Comment