విశాఖ: టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు గురువారం రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు నేరుగా పంపించినట్టు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితుల వల్లే రాజీనామా సమర్పించానని దాడి వివరణ ఇచ్చారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ జిల్లాలో జరిగిన చంద్రబాబు పాదయాత్రకు దాడి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. దాడి బాటలోనే తనయుడు జిల్లా అధ్యక్ష పదవికి రత్నాకర్ గుడ్‌బై చెప్పారు.
శుక్రవారం అనకాపల్లిలో కార్యకర్తలతో దాడి అత్యవసర సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు అప్పట్లో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలి దాడి టీడీపీలో చేరారు. దాడి రాజీనామాతో ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతను టీడీపీ కోల్పోయింది. ఆరేళ్ల పాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా దాడి వీరభద్రరావు వ్యవహరించారు.
0 comments:
Post a Comment