రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి, రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వీరిద్దరూ రాజీనామాకు సంసిద్దమై వచ్చారని ప్రచారం ఆరంభమైంది.పైగా సబిత ప్రభుత్వ వాహనంలో కాకుండా సొంత వాహనంలో వెళ్లారని కూడా అంటున్నారు. దీంతో రాజీనామాకు సిద్దమై ఆమె వెళ్లారని అంటున్నారు. ధర్మాన అయితే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకుంటారని అంటున్నారు.కాగా మరో మంత్రి పార్ధసారధికి ఏకంగా శిక్ష పడితేనే రాజీనామా కోరకుండా చార్జీషీట్ లో ఉన్న తమను రాజీనామా చేయాలని కోరతారా అని ఈ మంత్రులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment