హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ అసంతృప్తిని వెల్లగక్కారు. మైనార్టీలంతా వైఎస్‌ఆర్ సీపీ పక్షాన్నే ఉన్నారని మైనార్టీల కోసం ఏదైనా కొత్త పథకం ప్రవేశ పెడితేగానీ కాంగ్రెస్ వైపు రారని కదిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాహుద్దీన్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించకుంటే తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టదని ఆదిలాబాద్ నేత హరికృష్ణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పథకాలు జిల్లా నేతలకే తెలియకుంటే ప్రజలకు ఏం తెలుస్తాయని ఎమ్మిగనూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే ఇప్పుడున్న పాలకులు పెళ్లి కొడుకుల్లా భోగాలు అనుభవిస్తున్నారని కామారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల్‌గౌడ్ విరుచుకుపడ్డారు. జిల్లా స్థాయి నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment