హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు నిరాశ పరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.
మంత్రులు ప్రభావితం చేయలేని సాక్షులను జగన్ ఎలా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి సూటి ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు బెయిల్ రాదని చెప్పనట్లే జరిగిందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజులుగా ఏంచేశారన్నది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. సీబీఐ వాదనపట్ల ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
0 comments:
Post a Comment