హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అదే సీబీఐ....ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల విషయంలో అలా ఎందుకు వ్యవహరించడంలేదని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.
దొంగల వద్దకు వెళ్లి చార్జిషీటు మార్చిన ఘనత సీబీఐదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ చిలక అని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. రాహుల్‌కు చరిష్మా ఉంటే అతన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. కర్ణాటక ఫలితాలు ముందుగానే ఊహించామని కిషన్ రెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment