పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్.పి వివేక్ అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావుకు అప్పుడే సలహా ఇస్తున్నారు.కెసిఆర్,కెకెల ద్వారానే తెలంగాణ రాదని, అందరిని కలుపుకుపోవాలని వివేక్ సూచిస్తున్నారు.ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరేవారికి సీట్లిస్తే తప్పేంటని,తెలంగాణ కోసం అందరినీ కలుపుకోవాలని కేసీఆర్‌కు కూడా సూచిస్తానని వివేక్ అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై విమర్శలు చేయిస్తున్నారని, తన వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నారని కూడా వివేక్ ఆరోపించారు.వివేక్ కాంగ్రెస్ లో మాదిరిగా ఇక్కడ కూడా ఏమైనా హడావుడి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందిపడతారేమో. ఎంత అయినా ఇది ఉప ప్రాంతీయ పార్టీ కదా!
0 comments:
Post a Comment