Sunday, 2 June 2013

ఇంత అవమానమా!డి.ఎల్. ఆగ్రహం

సీనియర్ నేత డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి తనను బర్తరఫ్ చేసిన తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను సోనియాగాంధీకి ఎప్పుడో రాజీనామా లేఖ పంపితే,దానిని పట్టించుకోకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేయడానికి అనుమతి ఇవ్విడం ఏమిటన్నది ఆయన ఆవేదనగా ఉంది.తన రాజీనామాను ఆమోదించి ఉంటే బాగుండేదని ఆయన తనతో మాట్లాడిన మీడియాతో అన్నారు.తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఆయన వాపోతున్నారు. కిరణ్ వ్యవహార శైలి వల్ల పార్టీ నష్టపోతున్నదని చెబుతున్నానని, అయినా తనపట్ల ఇలా అధిష్టానం వ్యవహరిస్తుందనుకోలేదని ఆయన వాపోతున్నట్లు చెబుతున్నారు.దీనిపై ఏమి చేయాలన్నదానిపై మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. కాగా జగన్ కేసుల చాలా తీవ్రంగా వ్యవహరించిన డాక్టర్ పి.శంకరరావు, అలాగే ఎమ్.ఆర్.కేసులో తీవ్రంగా మాట్లాడిన డి.ఎల్.రవీంద్ర రెడ్డి ఇద్దరూ పదవులు పోగొట్టుకోవడం, అది కూడా అవమానకరమైన రీతిలో ఇంటిబాట పట్టడం విశేషం.అయితే డి.ఎల్.తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుందా అన్నది ప్రస్తుతానికి సందేహమే.అయితే గతంలో ఆయన వేరే పార్టీలోకి వెళ్లవచ్చని ప్రచారం జరిగింది కాని దానిని ఆయన ఖండించారు.

1 comment:

  1. ippatike late chesaru....padhavilo unchi......eppudo thiyalsindi bt ippatikaina CM garu manchi pani chesaru.... Congrats to CM

    ReplyDelete