Sunday, 5 May 2013

Ram Charan goes berserk at Taj Deccan hotel Video

మహిళల సంక్షేమానికి వైఎస్ కృషి: YS విజయమ్మ


గుంటూరు: మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నదే అంబేద్కర్ ఆశయమని వైఎస్ విజయమ్మ అన్నారు. ఇటీవల కాలంలో వరకట్న వేధింపులు-లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని విజయమ్మ అన్నారు. మహిళలు బలహీనులు కాదని, మగవాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలని విజయమ్మ అభిప్రాయపడ్డారు. మహిళలపై కొంత మంది నేతల వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని విజయమ్మ అన్నారు. 
మహిళా సంక్షేమానికి మహానేత ఇచ్చినన్ని నిధులు ఎవరూ కేటాయించలేదని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని వైఎస్ఆర్ చాలా పథకాలు చేపట్టారని విజయమ్మ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆప్కారీ మీద ఎంతో డబ్బు వస్తున్నా పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని..పేదల కడుపుకొడుతున్న మద్యంపై నియంత్రణ చేయాలని జగన్ ఎప్పుడూ అంటుంటారని విజయమ్మ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని విజయమ్మ డిమాండ్ చేశారు. మహానేత వారసుడిగా జగన్, మహిళలకు న్యాయం చేస్తారని విజయమ్మ తెలిపారు.

మహిళలకు భద్రతలేదు: YS విజయమ్మ


బాపట్ల: రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు భద్రతలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'మహిళానగారా' పేరుతో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయన్నారు. మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో ఈ రకమైన అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నాంగా ఉందని చెప్పారు. గ్రామీణుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్న మద్యపానాన్ని నియంత్రిస్తామని జగన్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని జగన్ చెప్పారన్నారు. బెల్టుషాపులను గుర్తించి తొలగించేదుకు, మహిళలకు రక్షణగా మహిళా రక్షకభటును కూడా నియమిస్తామని జగన్ చెప్పినట్లు తెలిపారు.

మహిళా సంక్షేమానికి వైఎస్ కేటాయించినన్ని నిధులు మరెవరూ కెటాయించలేదన్నారు. మహిళలను ఆయన అక్కయ్యా, చెల్లెమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారని గుర్తు చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆడపిల్లలు కూడా ఉన్నత చదువుకున్నారని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరుగురు మహిళలు మంత్రులుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా హొం శాఖను కూడా మహిళకే అప్పగించారని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

ఆహ్వానం అందలేదు: ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి

గుంటూరు: పార్లమెంట్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనకు ఆహ్వానం అందలేదని లక్ష్మీపార్వతి తెలిపారు. దీనికి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ బాధ్యత వహించాలన్నారు. ఎన్టీఆర్ భార్యనైన తనకు ఆహ్వానం ఎందుకు పంపలేదని ఆమె ప్రశ్నించారు. పురందేశ్వరి ఇష్టం వచ్చిన వారికే ఆహ్వానాలు పంపిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్ లకు లేఖ రాస్తానని చెప్పారు. 

చేయిచేసుకున్న చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్

హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ ఓవరాక్షన్ చేశాడు. తన కారును ఢీకొట్టాడనే కారణంతో హీరో రామ్ చరణ్ ఓ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడు. తాజ్ డెక్కన్ హోటల్ వద్ద తన ఆస్టన్ మార్టిన్ కారును ఢీకొట్టడంతో చరణ్ రెచ్చిపోయాడు. తన కారును ఢీకొట్టిన మారుతి 800 వాహనదారుడిని చితకొట్టాడు. చరణ్ సెక్యూరిటీ గార్డు కూడా అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో వాహనదారుడికి గాయాలయ్యాయి. అతడి చొక్కా కూడా చిరిగిపోయింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

రేపే జగన్ కు బెయిల్

" జగన్ సోమవారం బెయిల్ పై బయటకు వస్తారు. తర్వాత రాష్ట్ర రాజకీయాలన్నీ చాప చుట్టేసినట్టు ఒకే దిక్కు.. వై సీ పీ వైపు తిరుగుతాయి" అని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సి జూపూడి ప్రభాకరరావు అన్నరు. బెయిల్ వస్తుందని అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే.. 'కోర్టులపై గురవం ఉన్న ఆశావాదులం. జగన్ కు 6న బిల్ వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. అది మా విశ్వాస స్తాయి' అని బదులిచ్చారు. అయన శనివారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. జగన్ ను జైలు లో పెట్టి 11 నెలలు అయిపోయిoదని, వాస్తవానికి 90 రోజుల తర్వాతే బెయిల్ ఇవ్వాల్సి ఉందన్నారు. జగన్ కనుసైగ చేస్తే ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారని, కాని వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కుల్చబోమని జగన్ ఇది వరకే చెప్పారని గుర్థుచెశారు. వైసిపీలో చేరుతున్న వారిని తిట్టించటం చంద్రబాబు కు తగదని జూపూడి హితువు పలికారు. "గేట్లు తెరవటం గురుంచి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన గేట్లు తెరిస్తే వాళ్ల పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉండరు. ఉన్న వాళ్ళే పోతారు" అని ఎద్దేవా చేశారు . కొండ మీద ఉన్నారా? లోయలో ఉన్నారా? అనేది చూసుకోవాలని, తమ పార్టీ లోకి వచ్చే వారిని విమర్శిస్తే ఉరుకోనేది లేదని హెచ్చరించారు. వై సి పీ లోకి వస్తున్నా వారు పదవుల కోసం వచ్చిన వారు కాదని,  ప్రజా సేవ కోసమే వస్తున్నారని చెప్పారు. అయితే వారు ఏ పార్టీ లో ఉంటే, ఆ పార్టీ తరపున మాట్లాడుతారని అనుకోవట్లేదన్నారు. సుదిర్ఘమైన అనుభవం తో వస్తున్న దాడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి శంకర్ రావు వస్తానంటే పార్టీ లోకి తీసుకుంటారా అని ప్రశ్నిస్తే ... ఆయనను మాత్రం చేర్చుకోబోమని జూపూడి స్పష్టం చేశారు.

మహిళలకు స్పూర్తి YS విజయమ్మ:రోజా


బాపట్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల మహిళల అందరికి స్పూర్తి అని ఆ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. మహిళల ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా, వారి ఆర్థిక భద్రతతే లక్ష్యంగా గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'మహిళ నగారా' పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమె ప్రసంగించారు. భర్త చనిపోయినా, కొడుకుని జైలులో పెట్టినా ప్రజలకు అండగా విజయమ్మ నిలిచారని కొనియాడారు. ఆమెకు పాదాభివందనం చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, వారికి భరోసా ఇవ్వడానికి వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తున్న షర్మిలకు చేతులెత్తి నమస్కరించాలన్నారు.

దేశంలో మహిళలకు రక్షణలేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాగ్రామాన మద్యం బెల్ట్ షాపులు పెరిగిపోయాయన్నారు. మద్యం మత్తులో వావివరసలు కూడా మరచి కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

టీడీపీ కాలం చెల్లిన మందు:చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కాలం చెల్లిన మందు లాంటిదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం హైదరాబాద్ లో వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నుంచి వలసలే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.బాబు గేట్లు ఎత్తితే ఆ పార్టీలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరూ మిగలరని తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర వృధా ప్రయాసగానే మిగిలిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2014లో చింజీవి ముఖ్యమంత్రి అవుతారన్న దేవాదాయ శాఖ మంత్రి సీ. రామచంద్రయ్య వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. 

'బంగారుతల్లి'కి చట్టబద్థత కల్పిస్తాం


ఏలూరు: త్వరలో బంగారుతల్లి పథకానికి చట్టబద్థత కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ ఆదివారం ఏలూరులో స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఏలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 
కేబినెట్ తో చర్చించిన అనంతరం చట్టబద్థత తీసుకొస్తామని అన్నారు. అమ్మహస్తం పథకంలో అదనంగా మరికొన్ని వంటసరుకులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. 
ఈ ఒక్క ఏడాదిలోనే మహిళలకు రూ.16,500 కోట్లు రుణాలుగా అందించినట్లు సీఎం కిరణ్ వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అమ్మహస్తం పథకం అసలు ఇష్టం లేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో బెల్టుషాపులను రద్దు చేయాలని సీఎం కిరణ్ ను కేంద్ర మంత్రి జైరాం రమేష్ బహిరంగ సభాముఖంగా కోరారు. దీంతో వెంటనే స్పందించిన కిరణ్... రాష్ట్రంలో బెల్టు షాపుల తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

'సీఎం పదవికి తగిన నేత చిరంజీవి'

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర పర్యాటక మంత్రి, సినీనటుడు చిరంజీవిపై ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సీ. రామచంద్రయ్య ఆదివారం విజయవాడలో అభిప్రాయపడ్డారు. సీఎం అభ్యర్థిగా చిరంజీవి ఎన్నికల బరిలో దిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం పదవికి తగిన నేత చిరంజీవి అని ఆయన స్పష్టం చేశారు.