Sunday, 5 May 2013

'బంగారుతల్లి'కి చట్టబద్థత కల్పిస్తాం


ఏలూరు: త్వరలో బంగారుతల్లి పథకానికి చట్టబద్థత కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ ఆదివారం ఏలూరులో స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఏలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 
కేబినెట్ తో చర్చించిన అనంతరం చట్టబద్థత తీసుకొస్తామని అన్నారు. అమ్మహస్తం పథకంలో అదనంగా మరికొన్ని వంటసరుకులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. 
ఈ ఒక్క ఏడాదిలోనే మహిళలకు రూ.16,500 కోట్లు రుణాలుగా అందించినట్లు సీఎం కిరణ్ వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అమ్మహస్తం పథకం అసలు ఇష్టం లేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో బెల్టుషాపులను రద్దు చేయాలని సీఎం కిరణ్ ను కేంద్ర మంత్రి జైరాం రమేష్ బహిరంగ సభాముఖంగా కోరారు. దీంతో వెంటనే స్పందించిన కిరణ్... రాష్ట్రంలో బెల్టు షాపుల తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

0 comments:

Post a Comment