Sunday, 5 May 2013

మహిళలకు స్పూర్తి YS విజయమ్మ:రోజా


బాపట్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల మహిళల అందరికి స్పూర్తి అని ఆ పార్టీ నాయకురాలు రోజా అన్నారు. మహిళల ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా, వారి ఆర్థిక భద్రతతే లక్ష్యంగా గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'మహిళ నగారా' పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమె ప్రసంగించారు. భర్త చనిపోయినా, కొడుకుని జైలులో పెట్టినా ప్రజలకు అండగా విజయమ్మ నిలిచారని కొనియాడారు. ఆమెకు పాదాభివందనం చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, వారికి భరోసా ఇవ్వడానికి వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తున్న షర్మిలకు చేతులెత్తి నమస్కరించాలన్నారు.

దేశంలో మహిళలకు రక్షణలేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాగ్రామాన మద్యం బెల్ట్ షాపులు పెరిగిపోయాయన్నారు. మద్యం మత్తులో వావివరసలు కూడా మరచి కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

0 comments:

Post a Comment