కరీంనగర్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఎలక్షన్, కలెక్షన్ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఆరోపించారు. కోటీశ్వరులకు టికెట్లు అమ్ముకుని, తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే నిర్బంధ ఉచిత విద్య అని కేసీఆర్ అంటున్నారని, టిఆర్ఎస్ లో చేరినవారి విద్యాసంస్థల కళాశాలల్లో ఎంతమందికి ఉచిత విద్య అందిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కెసిఆర్ కంకణం కట్టుకున్నారన్నారు.
0 comments:
Post a Comment