హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకున్న సందర్భంగా కువైట్‌లోని పార్టీ అభిమానులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కువైట్‌లోని హవల్లీ ప్రాంతం వద్దకు వారు శుక్రవారం పెద్ద సంఖ్యలో చేరుకొని హర్షం వ్యక్తం చేశారు. మండుటెండలో కూడా షర్మిల తన పాదయాత్ర కొనసాగిస్తూ... రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటడం ద్వారా ప్రపంచ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేకనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐని అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పి.రెహమాన్, పి.వాసుదేవరెడ్డి, గోవింద్ నాగరాజు, షేక్ ఇనాయత్, జీఎం బాబు రాయుడు, సత్తార్‌ఖాన్, రమణయాదవ్‌లతో పాటు పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment